త్రిపురాన తమ్మయదొర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
త్రిపురాన తమ్మయదొర
జననం1849
సిద్ధాంతం, శ్రీకాకుళం జిల్లా
మరణం1890
వృత్తికవి.
పిల్లలుత్రిపురాన వేంకటసూర్యప్రసాదరాయకవి
తల్లిదండ్రులు
  • వేంకటస్వామి దొర (తండ్రి)
  • చిట్టెమ్మ (తల్లి)

త్రిపురాన తమ్మయదొర (1849 - 1890) ప్రముఖ తెలుగు రచయిత, కవి.

వీరు తెలగా వంశీయుడు. తల్లి: చిట్టమాంబ (చిట్టెమ్మ). తండ్రి: వేంకటస్వామిదొర. వీరి జన్మస్థానము, నివాసము: విశాఖ పట్టణం మండలంలో శ్రీకాకుళం తాలూకా సిద్ధాంతం గ్రామం. జనను: 1849 సం. సౌమ్య సంవత్సర శ్రావణ శుద్ధ చతుర్దశి గురువారము. నిర్యాణము: 1890 సం. వికృతి సంవత్సర పుష్య శుద్ధ పూర్ణిమ.

ఇతని కుమారుడు త్రిపురాన వేంకటసూర్యప్రసాదరాయకవి కూడా సుప్రసిద్ధ కవి పండితులు.

రచనలు

[మార్చు]
  • 1. నీతిశతకము
  • 2. పాండురంగాష్టోత్తరశతము
  • 3. కామినీ నిర్మోహజనన తారావళి
  • 4. విటీవిట నటనార్థమాల
  • 5. ముఖలింగేశ్వరశతకము
  • 6. నిద్రా విజయము
  • 7. శ్రీ దేవీ భాగవత మహాపురాణము (1883 విరచితము)

మూలాలు

[మార్చు]
  • త్రిపురాన తమ్మయదొర, ఆంధ్ర రచయితలు, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, 1950, పేజీలు: 110-14.