Jump to content

త్వరిత నగర్ (నటి)

వికీపీడియా నుండి
త్వరిత నగర్
జననం
త్వరిత నగర్

(1997-03-02) 1997 మార్చి 2 (వయసు 27)
సైనిక్ ఫామ్, సౌత్ వెస్ట్ ఢిల్లీ, భారతదేశం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2019–ప్రస్తుతం
తల్లిదండ్రులుసీమ (తల్లి)
అజయ్ నగర్ (తండ్రి)

త్వరితా నగర్ (ఆంగ్లం: Twarita Nagar) ఒక భారతీయ నటి. యూట్యూబర్, కంటెంట్ సృష్టికర్త కూడా అయిన ఆమె సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్.

కెరీర్

[మార్చు]

త్వరితా నగర్ మోడల్ గా కెరీర్ మొదలుపెట్టింది. ఆ తరువాత ఆమె యూట్యూబర్, వ్లాగర్, నటిగా ఎదిగింది. ప్రముఖ సామాజిక మాద్యమమైన ఇన్‌స్టాగ్రామ్ సెలబ్రిటీ అయింది. ఆమె పటాఖా యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రసిద్ధి చెందింది. నవంబరు 2022లో చిత్రీకరణలో ఉన్న దండమూడి బాక్సాఫీస్, సాయిస్రవంతి మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న తెలుగు చిత్రంలో ఆమె కార్తీక్ రాజు సరసన నటిస్తోంది.[1]

వ్యక్తిగతం

[మార్చు]

సౌత్ వెస్ట్ ఢిల్లీలోని సైనిక్ ఫామ్ లో త్వరిత నగర్ 1997 మార్చి 2న అజయ్ నగర్, సీమా దంపతులకు జన్మించింది. ఆమెకి ఒక సోదరుడు ఉమంగ్, ఒక సోదరి దివ్య ఉన్నారు. న్యూఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ బాల్ భారతి స్కూల్ లో ఆమె విద్యాభ్యాసం కొనసాగింది. ఆమె ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. మహారాష్ట్రలోని ముంబైలో ఆమె స్థిరపడింది. త్వరిత నగర్ అంకిత్ మదన్ ను వివాహమాడింది.

మూలాలు

[మార్చు]
  1. "Cinema News: కార్తీక్ రాజు, త్వరిత నగర్ జంటగా కొత్త చిత్రం." web.archive.org. 2022-11-12. Archived from the original on 2022-11-12. Retrieved 2022-11-12.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)