తెలుగు రామాయణాల జాబితా
స్వరూపం
తెలుగు మాట్లాడే ప్రాంతాలలో హిందువులకు ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు. రామాయణం ప్రకారం అగస్త్యుని ద్వారా వనవాసంలో నివసించేందుకు అత్యంత నివాసయోగ్య ప్రాంతం గోదావరీ పరీవాహక ఆంధ్రదేశం. ఆంజనేయుని జన్మభూమిగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రసిద్ధి. ఆ విధంగా రామాయణానికీ, ఆంధ్రదేశానికి ఒక అవినాభావ సంబంధం ఉంది.[1] ప్రతి ఊర్లో రామాలయం ఉండటమే కాక, ప్రతి కాలంలో రామాయణం తెలుగు నేలపై వ్రాయబడింది.
క్రమము | కవి పేరు | రామాయణము పేరు |
---|---|---|
1 | నన్నయ్య | రాఘవాభ్యుదయము |
2 | భాస్కర రామాయణము<br హుళక్కి భాస్కరుడు, మల్లికార్జునభట్టు అయ్యలార్యుడు ,కుమార్ రుద్రుడు ) | |
3 | తిక్కన సోమయాజి | నిర్వచనోత్తర రామాయణం |
4 | ఎఱ్ఱాప్రగడ | రామాయణము |
5 | కొఱవి సత్యనారాయణ | రామాయణము |
6 | మొల్ల | మొల్ల రామాయణము |
7 | అయ్యలరాజు రామభద్రుడు | రామాభ్యుదయము |
8 | చిత్రకవి వెంకటరమణ కవి | సకల వర్ణనాపూర్ణ రామాయణము |
9 | రఘునాధరాయలు | రఘునాధ రామాయణము (బాలకాండములో కొంతవరకే అనూదితము) |
10 | ఘనగిరి రామకవి | యధావాల్మీకి రామాయణము (బాలకాండములో కొంతవరకే అనూదితము) |
11 | మానూరి గోపాలరావు | యథావాల్మీకి రామాయణము |
12 | కాణాదము పెద్దన సోఅయాజి , ఐదుగురు కవులు |
యథాశ్లోక తాత్పర్య రామాయణము |
13 | చెన్నూరి రామన్న | రామాయణము |
14 | బసవకవి | రామాయణము |
15 | వారణాశి లక్ష్మీపతి | రామాయణము |
16 | మడి వ్యాళయ్య | శారద రామాయణము |
17 | గోపీనాథము వేంకటకవి | గోపీనాధ రామాయణము |
18 | వావిలికొలను సుబ్బారావు (వాసుదాసు గారు) |
ఆంధ్ర వాల్మీకి రామాయణం |
19 | జనమంచి శేషాద్రి శర్మ | ఆంధ్ర శ్రీమద్ వాల్మీకి రామాయణము |
20 | జనమంచి శేషాద్రి శర్మ | ధర్మసార రామాయణము |
21 | జనమంచి శేషాద్రి శర్మ | సంగ్రహ రామాయణము |
22 | శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి | శ్రీ కృష్ణ రామాయణము |
23 | విశ్వనాథ సత్యనారాయణ | శ్రీమద్రామాయణ కల్పవృక్షము |
24 | కట్టా వరదరాజు | వరదరాజు రామాయణము |
25 | కరభోసల ఏకోజీ | ఏకోజీ రామాయణం |
26 | ధర్మవరపు సీతారామాంజనేయులు | ఆంజనేయ రామాయణము |
27 | గడియారం వేంకట శేషశాస్త్రి | శ్రీమదాంధ్రరామాయణము |
28 | రాళ్ళబండి నాగభూషణ శాస్త్రి | మారుతి రామాయణము |
29 | కపిలవాయి లింగమూర్తి | శారదారామాయణము |
30 | కపిలవాయి లింగమూర్తి | రామోదాహరణము |
31 | కపిలవాయి లింగమూర్తి | శ్రీరామవచనాలు |
32 | ముదిగొండ నాగవీరయ్య శాస్త్రి | అభినవ రామాయణము |
33 | నిమ్మగడ్డ రాధాకృష్ణ దాసకవి | హనుమద్రామాయణము |
34 | గంగయ్య | తారక బ్రహ్మ రామాయణము |
35 | చెన్న కృష్ణయ్య | సాంఖ్య రామాయణము |
36 | నరసింహా దేవర వేంకటశాస్త్రి | విచిత్ర రామాయణము |
37 | ముడుంబి కృష్ణయ్య | అద్భుత రామాయణము |
38 | గంధం శ్రీరామ్మూర్తి, ఇఱ్ఱింకి నరసింహమూర్తి | యథార్ధ రామాయణము |
39 | వేములవాడ భీమకవి | శతకంఠం/శతకంధర రామాయణము |
40 | లింగకవి, గంగకవి (జంటగా) | శతకంఠ రామాయణము |
41 | వేంకట భూపతి | సహస్రనామ రామాయణము |
42 | రామావఝల కొండయ శాస్త్రి | సహస్రకంఠ రామాయణము |
43 | కూచిమంచి జగ్గకవి | తారక బ్రహ్మ రామాయణము |
44 | వేంకట పార్వతీశ్వర కవులు | శ్రీ రామాయణము |
45 | ఆత్మకూరి గోవిందాచార్యులు | గోవింద రామాయణము |
46 | గుండు లక్ష్మణ శాస్త్రి | ఆంధ్రానంద రామాయణము |
47 | ఆకొండి వెంకటకవి | తత్త్వసంగ్రహ రామాయణము |
48 | ఉమర్ ఆలీషాకవి | శ్రీ మద్వాల్మీకి రామాయణము |
49 | కామవరపు సూర్యనారాయణ | దండక రామాయణము (లఘుకృతి) |
50 | కరణం అశ్వత్థరావు | దండక రామాయణము (విస్మృత గ్రంథము) |
51 | మోదుకూరి పండరీనాథకవి | పండరీనాధ రామాయణము |
52 | పి.వ్.ఎల్.ఎన్. ప్రభాకరశర్మ | హనుమద్రామాయణము |
53 | అయినంపూడి గురునాధరావు | గురునాధ రామాయణము |
54 | శ్రీసోమరాజు వేంకట సుబ్బరాయకవి | శ్రీమదాంధ్ర ఆనందరామాయణము |
55 | మల్లెమాల సుందర రామిరెడ్డి | మల్లెమాల రామాయణము |
ఆధ్యాత్మ రామాయణములు వ్రాసిన కవులు: | ||
56 | మేడూరి సీతారామయ్య శర్మ | సీతారామాయణం |
57 | జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి (విహారి) | పదచిత్ర రామాయణం |
58 | కంచర్ల శరభకవి | ఆధ్యాత్మ రామాయణము |
59 | ఇమ్మడి జగదేవరాయలు | |
60 | రాపాక శ్రీరామకవి | |
61 | కాణాదము పెద్దన సోమయాజి | |
62 | పరశురామపంతులు రామమూర్తి | |
63 | ముడుంబై వెంకట కృష్ణమాచార్యులు | |
64 | మోదుకూరి పండరీనాధ కవి | |
65 | కోటమరాజు నాగయ్య | |
66 | కృష్ణగిరి వేంకట రమణ కవి | |
67 | అల్లమరాజు రామకృష్ణకవి | |
68 | రామయామాత్యుడు | |
69 | బులుసు వేంకటేశ్వర్లు | |
70 | ఉపమాక నారాయణమూర్తి | |
71 | శేషగిరి సుబ్రహ్మణ్యకవి (108 సంకీర్తనలతో) | |
72 | ఆకొండి వ్యాసమూర్తి | |
73 | తత్త్వ సంగ్రహ రామాయణం (ఆధ్యాత్మమాలికా రామాయణమని వివరణ) | |
వాసిష్ఠ రామాయణము : కవులు | వాసిష్ఠ రామాయణము | |
74 | మడికి సింగన | |
75 | కామినేని ఎల్లా రెడ్డి | |
భోజుని చంపూరామాయణానికి అనువాదకులు | చంపూరామాయణము | |
76 | ఋగ్వేదకవి వేంకటాచలపతి | |
77 | అల్లమరాజు రంగశాయి | |
78 | బులుసు సీతారామకవి | |
79 | పూసపాటి రంగనాయకామాత్యుడు | |
80 | జయంతి రామయ్య పంతులు | |
81 | బుద్ధవరపు మహాదేవుడు | |
బాలరామాయణ ఆంధ్రీకరణ | బాలరామాయణ ఆంధ్రీకరణ | |
82 | గరెంపూడి వెంకట సుబ్బయామాత్యుడు | |
83 | ఆదిపూడి సోమనాధరావు | |
84 | జయంతి రామయ్య పంతులు | |
85 | నల్లాన్ చక్రవర్తుల సింహాద్రి అయ్యంగార్ (పెన్నాడ) | |
86 | శేషగిరి వేంకట రమణకవి | |
విచిత్ర రామాయణ కర్తలు | ||
87 | తుమురాడ పాపకవి (రామకథా సుధార్ణవమని నామాంతరము) | |
88 | కొమ్మాజీ సోమనాధశిల్పాచార్యుడు | |
89 | వేల్పూరి వేంకటేశ్వర కవి | |
90 | నరసింహదేవర వేంకట శాస్త్రి | |
కావ్య ప్రబంధాదులు
(నన్నయ రాఘవాభ్యుదయము,అయ్యలరాజు రామభద్రుని రామాభ్యుదయము ఇంతకు ముందే చేర్చబడినవి) |
||
91 | రేవణూరి కొండయ్యఁఅన్నమయ్య అల్లుడు) | రామచంద్రోపాఖ్యానము |
92 | రేవణూరి వేంకటచార్యుడు | రామచంద్రోపాఖ్యానము(కొండయ్య గారి కొడుకు- ఈయన వ్రాసాడని కొందరు అంటుంటారు) |
93 | సింగరాచార్యులు | రామాభ్యుదయము |
94 | వేంకట నరసింహాచార్యులు | రామాభ్యుదయము |
95 | బిజ్జల తిమ్మరాజు (పాకటూరు సంస్థానాధిపతి) | అనర్ఘరాఘవము (ఇదే పేరుగల సంస్కృతనాటకానికి తెలుగు ప్రబంధము) |
96 | ఉప్పుగుండూరు వేంకటపతి | అనర్ఘరాఘవము |
97 | ఏనుగు లక్ష్మణ కవి | రామవిలాసము |
98 | దిట్టకవి పాపరాజకవి | రామకథాసారము |
99 | అనంతరాజు జన్నయ్య | రామకథాభిరామము |
100 | మిక్కిలి మల్లిఖార్జునుడు | రామచంద్రోపాఖ్యానము |
101 | వారణాసి వేంకటేశ్వరకవి | రామచంద్రోపాఖ్యానము |
102 | మంత్రిప్రెగడ సూర్యప్రకాశ కవి | సీతారామచరిత్రము |
103 | వడ్డాది తిమ్మరాజకవి | శ్రీరామావతారము |
104 | మండ కామేశ్వర శాస్త్రి | రామకథాసారసంగ్రహము |
105 | చామర్తి శేషరాయకవి | రామకథాసుధాలహరి |
106 | కొత్తపల్లి లచ్చయకవి | దాశరథి విలాసము |
107 | నాగలింగకవి | పట్టాభిరామవిలాసము |
108 | చెఱుకుమూడి కృష్ణయ్య | శృంగార రాఘవము |
109 | ఆవంచ భావన | రఘురామ విజయము |
110 | అప్పలరాజు | సీతాచరిత్రము |
111 | నండూరి బాపమంత్రి | శ్రీరామచరిత్రము |
112 | నడిమింటి వేంకటపతి | అభిషిక్త రాఘవము |
113 | చిదంబర కవి | శ్రీ రామకుమార విజయము |
114 | రంగయ | రామోదయము |
115 | పిన్నమరాజు బలరామకవి | శ్రీ రామచంద్రకథా సుధాలహరి తరంగిణి(తరంగములు)
రామచంద్ర కథా సుధార్ణవము |
116 | నారాయణ రామానుజాచార్యులు | రాఘవాభ్యుదయము |
117 | కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి | జానకీహరణ కావ్యము |
118 | మండా కామేశ్వశాస్త్రి | శ్రీరామావతారము |
119 | బొడ్డుచర్ల తిమ్మన | ప్రసన్న రాఘవనాట్య ప్రబంధ పద్యానువాదము |
120 | కోపల్లె శివకామేశ్వరరావు | శ్రీమద్రామాయాణము |
121 | రత్నాకరము గోపాలరాజు | దశరథకుమార చరిత్ర |
122 | మాదిరాజు విశ్వనాథరావు | జానకీ పరిణయము |
123 | వాదాల శేషాచార్యులు | మైథిలీ పరిణయము |
124 | బేతపూడి కృష్ణయ్య | జానకీరాఘవము |
125 | పళ్ళెపూర్ణప్రజ్ఞాచార్యులు | శ్రీరామకల్యాణము |
126 | వాజపేయ యాజుల రామసుబ్బారాయ వేంకట నారాయణ సోదరకవులు | సీతాకల్యాణము |
మూలాలు
[మార్చు]- ↑ శ్రీమద్రామాయణములో ఆంధ్రాయణము అను ఆంధ్ర జనపద రామాయణము. మచిలీపట్టణము: శ్రీ శారదా సాహితీ సంసద్. p. ౯౬.