Jump to content

దావూద్ ఇబ్రాహీం

వికీపీడియా నుండి
(దావూద్ ఇబ్రహీం నుండి దారిమార్పు చెందింది)
దావూద్ ఇబ్రాహీం కస్కర్
దావూద్ ఇబ్రాహీం
జననం (1955-12-27) 1955 డిసెంబరు 27 (వయసు 68)
ఎత్తు5'11
జీవిత భాగస్వామిజుబీనా జరీన్

దావూద్ ఇబ్రహీం ఒక అంతర్జాతీయ నేరగాడు.

నేపధ్యము

[మార్చు]

దావూద్ 1955, డిసెంబరు 26 న మనదేశం లోని మహారాష్ట్ర లోని రత్నగిరి జిల్లాలో జన్మించాడు. తండ్రి ఒక సాధారణ కానిస్టేబుల్. ముంబై మహా నగర నేరకేంద్రం డోంగ్రీలో 1974లో సృష్టించిన సంచలనం ద్వారా మొట్టమొదట నేర సామ్రాజ్యంలో ఇతని పేరు మారుమోగింది. అప్పటికి అక్కడ డాన్‌గా ఉన్న పఠాన్ బాషు దాదా మీద ఇతడు సోడాసీసాలతో దాడి చేశా డు. ఆపై హాజీ మస్తాన్, వరదరాజన్ మొదలియార్, కరీంలాలా వంటి డాన్‌లను పక్కకు నెట్టేసి పైకొచ్చాడు. 1950లలో కేవలం కత్తిపోట్లకు పరిమితమైన ముంబై మాఫియా కార్యకలాపాలను అంతర్జాతీయ నేరాల స్థాయికి తీసుకువెళ్లినవాడు దావూద్.

నేర సామ్రాజ్యము

[మార్చు]

1976లో అతడు ప్రారంభించిన ‘డి కంపెనీ’ పెద్ద నేరాలే చేసేది. 1982 నాటి ముంబై కార్మికుల సమ్మె నగరం స్వరూపాన్నే కాదు, మాఫియా ముఠాల విస్తృతిని కూడా ఊహకు అందనంతగా మార్చేసింది. డి కంపెనీ ఆయుధాల రవాణా, హవాలా, దొంగనోట్లు, మత్తు పదార్థాల రవాణా, బెదిరించి డబ్బు వసూలు చేయడం, కాంట్రాక్ట్ హత్యల వరకు విస్తరించింది. ‘బిగ్ డి’ సినిమాలకు పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టాడు. బాలీవుడ్ ప్రముఖులతో కూడా దావూద్ సంబంధాలు కలిగి ఉన్నాడు. భరత్‌షా వంటి వారు ఈ కారణంగా అరెస్టయ్యారు. నటి మందాకినితో దావూద్ సంబంధం ఇంకా గాఢమైనది. అయోధ్య పరిణామాల అనంతరం ఛోటా రాజన్ హిందువుల కుటుంబాల యువకులతో కొత్త కుంపటి పెట్టుకున్నాడు. అయోధ్య ఘటనలకు ప్రతీకారంగానే 1993 ముంబై వరస పేలుళ్లు జరిగాయి. దీంట్లో కీలక పాత్రధారి టైగర్ మెమన్, దావూద్ ముఖ్య అనుచరుడు. ఆ పేలుళ్ల సమయంలో నగరంలోని లేని దావూద్ మళ్లీ భారత్‌లో కనిపించలేదు. 250 మంది మృతికి కారణమైన ఆ పేలుళ్ల వెనుక దావూద్ ఉన్నాడని మన సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది.

పాకిస్తాన్ ఆశ్రయం

[మార్చు]

1993 ముంబై వరస పేలుళ్లు తర్వాత ఇతను మనదేశాన్ని వదిలిపెట్టి పాకిస్తాన్ పారిపోయాడు. అప్పటినుండి డి కంపెనీకి పాక్ కేంద్రమైంది. అల్ కాయిదా, లష్కరే తాయిబా వంటి మత ఛాందస సంస్థలతో దావూద్ బంధం అక్కడ నుంచే ప్రారంభమైంది. ఒసామా బిన్ లాడెన్‌తో దావూద్‌కు సాన్నిహిత్యం ఉందని అమెరికా బయటపెట్టింది. అఫ్ఘానిస్థాన్ నుంచి అల్‌కాయిదా సభ్యులు పారిపోవడానికి తన మాఫియా మార్గాలను దావూద్ చూపించాడు. కరాచీలో దావూద్ ఉన్నాడని మొదటి నుంచి మనదేశం ఆరోపిస్తూనే ఉంది. దావూద్ భార్య, నలుగురు కుమార్తెలు, కుమారుడికి పాకిస్తాన్ పాస్‌పోర్టులు ఉన్నాయి. అయితే దావూద్ దేశంలో ఉన్నట్టు పాకిస్థాన్ ఏనాడూ అంగీకరించలేదు. కరాచీ కేంద్రంగా ఇతడు దక్షిణాసియా మొత్తం తన నేరసామ్రాజ్యాన్ని విస్తరించాడు. మలేసియా, సింగపూర్, థాయ్‌లాండ్, శ్రీలంక, నేపాల్, దుబాయ్‌ లతోపాటు జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లండ్‌లలో కూడా ఇతడి కార్యకలాపాలు విస్తరించాయి. ఇతడి లావాదేవీల విలువ 3 వేల కోట్ల రూపాయలకు పైనే. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలోనూ డి కంపెనీ పాత్ర ఉంది. ఇతను చాలా దుర్మార్గుడు.

మూలాలు

[మార్చు]