Jump to content

తోటకూర ప్రభాకరరావు

వికీపీడియా నుండి

తోటకూర ప్రభాకరరావు ఆంధ్రప్రదేశ్ కు చెందిన అధ్యాపకులు[1], రచయిత, హేతువాది. చిలకలూరిపేట ఎస్ సి వి ఎస్ జూనియర్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేసి పదవీ విరమణ పొందాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

తోటకూర ప్రభాకరరావు ప్రకాశం జిల్లా సంతరావూరు కు చెందిన వాడు. అక్కడి నుంచి చిలకలూరిపేట వలస వచ్చాడు.

కుటుంబం

[మార్చు]

తండ్రి:- తోటకూర రామకోటయ్య
తల్లి  :- తోటకూర వేంకట రాఘవమ్మ
భార్య:- కోలా విజయలక్ష్మి
కూతురు - తోటకూర కుశలా ప్రియదర్శిని
కొడుకు - తోటకూర రాహుల్

వృత్తి, జీవితం

[మార్చు]

ప్రభాకరరావు 1980 దశకంలో ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. "పౌరాణిక నాటకాల్లో హేతువాదం" అంశం మీద పరిశోధన పత్రం సమర్పించి డాక్టరేట్ పొందారు. చిలకలూరిపేటలో థింకర్స్ సొసైటీని కీ.శే. మురకొండ శ్రీరామ ఆర్య గారితో కలసి స్థాపించి గ్రంథ ప్రచురణలు చేశారు. డా. తోటకూర ప్రభాకరరావు చిలకలూరిపేట కళాశాలలో లెక్చరర్ గా విధులు నిర్వహించి రిటైరయ్యారు.

రచనలు

[మార్చు]
  • ప్రభవ (గేయ సంపుటి)(1985)
  • తెలుగు పౌరాణిక నాటకాలు హేతువాద దృక్పథం (సిద్ధాంత గ్రంథం) (1989)[2]
  • హేతువాద వైఖరి (పరిశోధనా గ్రంథం)(1989)
  • కలగూర గంప (1990)

మరణం

[మార్చు]

తోటకూర ప్రభాకరరావు(74) జనవరి 9, 2025 న తెల్లవారుజామున హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఆయన భౌతికకాయానికి చిలకలూరిపేటలో అంత్యక్రియలు జరిపారు.

మూలాలు

[మార్చు]