Jump to content

థామస్ ఆల్వా ఎడిసన్ మెమోరియల్ టవర్, మ్యూజియం

వికీపీడియా నుండి
2011 లో ఎడిసన్ మెమోరియల్ టవర్, అయితే ఇది మరిన్ని మార్పులతో పునరుద్ధరించబడింది.

మెన్లో పార్క్ వద్ద ఉన్న థామస్ ఎడిసన్ సెంటర్‌ మెన్లో పార్క్ మ్యూజియం గా, ఎడిసన్ మెమోరియల్ టవర్ గా బాగా గుర్తింపు. ఇది ప్రముఖ ఆవిష్కర్త, వ్యాపారవేత్త అయిన థామస్ ఆల్వా ఎడిసన్ యొక్క స్మారకచిహ్నం, ఇది ఎడిసన్ నగరం, మిడిల్సెక్స్ కౌంటీ, న్యూజెర్సీ, యునైటెడ్ స్టేట్స్ యొక్క మెన్లో పార్క్ ప్రాంతంలో ఉన్నది. ఈ మ్యూజియంలో ఎడిసన్ కు ప్రపంచంలోసంబంధించిన వస్తువులను భద్రపరచారు. ఈ భవనంపై ఉన్న బల్బు నే అతి పెద్దది. మెన్లో పార్కు 34 ఎకరాలలో ఉంటుంది. ఈ మ్యూజియంలో ఎడిసన్ పేటెంట్ హక్కులు పొందిన కొన్ని వస్తువులు ఉన్నాయి. డైనమో, టెలిగ్రాఫీ, కినెటో గ్రాఫ్, ఎలక్ట్రో జనరేటర్ వంటి చాలా పరికరాలను, వాటికి సంబంధించిన వివరాల్ని, ఎడిసన్ చరిత్ర గురించి తెలిపే చిత్రాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. మెన్లోపార్కుకు 1979లో జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. 1093 వస్తువులపై పేటెంట్ హక్కులు పొందిన ఎడిసన్ మెన్లో పార్కులో ప్రయోగం చేయడం వల్ల ఎడిసన్‌ "మెన్లో పార్కు మాంత్రికుడు"గా అభివర్ణించబడ్డాడు. ఇక్కడున్న ఎడిసన్ మ్యూజియాన్ని సందర్శించేందుకు ప్రతిరోజూ అనేక మంది పర్యాటకులు వస్తుంటారు.

నేపథ్యం

[మార్చు]

ఎడిసన్ కు మెన్లో పార్క్ వద్ద ఒక ప్రయోగశాల ఉండేది, అక్కడే ఆయన తన విద్యుత్ దీపాన్ని 1879లో మొదటిసారి ప్రదర్శించాడు. అందుకని ఈ ప్రాంతానికి ఎడిసన్ నగరంగా పేరు పెట్టి 1938లో ఆయన జ్ఞాపకార్థం 118 అడుగుల ఎత్తయిన ఓ భవనాన్ని నిర్మించి దానిపై 8 టన్నుల బరువు, 14 అడుగుల ఎత్తున్న ఓ పెద్ద బల్బును ఉంచారు. కిందనున్న గదుల్లో ఎడిసన్ ఆవిష్కరించిన కొన్ని వస్తువులను ప్రదర్శన కోసం ఉంచారు. మెన్లో పార్కును 2010 లో మూసేసి మరిన్ని మార్పులు చేసి పక్కనే మరో భవంతి నిర్మించి అందులో థామస్ గుర్తులతో మ్యూజియాన్ని మలిచి 2012లో మళ్లీ ప్రారంభించారు.

మూలాలు

[మార్చు]
  • ఈనాడు దినపత్రిక - 12-07-2014

ఇతర లింకులు

[మార్చు]