Jump to content

తెలుగు సభలు

వికీపీడియా నుండి

తెలుగు భాషాభివృద్ధి, తెలుగు వారి పురోగతికి కొలమానం, తెలుగు వారి ఐక్యతకు ప్రతిబింబంగా తెలుగు సభలను వేరు వేరు సమయాల్లో వివిధ సందర్భాల్లో తెలుగువారు జరుపుకుంటూ వస్తున్నారు. ఆధునికంగా వందేళ్ళకు పైగా చరిత్ర గల ఈ సభల సాంప్రదాయం, దాదాపుగా తెలుగు ఆవిర్భావం సమయం నుండే ఉండింది. తమిళ సంగం సభలలో తెలుగు వారు పాల్గొన్న దాఖలాలూ ఉన్నాయి. ఎన్నో మైలురాళ్ళను ఈ తెలుగు సభలు జన బాహుళ్యానికీ, మరీ ముఖ్యంగా తెలుగు వారికి తెచ్చిపెట్టాయి.

స్వాతంత్ర్యానికి ముందు జరిగిన సభలు

[మార్చు]

ఆంధ్ర మహాసభలు

[మార్చు]

తొలి ఆంధ్ర మహాసభలు - 1913వ సంవత్సరంలో బాపట్లలో జరిగాయి.

[మార్చు]
కొండా వెంకటప్పయ్య పంతులు

అధ్యక్షులు : బయ్యా వేంకటేశ్వర శర్మ
సమావేశకర్త: కొండా వెంకటప్పయ్య పంతులు
ఈ సభలో వేమవరపు రామదాసు పంతులు ప్రత్యేక రాష్ట్రం విషయాన్ని ప్రస్తావించారు. ఈ సమావేశం తీర్మానం ప్రకారం సభ్యులు తెలుగువారందరినీ కలిసి, ప్రత్యేక రాష్ట్ర సాధనకై ప్రచారాం చేసి, కనీసం ఒక సంవత్సర వ్యవధి ప్రచారం చేసాకనే ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదనపై ఆలోచించాలని నిర్ణయించారు. కొండా వెంకటప్పయ్య పంతులు, భోగరాజు పట్టాభిసీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు, వల్లూరు సూర్యనారాయణరావు ఒక కమిటీగా ఏర్పడి మొత్తం రాష్ట్రం పర్యటించి ప్రత్యేక స్వతంత్ర రాష్ట్రం అవసరం గురించి చర్చించారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య, కొప్పల్లె హనుమంతరావు "ఆంధ్ర రాష్ట్రము" అనే పుస్తకం ఈ సందర్భంగా రాసారు.

రెండవ ఆంధ్ర మహాసభలు - 1914వ సంవత్సరంలో విజయవాడలో జరిగాయి

[మార్చు]

అధ్యక్షులు : న్యాయపతి సుబ్బారావు
ఈ సభలో సుదీర్ఘ చర్చల అనంతరం ప్రత్యేక రాష్ట్ర తీర్మానం ఆమోదించబడింది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలుండాలనీ, మద్రాస్ రాష్ట్రంలోని అన్ని తెలుగు భాష మాట్లాడే వారున్న జిల్లాలను కలిపి ఒక ప్రత్యేక రాష్ట్రంగా అవతరింప చేయాలి.

మూడవ ఆంధ్ర మహాసభలు - 1915వ సంవత్సరంలో విశాఖపట్నం లో జరిగాయి

[మార్చు]

అధ్యక్షులు : పానుగంటి రాజా రామారాయణిం
ఈ సభలో కూడా ప్రత్యేకాంధ్ర రాష్ట్ర ఏర్పాటు పైనే తీర్మానం ఆమోదించబడింది. అప్పటి నుండి ప్రతి ఆంధ్ర మహాసభలో ఈ తీర్మానం మళ్ళీ మళ్ళీ ఆమోదించబడింది.

1917లో ఆంధ్రసభ ఒక ఉద్యమంలా ఏర్పడింది. ఇదే సమయంలో నిజాం ప్రభుత్వపాలిత తెలుగు ప్రాంతాల వారు కూడా ఆంధ్ర మహాసభగా ఏర్పడారు. ఇటు బ్రిటిష్ పాలిత ఆంధ్ర ప్రాంత సభ సభ్యులు బ్రిటిష్ ప్రతినిధులైన మోంటెగ్, కెమ్స్‍ఫోర్డ్ అనే పేర్లు గల అధికారులను కలిసి భాషా ప్రాతిపదికన తెలుగు మాట్లాడే వారందరికీ వేరే రాష్ట్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేసారు. వేరే రాష్ట్ర ప్రతిపాదనను పరిగణించి, నిర్ణయం రాజ్యాధికారులకు అప్పగించగా, నిరంతర ప్రయత్నాల తరువాత కూడా రాజ్యాధికారులు ఈ విషయాన్ని పక్కన పెట్టారు. అదే సమయంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో ఆంధ్రకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది.

స్వాతంత్ర్యం తరువాత జరిగిన సభలు

[మార్చు]

అఖిల భారత తెలుగు మహాసభలు

[మార్చు]

ప్రపంచ తెలుగు మహాసభలు

[మార్చు]

అంతర్జాతీయ తెలుగు సాహిత్య మహాసభలు

[మార్చు]

ముఖ్యమయిన అంతర్జాతీయ తెలుగు మహాసభలు

[మార్చు]

రెండేళ్ళకోసారి జరుపుకునే ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు

[మార్చు]