Jump to content

తెలుగు సినిమా వజ్రోత్సవం

వికీపీడియా నుండి
Indiafilm.svg

తెలుగు సినిమా వజ్రోత్సవం తెలుగు సినీ పరిశ్రమ 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుపుకున్న ఉత్సవం. 2007 సంవత్సరంలో జనవరి 26, 27, 28 తేదీల్లో మూడు రోజులపాటు ఈ ఉత్సవం జరిగింది. ఈ మూడు రోజులు సినీ పరిశ్రమలో పనిచేసే వారందరికీ తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సెలవు దినాలుగా ప్రకటించింది. ఈ వేడుకకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినీ పరిశ్రమల నుంచి అనేకమంది పెద్దలు హాజరయ్యారు. ఈ కార్యక్రమం హైదరాబాదులోని హైటెక్స్ లో జరిగింది. కె.రాఘవేంద్రరావు కల్చరల్ కమిటీకి అధ్యక్షుడిగా, కె.యస్.రామారావు ముఖ్య కన్వీయర్ గానూ వ్యవహరించారు. [1]

కార్యక్రమాలు

[మార్చు]

ఒకటో రోజు

[మార్చు]

మొదటి రోజు కార్యక్రమానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. అక్కినేని నాగేశ్వరరావుతో ప్రారంభించి తెలుగు సినీపరిశ్రమలోని ఉద్ధండులను సత్కరించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఎక్కువగా సంగీత ప్రధాన కార్యక్రమాలు జరిగాయి. అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకునే పాటలు పాడారు.

రెండో రోజు

[మార్చు]

రెండో రోజు కార్యక్రమానికి అలనాటి కథానాయిక సుహాసిని వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఎన్టీఆర్ ప్రముఖ చిత్రాలలో ధరించిన దుస్తులను ఈ సందర్భంగా ప్రదర్శించారు. తరువాత బాలక్రిష్ణ, ఏవీయస్ కలిసి ధుర్యోదనుడు, శకునిగా నటించి ప్రేక్షకులని అలరించారు. తరువాత సునీల్ తన హాస్యంతో ప్రేక్షకులని నవ్వించాడు. [2]

మూడో రోజు

[మార్చు]

మూడో రోజు కార్యక్రమానికి అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అధ్యక్షత వహించాru. అంజలీ దేవి, దాసరి నారాయణ రావు తదితరులను సత్కరించాక లెజెండ్ల సరసన సత్కరించడానికి చిరంజీవిని వేదిక మీదకు రమ్మని ఆహ్వానించారు. అయితే చిరంజీవి దాన్ని తిరస్కరిస్తూ కారణాలు తరువాత చెబుతానని దాటవేశాడు. తరువాత మోహన్ బాబును వేదికమీదకి పిలవగా ఆయన కూడా అలాగే వ్యాఖ్యానించాడు. దాంతో వేదిక దగ్గర కొంత అయోమయం నెలకొంది. తరువాత మోహన్ బాబు వేదిక మీదకి వచ్చి తను సినీ ప్రస్థానాన్నీ, తనకు సహాయం చేసిన వారిని గుర్తు చేసుకుంటూ నిర్వాహకులు సత్కరించిన వారిని వర్గీకరణ చేసిన విధానం బాగాలేదని విమర్శలు చేశాడు. అంతే కాకుండా కొంతమందిని పట్టించుకోలేదని అన్నాడు.

దాంతో చిరంజీవి వేదిక మీదకి వెళ్ళి మాట్లాడమని కోరినా చిరంజీవి అందుకు నిరాకరించాడు. తరువాత నాగార్జున, బాలక్రిష్ణ, అల్లు అర్జున్, చిరంజీవి మొదలైన వారంతా వేదిక మీద నృత్యం చేశారు. దాంతో పరిస్థితి కొంచెం సద్దుమణిగింది. తరువాత అల్లు అరవింద్ వేదిక మీదకు ఒక టైమ్ క్యాప్సూల్ ను తీసుకు రాగా చిరంజీవి వేదిక మీదకి వెళ్ళి తన అభిప్రాయాలను వెల్లడించి తనకు లెజెండరీ కేటగిరీలో సన్మానం వద్దనీ తన సమకాలీనులతోనే దాన్ని స్వీకరిస్తాననీ తనకు బహుకరించిన పతకాన్ని, మెమొంటోను ఆ టైమ్ క్యాప్సూల్ లో జారవిడిచాడు.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-06-24. Retrieved 2016-05-05. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. https://reviewblog.wordpress.com/2007/01/30/3/