త్రివర్ణ పదార్ధాలు
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
త్రివర్ణ పదార్ధాలు అనగా నారింజ, తెలుపు, ఆకుపచ్చ రంగుల పదార్ధాలు. మూడురంగుల జెండా చూసినప్పుడల్లా ముచ్చటగా ఉంటుంది . అలాగే ఆ మూడు రంగుల పదార్ధాలు తినడము వల్ల మనకెంతో లాభము ఒనగూడుతుంది. ఏమిటా లింక్ అని నవ్వుకున్నా .... నారింజ, తెలుపు, ఆకుపచ్చ రంగుల పదార్ధాలు మన ఆరోగ్యానికి మంచిది .
నారింజ రంగు
[మార్చు]ఈ రంగులో ఉండే పండ్లు, కూరగాయల్లో బీటా-కెరటిన్, విటమిన్ "సి" అత్యధికంగా లభిస్తాయి. వయసు రీత్యా లోపించే దృష్టి మెరుగవడానికి సహకరించే పోషకాలు వీటిలో ఉంటాయి. క్యాన్సర్ ను అడ్డుకోగలవు, కొలెస్టరాల్, రక్తపోటు లను తగ్గించి కొలాజెన్ ఏర్పడడాన్ని మెరుగుపరుస్తాయి. ఆరోగ్యవంతమైన జాయింట్స్ కు దోహదపడతాయి.
- బొప్పాయి
ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది . ఇతర ప్రోటీన్లు, జీర్ణసంబంధిత ఎంజైములు, విటమిన్ " ఎ", " ఇ ", లు పొటాషియం లభిస్తాయి. సహజసిద్ధమైన లాక్జేటివ్స్ కలిగి ఉంటాయి.
- కమలా, బత్తాయి
- వీటిలో విటమిన్ " సి " సాంద్రత ఎక్కువ . యాంటి ఆక్షిడెంట్లు ఉంటాయి. రోగనిరోధక వ్యవస్థను బలోపేతము చేస్తాయి. పీచు పదార్ధము ఎక్కువగా ఉంటుంది .
- క్యారెట్లు
- కంటి దృష్టికి మంచివి . విటమిన్ " ఎ, కె , సి , లు .. పొటాషియం , ఫైబర్ , మెగ్నీషియం , ఫాస్పరస్ , ఇతర పోషకాలు మెండుగా ఉంటాయి .
తెలుపు రంగు
[మార్చు]రోగనిరోధక వ్యవస్థను ఆందించే పోషకాలు తెల్లని పదార్థాలలో ఉంటాయి . కొలెస్టరాల్ , రక్తపోటుస్థాయి సరిగా ఉంచుకునేందుకు సహకరిస్తాయి. తెలుపు రంగు గల కొన్ని పదార్ధాలు :
- ఉల్లి , వెల్లుల్లి
- సల్ఫైడ్ , ఎల్లిసిన్ అనే ఫైటోకెమికల్స్ అధికము గా ఉంటాయి. ట్యూమర్లకు వ్యతిరేకము గా ఇవి పోరాడతాయి. ఇన్‌ఫ్లమేషన్ తగ్గించి , రక్తములో కొవ్వు , కొలెస్టరాల్ లను , బ్లడ్ సుగర్ ను తగ్గిస్తాయి. యాంటీ బ్యాక్టీరియల్ , యాంటి ఫంగల్ , యాంటి వైరల్ లక్షణాలు కలిగిఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని సమర్ధవంతం గా పెంచుతాయి. జలుబు పై పోరాడే మంచి ఆహారము .
- ముల్లంగి
- ఎక్కువగా పీచు పదార్ధము , తేమ , సహజమైన లాక్జేటివ్స్ ఉన్నాయి . దీనిలోని అధిక తేమ చర్మానికి , కళ్ళకు ఎంతో మేలుచేస్తుంది .
ఆకుపచ్చ
[మార్చు]ఈ రంగు పండ్లు , కూరలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి . క్లోరొఫిల్ , పీచుపదార్థము , ఫోలిక్ యాసిడ్ , కాల్సియం , విటమిన్ " సి " , బీటాకెరటిన్స్ లభిస్తాయి . ఈ రంగు పదార్ధాలలోని పోషకాలు క్యాన్సరు వచ్చే ప్రమాదాలను తగ్గిస్తాయి . రక్తపోటు, క్లెస్టరల్ స్థాయిలను తగ్గిస్తాయి. జీర్ణక్రియకు దోహదపడి , కంటి ఆరోగ్యానికి , దృష్టికి సహకరిస్తాయి . ఫ్రీ రాడికల్స్ ను తగ్గించి రోగనిరోధ వ్యవస్థను మెరుగుపరుస్తాయి .
- పాలకూర
- ఐరన్ , ఫొలిక్ యాసిడ్ ,అధికం గా ఉంటాయి . పుట్టుకతో వచ్చిన లోపాల్ని సరిచేయడానికి సహరిస్తుంది . దీనిలో అత్యధికంగా లభించే క్యాల్సియం , పీచు జీర్ణక్రియకు , చర్మానికి మేలు కలిగిస్తాయి.
- బ్రకోలి
- క్యాన్సర్ వ్యతిరేకగుణాలు ఎక్కువ . యాంటీ ఆక్షిడెంట్స్ , ఖనిజాలు , ఏ, సి, విటమిన్లు లభిస్తాయి.
- కివి
- విటమిన్ "సి " ఎక్కువగా ఉంటుంది . పొటాషియం లభిస్తుంది . ఇది కంటి దృష్టి బలహీనతలనుండి కాపాడుతుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి . తేమ అధికముగా ఉంటుంది. చర్మానికి ఎటువంటి హాని జరుగుకుండా కాపాడుతుంది .