తొడిమ
Jump to navigation
Jump to search
తొడిమ అనగా కాండంనకు ఆకునకు, కాండంనకు పుష్పంనకు, కాండంనకు కాయకు మధ్య ఉండే కాండం వంటి భాగాన్ని తొడిమ అంటారు. తొడిమను ఇంగ్లీషులో Petiole అంటారు.,[1]: 87 [2]: 171
తొడిమ బొప్పాయి, గంగరావి మొదలగు కొన్నిటిలో పొడుగుగా ఉండును[3]. పొన్న, రేగు మొదలగు కొన్నిటిలో పొట్టిగా నుండును. నేల ఉసిరి ఆకులకును వాయింట యొక్క చిట్టి ఆకులకును తొడిమ లేనే లేదు. తొడిమనంటుకొని దానికిరు ప్రక్కల కణుపు వద్ద చిన్న రేకలవంటివి కొన్నిటిలో ఉండును. ఉదాహరణకు: గులాబి. వానికి కణుపుపుచ్ఛములని పేరు. ఇవి ఆకులు మిక్కిలి చిన్నవిగా ఉన్నప్పుడు కణుపుసందులందు మొలచెడు మొగ్గలకు ఎండ తగులనీయకుండ కాపాడుచుండును. రేగు చెట్టులోనివి ముండ్లుగా మారియున్నవి. తొగరు చెట్టులో రెండాకులకును మధ్యగా నున్నవి.
మూలాలు
[మార్చు]- ↑ Beentje, H. (2010). The Kew plant glossary. London: Kew Publishing. ISBN 9781842464229.
- ↑ Mauseth, James D (2003). Botany: An Introduction to Plant Biology. Jones & Bartlett Learning. ISBN 0-7637-2134-4.
- ↑ "Archived copy". Archived from the original on 2020-06-23. Retrieved 2020-06-22.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)CS1 maint: archived copy as title (link)
బాహ్య లంకెలు
[మార్చు]- Collier's New Encyclopedia. 1921. .
వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.