Jump to content

దగాకోరులు

వికీపీడియా నుండి
దగాకోరులు
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం పట్టు (ఆర్.పట్టాభిరామన్)
కథ సుజాత
తారాగణం రజనీకాంత్
శ్రీదేవి
రాజసులోచన
జయరామన్
సంగీతం జె.వి.రాఘవులు, ఇళయరాజా
ఛాయాగ్రహణం వినాయగం
కూర్పు బి.కందసామి
నిర్మాణ సంస్థ శ్రీ విజయచిత్ర
భాష తెలుగు
దగాకోరులు సినిమా పోస్టర్

దగాకోరులు 1980, ఫిబ్రవరి 22న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. శ్రీదేవి, రజనీకాంత్ నటించిన ఈ సినిమా 1977లో విడుదలైన తమిళ సినిమా "గాయత్రి"(காயத்ரி) అనే సినిమాకు తెలుగు డబ్బింగ్.

రాజశేఖర్, గాయత్రి వివాహం జరుగుతుంది. నూతన వధువుగా భర్త ఇంట్లో అడుగు పెట్టిన గాయత్రి అక్కడ కొన్ని ఆశ్చర్య పూరితమైన సంఘటనలు ఎదురౌతాయి. వదిన సరస్వతి, వంటవాడు చంద్రయ్య, అతని మనుమరాలుల ప్రవర్తన గాయత్రికి నచ్చదు. వారి గురించి భర్తకు చెప్పినా అతడు వాళ్ల ప్రవర్తననే సమర్థిస్తూ వుంటాడు. ఇలాంటి పరిస్థితిలో అవుట్ హౌస్‌లో వుంటున్న మతి చలించిన రాజశేఖర్ మొదటి భార్యను గూర్ఖా తోటలో పాతిపెట్టడం గాయత్రి కళ్ళారా చూస్తుంది. దీనికి కూడా రాజశేఖర్ ఒక విషాదమైన కట్టుకథ అల్లి గాయత్రిని నమ్మిస్తాడు. నిజానికి రాజశేఖర్ వృత్తి నీలిచిత్రాలను నిర్మించి వాటిని అమ్మడం. తాను తీస్తున్న సినిమా సన్నివేశాల కోసం చివరికి గాయత్రిని అనుభవించిన మొదటిరాత్రిని కూడా ఉపయోగించుకున్న నీచుడు రాజశేఖరం. సరస్వతి, వంటవాడు, అతని మనుమరాలు ఈ వృత్తిలో రాజశేఖర్ భాగస్వాములు. ఇంట్లో జరుగుతున్న విషయాలను అర్థం చేసుకున్న గాయత్రి ఇంటి నుండి పారిపోవడానికి విఫల ప్రయత్నం చేస్తుంది. ఆమె ప్రయత్నాలకు రాజశేఖర్ అడ్డుపడి ఆమెను హింసిస్తూ వుంటాడు. ఈ పరిస్థితుల్లో ఏమి చేయడానికి పాలుపోని గాయత్రి ఇంతవరకు జరిగిన కథను ఒక పుస్తకంలో వ్రాసి పాత పేపర్లలో కలిపి బయటకు పంపిస్తుంది. గాయత్రి వ్రాసిన పుస్తకం రాజేష్ అనే యువకుడి చేతిలో పడుతుంది. రాజేష్ గాయత్రిని అక్కడి నుండి ఎలా విడిపిస్తాడనేది మిగిలిన కథ[1].

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. రమణ (29 February 1980). "చిత్రసమీక్ష దగాకోరులు". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 66, సంచిక 326. Retrieved 21 January 2018.[permanent dead link]

బయటి లింకులు

[మార్చు]