దరియా హుస్సేన్ షేక్
స్వరూపం
షేక్ దరియా హుస్సేన్ సాంస్కృతిక కార్యకర్తగా సుప్రసిద్ధుడు. ఇతడు గుంటూరు జిల్లా, వినుకొండలో ఇమాం సాహెబ్, మౌలాబీ దంపతులకు 1933, జూలై 1న జన్మించాడు[1].
విద్య, ఉద్యోగం
[మార్చు]ఇతని ఉన్నత పాఠశాల చదువు వినుకొండలో నడిచింది. నరసారావుపేటలో బి.ఎ., రాజమండ్రిలో బి.యిడి. చదివాడు. విద్యాశాఖలో విస్తరణాధికారిగా అనంతపురం జిల్లాలో పనిచేశాడు. ఇతడు సాహిత్య సభలలోను, సాంస్కృతిక కార్యక్రమాలలోను చురుకుగా పాల్గొన్నాడు. ఎన్నో అష్టావధానాలలో, కవిసమ్మేళనాలలో పాల్గొన్నాడు.
సాంఘిక కార్యక్రమాలలో
[మార్చు]అనంతపురం రాయలకళాగోష్టికి కార్యదర్శిగా సేవలను అందించాడు. ఆశావాది ప్రకాశరావు, శాంతి నారాయణ తదితరులతో కలిసి పనిచేసి అనంతపురం జిల్లాలో సాహిత్యచైతన్యాన్నిపెంపొందించాడు.
రచనలు
[మార్చు]- పురుషోత్తముడు
- విశ్వనాథ విజయము
మూలాలు
[మార్చు]- ↑ అక్షరశిల్పులు - సయ్యద్ నశీర్ అహ్మద్ పుట 59