అక్షాంశ రేఖాంశాలు: 16°33′28.800″N 79°18′32.400″E / 16.55800000°N 79.30900000°E / 16.55800000; 79.30900000

దక్షిణ విజయపురి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దక్షిణ విజయపురి
పటం
దక్షిణ విజయపురి is located in ఆంధ్రప్రదేశ్
దక్షిణ విజయపురి
దక్షిణ విజయపురి
అక్షాంశ రేఖాంశాలు: 16°33′28.800″N 79°18′32.400″E / 16.55800000°N 79.30900000°E / 16.55800000; 79.30900000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపల్నాడు
మండలంమాచర్ల
విస్తీర్ణం
47.04 కి.మీ2 (18.16 చ. మై)
జనాభా
 (2011)
8,393
 • జనసాంద్రత180/కి.మీ2 (460/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు4,597
 • స్త్రీలు3,796
 • లింగ నిష్పత్తి826
 • నివాసాలు1,763
ప్రాంతపు కోడ్+91 ( 08647 Edit this on Wikidata )
పిన్‌కోడ్522439
2011 జనగణన కోడ్589798

దక్షిణ విజయపురి పల్నాడు జిల్లా, మాచర్ల మండలానికి చెందిన గ్రామం. నాగార్జున సాగర్ ఆనకట్టకు దక్షిణం వైపుఉంది. ఇది ఇక్ష్వాక రాజుల రాజధాని.

గ్రామ భౌగోళికం

[మార్చు]

ఇది నాగార్జున సాగర్ ఆనకట్టకు దక్షిణం వైపున్న నివాస ప్రాంతం. ఇది మండల కేంద్రమైన మాచర్ల నుండి 27 కి. మీ. దూరంలో ఉంది.

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1763 ఇళ్లతో, 8393 జనాభాతో 4704 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4597, ఆడవారి సంఖ్య 3796.[1]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8,124.[2] ఇందులో పురుషుల సంఖ్య 4,334, స్త్రీల సంఖ్య 3,790, గ్రామంలో నివాస గృహాలు 1,643 ఉన్నాయి.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ఒక బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు ఐదు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. 2 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఒక ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్, డిగ్రీ కళాశాల ఉన్నాయి.సమీప ఇంజనీరింగ్ కళాశాల అలుగురాజుపల్లిలో ఉంది.సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు అలుగురాజుపల్లి లోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం మాచర్లలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులోనూ ఉన్నాయి.

ఏ.పి.ఆర్.డి.సి.కళాశాల

[మార్చు]

ఈ కళాశాలకు చెందిన వాణిజ్య శాస్త్రం అధ్యాపకులు ఎం.వి.రమణ, 2015, సెప్టెంబరు-5 నాడు, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతులమీదుగా, ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు.

ఎ.పి.ఆర్.జె.సి

[మార్చు]

సాంఘిక సంక్షేమశాఖ బాలికల గురుకుల కళాశాల/పాఠశాల

[మార్చు]

ఇటీవల కృష్ణా జిల్లాలోని కేతనకొండలో నిర్వహించిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలలో, ఈ పాఠశాలలో 9వ తరగతి చదువుచున్న ఎన్.విజయకుమారి 40 కె.జి.ల విభాగంలోనూ, 10వ తరగతి చదువుచున్న వై.కవిత 43 కె.జి.ల విభాగంలోనూ ప్రథమ బహుమతి సాధించి, స్వర్ణపతకం సాధించి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనారు. ఈ పాఠశాలకే చెందిన 10వ తరగతి చదువుచున్న మరియొక విద్యార్థిని, వి.కెజియా, ఈ పోటీలలో 65 కె.జి.ల విభాగంలో ద్వితీయస్థానం పొందినది. [11]ఈ పాఠశాలలో 8వ తరగతి చదువుచున్న ప్రమీలాబాయి, 9వ తరగతి చదువుచున్న సువార్త, పదవ తరగతి చదువుచున్న పుష్పలత అను విద్యార్థినులు, బేస్ బాల్ జాతీయపోటీలకు అండర్-17 విభాగంలో ఎంపికైనారు. ప్రస్తుతం నెల్లూరులోని శిక్షణా శిబిరంలో శిక్షణ పొందుచున్న వీరు, 2016, ఫిబ్రవరి-3 నుండి 6 వరకు, ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్ లో నిర్వహించు జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటారు.

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

[మార్చు]

కృష్ణా తీరం సాగర్ జలాశయం వెంట ఉన్నఈ గ్రామములోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల అభివృద్ధికి దాతలు, పూర్వ విద్యార్థులు ఎంతో కృషి చేశారు. ఈ పాఠశాల కార్పొరేటు పాఠశాలలను తలపించేలాగా ఉంది. ప్రస్తుతం 300 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యనభ్యసించుచున్నారు. పాఠశాలలో అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. పదవ తరగతిలో గూడా ఉత్తీర్ణతా శాతం చాలా బాగున్నది. ఈ పాఠశాల స్వర్ణోత్సవాలు, 2013 డిసెంబరు 13,14 తేదీలలో జరిగినవి. 400 మందికిపైగా పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రామానికి హాజరై, తమ బాల్య స్మృతులను నెమరు వేసుకున్నారు. ఆనాటి గురువులతోపాటు ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు పందిరి వెంకటేశ్వర్లుని సన్మానించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులకు సాంస్కృతిక కార్య కలాపాలు, ఆటల పోటీలు నిర్వహించారు. పేద విద్యార్థుల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ప్రతిన పూనారు. ఈ పాఠశాలలో 2014, జూలై-2, బుధవారం నాడు, దాతలు, పూర్వవిద్యార్థుల వితరణతో ఒక శుద్ధజలకేంద్రాన్ని (Mineral Water Plant) ప్రారంభించారు.

మెహర్ బాబా పాఠశాల

[మార్చు]

ఈ పాఠశాల రజతోత్సవ వేడుకలు 2015, ఫిబ్రవరి-25వ తేదీనాడు ఘనంగా నిర్వహించారు.

పి.టి.జి.పాఠశాల

[మార్చు]

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా గ్రామానికి నీటిపారుదల వసతి ఉంది.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

విజయపురి దక్షిణలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.

బ్యాంకులు

[మార్చు]
  1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు.
  2. కెనరా బ్యాంక్.

భూమి వినియోగం

[మార్చు]

భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • అడవి: 1197 హెక్టార్లు
  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 1847 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 243 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 1390 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూ క్షేత్రం: 26 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూ క్షేత్రం: 16 హెక్టార్లు
  • నీటి వనరుల నుండి నీటి పారుదల లభిస్తున్న భూక్షేత్రం: 10 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది

  • బావులు/బోరు బావులు: 10 హెక్టార్లు

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో దోసపాటి అంజయ్య, సర్పంచిగా ఎన్నికైనాడు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]
  1. శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబల దేవాలయం.
  2. శ్రీ ఏలేశ్వరస్వామివారి ఆలయం:- నాగార్జునసాగర్ జలాశయంలో ఉన్న నాగార్జునకొండ సమీపంలో పురాతన ఏలేశ్వరస్వామి గట్టు ఉంది. ఈ గట్టు శ్రీశైలానికి ఈశాన్య ద్వారంగా ఉంటుంది. సాగర్ డ్యాం నిర్మాణం తరువాత ఈ గట్టు సగానికి పైగా నీటితో నిండి పోయింది. ఈ గట్టు జూలు విప్పి పడుకున్న సింహం ఆకారంలో ఉంటుంది. ఈ ఏలేశ్వరస్వామి గట్టుపై ఒక వేయి మీటర్ల ఎత్తులో కాత్యాయని, మల్లిఖార్జునస్వామి, మాధవస్వామి, వినాయకుడు, వీరభద్రుడు కొలువై ఉన్నారు. ఈ గుడిలో కోటి ఒక్క శిల, నూట ఒక్క గుడి, వేయి కవ్వములు ఆడినట్లు శాసనాలు చెప్పుచున్నవి. పూర్వం ఇక్కడ మహాశివరాత్రికి పదకొండు రోజులపాటు ఉత్సవాలు నిర్వహించేవారు. ఈ క్షేత్రం దక్షిణ కాశీగా పేరుగాంచింది. ఈ గట్టుపై వెలసిన పురాతన శివాలయమైన ఈ ఏలేశ్వరస్వామివారికి, మహాశివరాత్రి సందర్భంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించెదరు. ప్రతి సంవత్సరం, మహాశివరాత్రి సందర్భంగా ఈ గట్టును నాలుగైదు వేలకుమందికి పైగా భక్తులు దర్శించుచుంటారు.ఈ కార్యక్రమానికి పర్యాటకశాఖ వారు ప్రత్యేకంగా లాంచీలు నడుపుతారు. చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి, 10/15 వేలమంది భక్తులు, స్వామివారిని దర్శించుకుంటారు. మద్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించెదరు.
  3. బుద్ధవనం:- ఇక్కడ కేంద్రప్రభుత్వ నిధులతో 279 ఎకరాల స్థలంలో "బుద్ధవనం" రూపుదిద్దుకొనబోవుచున్నది. బుద్ధవనంలో ధ్యానమందిరం, ప్రత్యేక ప్రార్థనా మందిరం, మహా స్థూపం, 36 అడుగుల బుద్ధ విగ్రహం వంటి పలు అంశాలకు చెందిన చారిత్రిక ఘట్టాలను ఏర్పాటు చేయబోవుచున్నారు. అమెరికాలోని బౌద్ధుల కోసం, బుద్ధవనంలో 3 ఎకరాల స్థలం కేటాయించారు.
  4. శ్రీ సీతారామాలయం:- ఈ ఆలయాన్ని 1966 లో స్థాపించారు. ఆలయ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా, 2015, నవంబరు-21వ తేదీనుండి 24వ తేదీ వరకు, 3 రోజులపాటు ఈ ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఆఖరిరోజైన 24వ తేదీనాడు శ్రీ సీతారాముల కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు.
  5. శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయం స్థానిక టి.జంక్షను వద్ద ఉంది.
  6. శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం సమీపంలో, 2014, డిసెంబరు-5వ తేదీనాడు, శ్రీ కాశినాయన విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించెదరు, ఈ సందర్భంగా అక్కడ 5,6 తేదీలలో అన్నదానం నిర్వహించెదరు.
  7. శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ రంగనాథస్వామివారి ఆలయం:- ఈ ఆలయం "అనుపు"లో ఉంది.
  8. శ్రీ సాయి ప్రేమమందిరం:- ఇక్కడ శ్రీ షిర్డీ సాయిబాబా 20వ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2015, జూన్-7వ తేదీ ఆదివారంనాడు ఘనంగా నిర్వహించారు. ఉదయం కాగడా హారతి, స్వామివారికిమంగళస్నానం, సామూహిక రథోత్సవం, స్వామివారికి పల్లకీ ఊరేగింపు, మద్యాహ్నం ఒక వేయిమంది భక్తులకు అన్నదానం నిర్వహించారు.
  9. శ్రీ తంబిత మహాత్రిపురసుందరీ సమేత శ్రీ చంద్రమౌళీశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయ నిర్మాణానికి, 2015, డిసెంబరు-7వ తేదీ సోమవారంనాడు భూమిపూజ నిర్వహించారు.
  10. శ్రీ అయ్యప్పస్వామివారి ఆలయం.
  11. చాకలిగట్టు:- నాగార్జునకొండకు సమీపంలో ఉన్న చాకలిగట్టుపై, 25 కృష్ణజింకలను అటవీశాఖ సంరక్షణలో పెంచుచున్నారు. చాకలిగట్టుపై విద్యుత్తు కాంతులను ఏర్పాటుచేసి, దీనిని ఒక పర్యాటకప్రాంతంగా అభివృద్ధిచేయడానికై ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
  12. స్థానిక విజయపురిలోని టి-జంక్షనులో ఈ ఆలయాలు నెలకొని యున్నవి:- శ్రీ పంచముఖ ఆంజనేయస్వామివారి ఆలయం, శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం, మాతా అన్నపూర్ణేశ్వరీదేవి ఆలయం. శ్రీ కాశినాయనస్వామివారి ఆలయం. ఈ ఆలయాల ప్రాంగణంలో, 2017, జూన్-3వతేదీ శనివారంనాడు, నవగ్రహ మండపం ప్రాంభించారు.

గ్రామంలో ప్రధాన పంటలు

[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

[మార్చు]

బండారు రామకృష్ణ - ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌లోని పాలమూరు విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసరుగా ఒప్పంద ప్రాతిపదికన విధులు నిర్వహించుచున్నారు. ఈ ఫెలోషిప్ క్రింద మంజూరయ్యే నిధులతో, ఇటీవల భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇ-జాతీయ వ్యవసాయ మార్కెట్ అను అంశంపై పరిశోధన చేస్తున్నారు. వీరు ప్రతిష్ఠాత్మక జాతీయ యు.జి.సి. పోస్ట్ డాక్టొరేట్ ఫెలోషిప్‌కు, కామర్స్ విభాగంలో, ఉస్మానియా విశ్వవిద్యాలయం తరఫున ఎంపికైనారు. జాతీయస్థాయిలో మొత్తం ముగ్గురిని ఎంపికచేయగా, ఆ ముగ్గురిలో వీరొక్కరు. తెలంగాణా రాష్ట్రం నుండి ఎంపికైన ఏకైక వ్యక్తి ఈయన కావడం గమనార్హం. వీరు వ్యవసాయ మార్కెట్ మీద పరిశోధనలు చేసి, దానిని రైతులకు మరింత ఉపయోగకరంగా విస్తరించేలాగా చేయాలని వీరి సంకల్పం.

మూలాలు

[మార్చు]
  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-04-15. Retrieved 2013-08-22.