దావాజిగూడెం
దావాజిగూడెం | |
— రెవెన్యూ గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°30′N 80°48′E / 16.5°N 80.8°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | గన్నవరం |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీమతి తిరివీధి మరియమ్మ |
పిన్ కోడ్ | 521 101. |
ఎస్.టి.డి కోడ్ | 08656 |
"దావాజిగూడెం" కృష్ణా జిల్లా గన్నవరం మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 101., ఎస్.టి.డి.కోడ్ = 08656.
గ్రామ చరిత్ర
[మార్చు]గ్రామం పేరు వెనుక చరిత్ర
[మార్చు]గ్రామ భౌగోళికం
[మార్చు]సమీప గ్రామాలు
[మార్చు]సమీప మండలాలు
[మార్చు]గ్రామానికి రవాణా సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో విద్యా సౌకర్యాలు
[మార్చు]ఎన్.టి.టి.ఎఫ్. సాంకేతిక విద్యా కళాశాల
[మార్చు]నెట్టూరు టెక్నికల్ ట్రైనింగ్ ఫౌండేషన్, వృత్తివిద్య కళాశాల.
ప్రభుత్వ పాలిటెక్నిక్
[మార్చు]ఈ కళాశాలలో 2.77 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రెండవదశ భవన సముదాయాన్ని, 2016, జనవరి-26న ప్రారంభించారు. మూడవ దశలో 4.84 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న భవన సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన నిర్మించారు. [7]
శ్రీ ముక్కామల జగదీశ్వరరావు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల
[మార్చు]- ఈ పాఠశాలలో, నూజివీడు డివిజనులోని 77వ గ్రిగ్ మెమోరియల్ ఆటలపోటీలను, 2013-డిసెంబరు 9,10 తేదీలలో నిర్వహించారు. ఈ పాఠశాలలో 2014, నవంబరు-1న, నూతనం,గా ఏర్పాటుచేసిన సురక్షిత త్రాగునీటి పథకాన్ని, ప్రారంభించెదరు. [1]&[5]
- ఈ పాఠశాల వార్షికోత్సవం, 2016, ఫిబ్రవరి-21వ తేదీ శనివారంనాడు సందడిగా సాగినది. [8]
- ఈ పాఠశాలలో 8వ తరగతి చదువుచున్న తిరివీధుల అశోక్ అను విద్యార్థి, 2015-16 విద్యాసంవత్సరం పోటీపరీక్షలలో పాల్గొని, జాతీయ ఉపకారవేతనానికి అర్హత సాధించాడు. దీని ప్రకారం ఈ విద్యార్థి, నాలుగు సంవంవత్సరాల పాటు, ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయల ఉపకారవేతనం అందుకుంటాడు. [9]
మండల పరిషత్తు ప్రాధమికోన్నత పాఠశాల
[మార్చు]ఈ పాఠశాల వార్షికోత్సవం, 2016, ఏప్రిల్-6వ తేదీనాడు సందడిగా సాగినది. [10]
సి.ఎస్.ఐ.ప్రాధమిక పాఠశాల
[మార్చు]గ్రామములో మౌలిక వసతులు
[మార్చు]బ్యాంకులు
[మార్చు]సప్తగిరి గ్రామీణ బ్యాంకు. ఫోన్ నం. 08676/256622; చిరునామా:- కళ్యాణి ఆసుపత్రి భవనం, దావాజీగూడెం రహదారి, గన్నవరం-521 101.
గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం
[మార్చు]గ్రామ పంచాయతీ
[మార్చు]- ఈ గ్రామం బుద్దవరం గ్రామానికి శివారు గ్రామం.
- 2013జూలైలో బుద్ధవరం గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి తిరివీధి మరియమ్మ సర్పంచిగా ఎన్నికైనారు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయం
[మార్చు]గ్రామములోని పామర్తినగర్‌లో వేచేసియున్న ఈ ఆలయంలో, 2017,మార్చి-8వతేదీ బుధవారంనాడు, పండితుల వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ, ఈ ఆలయ పునఃప్రతిష్ఠ, శ్రీ సీతారాముల పట్టాభిషేక మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని వీక్షించారు. గ్రామప్రముఖులు, దాతలు సమకూర్చిన బంగారు, వెండి, పంచలోహ ఆభరణాలను సీతారాములకు అలంకరించి పట్టాభిషేకం నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు మద్యాహ్నం అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు గన్నవరం, బుద్ధవరం, అల్లపురం తదితర గ్రామాల నుండి నుండి భక్తులు తరలిరావడంతో గ్రామములో పండుగ వాతావరణం నెలకొన్నది. కళ్యాణం, పట్టాభిషేకం అనంతరం, 9వతేదీ గురువారంనాడు శ్రీ సీతారాముల శోభాయాత్ర (గ్రామోత్సవం) కన్నులపండువగా నిర్వహించారు. ఆలయం నుండి బయలుదేరిన ఈ శోభాయాత్ర గన్నవరం మీదుగా వెళ్ళి, తిరిగి ఆలయానికి చేరుకున్నది. ప్రదర్శన ముందు ఎద్దులు, గుర్రాలు, ఒంటెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచినవి. భక్తులు ఇళ్ళ ముందు అడుగడుగునా నిలిచి, నూతన దంపతులకు హారతి పట్టినారు. [14]
శ్రీ అభయాంజనేయస్వామివారి మందిరం
[మార్చు]దావాజీగూడెం గ్రామములో వేంచేసియున్న శ్రీ కోదండరామాలయం ఆవరణలో, నిర్మించనున్న ఈ మందిర నిర్మాణానికి, 2015, మే-31వ తేదీ ఆదివారంనాడు, తొలుత వేదపండితులు విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, వాస్తుపూజ, వాస్తుహోమం నిర్వహించి, అనంతరం, శంకుస్థాపన నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలను తిలకించేందుకు భక్తజనం అశేషంగా తరలివచ్చారు. [6]
నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహప్రతిష్ఠా మహోత్సవాలు, 2017,మార్చి-5వతేదీ ఆదివారం ప్రారంభమైనవి. గ్రామములోని శ్రీ సీతారామాంజనేయస్వామివారి ఆలయ సమీపంలో, నూతనంగా ఆలయ నిర్మాణం చేసి, అక్కడ శ్రీ అభయాంజనేయస్వామివారి విగ్రహ ప్రతిష్ఠాను 6వతెదీ సోమవారంనాడు వైభవంగా నిర్వహించారు. [13]
శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామివారి ఆలయం
[మార్చు]దావాజీగూడెం శివారు పామర్తినగర్‌లో వేంచేసియున్న ఈ ఆలయంలో, స్వామివారి జాతరను, 2017,ఫిబ్రవరి-23వతేదీ గురువారంనాడు వైభవంగా నిర్వహించారు. ఈ సంద్రభంగా ఆలయంలోని దేవేరులను ఏలూరుకాలువ వరకు గ్రామోత్సంగా తీసుకుని వెళ్ళి, పుణ్యస్నాలాచరింపజేసినారు. తిరిగి ఆలయానికి తీసికుని వచ్చి, ఆలయంలో విఘ్నేశ్వరపూజ, దీపారాధన నిర్వహించారు. స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో విచ్చేసారు. [12]
శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం
[మార్చు]శ్రీ రణ అంకమ్మ అమ్మవారి ఆలయం
[మార్చు]ఈ ఆలయంలో 2016, ఏప్రిల్-8, శుక్రవారంనాడు, ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని, వేకువఝామునే అమ్మవారికి ప్రత్యేక అలంకారం జరిపిన భక్తులు, పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేక వాహనంపై ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు డప్పువాయిద్యాలకు లయబద్ధంగా చిందులు వేసుకుంటూ సందడి చేసారు. దావాజీగూడెం పరిసరప్రాంతాల భక్తులు ఈ అధ్యాత్మిక కార్యకలాపాలలో పాల్గొన్నారు. [11]
ఈ ఆలయ దశమ వార్షికోతవం,2017,ఆగస్టు-19వతేదీ శనివారంనాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ పూజలు, అన్న సంతర్పణ నిర్వహించారు. [15]
గ్రామంలో ప్రధాన పంటలు
[మార్చు]గ్రామంలో ప్రధాన వృత్తులు
[మార్చు]గ్రామ ప్రముఖులు
[మార్చు]గ్రామ విశేషాలు
[మార్చు]మూలాలు
[మార్చు]వెలుపలి లింకులు
[మార్చు][1] ఈనాడు విజయవాడ/గన్నవరం; 2013,డిసెంబరు-11; 2వపేజీ. [2] ఈనాడు విజయవాడ; 2014,మార్చి-29; 9వపేజీ. [3] ఈనాడు విజయవాడ; 2014,ఆగస్టు-4; 5వపేజీ. [4] ఈనాడు విజయవాడ; 2014,ఆగస్టు-28; 5వపేజీ. [5] ఈనాడు విజయవాడ; 2014,నవంబరు-1; 4వపేజీ. [6] ఈనాడు అమరావతి; 2015,జూన్-1; 1వపేజీ. [7] ఈనాడు అమరావతి; 2016,జనవరి-28; 4వపేజీ. [8] ఈనాడు అమరావతి; 2016,ఫిబ్రవరి-21; 4వపేజీ. [9] ఈనాడు అమరావతి; 2016,మార్చి-5; 5వపేజీ [10] ఈనాడు అమరావతి; 2016,ఏప్రిల్-7; 4వపేజీ. [11] ఈనాడు అమరావతి; 2016,ఏప్రిల్-9; 4వపేజీ. [12] ఈనాడు అమరావతి; 2017,ఫిబ్రవరి-24; 7వపేజీ. [13] ఈనాడు అమరావతి; 2017,మార్చి-7; 6వపేజీ [14] ఈనాడు అమరావతి; 2017,మార్చి-10; 7వపేజీ [15] ఈనాడు అమరావతి; 2017,ఆగస్టు-20; 7వపేజీ.