అక్షాంశ రేఖాంశాలు: 25°18′25.808″N 83°0′37.211″E / 25.30716889°N 83.01033639°E / 25.30716889; 83.01033639

దశాశ్వమేధ ఘాట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దశాశ్వమేధ ఘాట్
దశాశ్వమేధ ఘాట్ is located in Varanasi district
దశాశ్వమేధ ఘాట్
Location within Varanasi district
దశాశ్వమేధ ఘాట్ is located in Uttar Pradesh
దశాశ్వమేధ ఘాట్
దశాశ్వమేధ ఘాట్ (Uttar Pradesh)
దశాశ్వమేధ ఘాట్ is located in India
దశాశ్వమేధ ఘాట్
దశాశ్వమేధ ఘాట్ (India)
భౌగోళికం
భౌగోళికాంశాలు25°18′25.808″N 83°0′37.211″E / 25.30716889°N 83.01033639°E / 25.30716889; 83.01033639
దేశంభారతదేశం
జిల్లావారణాసి

దశాశ్వమేధ ఘాట్ ఉత్తరప్రదేశ్‌లో గంగా నది ఒడ్డున ఉన్న వారణాసి లోని ప్రధానమైన స్నానఘట్టం. ఇది కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలో ఉంది. ఘాట్‌తో సంబంధం ఉన్న రెండు హిందూ పురాణాలు ఉన్నాయి: శివుడిని స్వాగతించడానికి బ్రహ్మ దానిని సృష్టించాడు అనేది ఒకటి కాగా, మరొకదానిలో, బ్రహ్మ ఇక్కడ పది అశ్వమేధయాగాలు చేశాడు.

ప్రస్తుతం ఉన్న ఘాట్‌ను 1748లో పీష్వా బాలాజీ బాజీరావు నిర్మించాడు. కొన్ని దశాబ్దాల తర్వాత, ఇండోర్ రాణి అహల్యాబాహి హోల్కర్ 1774 సంవత్సరంలో ఘాట్‌ను పునర్నిర్మించింది.[1]

గంగా హారతి

[మార్చు]

ప్రతిరోజూ సాయంసంధ్యలో ఇక్కడ గంగానదికి హారతి ఇస్తారు. ఏడుగురు పూజారులు, ఘాట్‌లో, నదికి ఎదురుగా, ఒకరి నుండి ఒకరు ఏడెనిమిది మీటర్ల ఎడంగా నిలబడి, దీపస్థంభాన్ని పట్టుకుని, లయబద్ధంగా శ్లోకాలు పఠిస్తూ దీపస్థంభాన్ని కదిలిస్తూ ఈ ఆచారాన్ని నిర్వహిస్తారు.[2] మంగళవారాలు, పండుగ రోజులలో ప్రత్యేక హారతులు ఇస్తారు.

దశాశ్వమేధ ఘాట్ వద్ద గంగా హరతి డ్రోన్ షాట్.

గంగా హారతి సూర్యాస్తమయం తర్వాత ప్రారంభమై దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగుతుంది. వేసవిలో, ఆలస్యంగా సూర్యాస్తమయం అవుతుంది కాబట్టి, హారతి సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. శీతాకాలంలో సాయంత్రం దాదాపు 6 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రతిరోజు సాయంత్రం వందలాది మంది ఘాట్ వద్ద గుమిగూడతారు.[3]

2010 తీవ్రవాద బాంబు దాడి

[మార్చు]
  1. "History of Dashashwamedh Ghat". www.varanasiguru.com. 28 March 2021.
  2. Shradha Banavalikar (20 December 2017). Roots of Moondust: When Struggle Wears a Different Hat, Look at it in the Eye!. Notion Press. pp. 73–. ISBN 978-1-948321-29-7.
  3. "Ganga Aarti at Dashashwamedh Ghat in Varanasi". Triponzy. 22 January 2019.

2010 డిసెంబరు 7 న హారతి దక్షిణ చివరలోని శీతలా ఘాట్ వద్ద తక్కువ-తీవ్రత కలిగిన పేలుడు సంభవించింది. దీని వల్ల ఇద్దరు వ్యక్తులు మరణించారు, 6 గురు విదేశీ పర్యాటకులతో సహా 37 మంది గాయపడ్డారు. ఇండియన్ ముజాహిదీన్ దీనికి బాధ్యత వహించింది.[1][2]

మూలాలు

[మార్చు]
  1. "Terror strikes Varanasi: 1 killed". Zee News. 8 December 2010.
  2. "Varanasi blast triggers a blame game". India Today. 9 December 2010. Archived from the original on 8 February 2011. Retrieved 15 December 2010.