Jump to content

తేతలి సత్యనారాయణ

వికీపీడియా నుండి

తేతలి సత్యనారాయణ గ్రంథాలయోధ్యమము ప్రముఖులలో ఒకరు.

జననము - బాల్యము

[మార్చు]

తేతలి సత్యనారాయణ తూర్పు గోదావరి జిల్లా నివాసి.

గ్రంధాలయోధ్యమముతో అనుబంధము

[మార్చు]

తేతలి సత్యనారాయణ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తాలూకాలో అయ్యంకి వెంకటరమణయ్య గారు నిర్వహించిన గ్రంధాలయోద్యమ యాత్రకు అండగా వుండి యాత్రలను జయప్రథంగా నిర్వహించారు. ఆ తాలూకాలో గ్రంథాలయోధ్యమము వేళ్లూనుకునేలా గొప్ప కృషి చేశారు. 1930 వ సంవత్సరంలో తన వైద్య వృత్తిని ప్రారంబించినా ఎక్కువగా ప్రజాహిత కార్యక్రమాలలోనే కాలము గడిపారు. తాడేపల్లి గూడెం పురపాలక సంఘం చైర్మెన్ గా విద్యారంగానికి ఎనలేని కృషి చేశారు. జిల్లా బోర్డు సహకారముతో తాడేపల్లి గూడెంలో గ్రంథాలయానికి చక్కని భవనాన్ని నిర్మిఫ జేసి దానికి దేశోద్దారక కాశీనాథుని నాగేశ్వరరావు గారి చేత ప్రారంభోత్సవం చేయించారు. 1935 వ సంవత్సరములో తాడేపల్లిగూడెం తాలూకాలో కాలి నడకన ప్రతి గ్రామం తిరిగి 47 గ్రంథాలయాల స్థాపనకు కృషి చేశారు. వీరు తన స్వీయ చరిత్రను కూడా వ్రాశారు.

మూలాలు

[మార్చు]

గ్రంథాలయోధ్యమ శిల్పి అయ్యంకి అనుగ్రంథము: పుట.

మూలాలు

[మార్చు]