Jump to content

తెలుగు భాష విధానం

వికీపీడియా నుండి
Black outdoor statue with an orange garland
తెలుగుతల్లి విగ్రహం, తెలుగు ప్రజల సంకేతం

తెలుగు భాష విధానం అనగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ప్రభుత్వం పరంగా, సామాజిక పరంగా తెలుగు వాడుకకు సంబంధించిన విధానం. తెలంగాణ విభజనకు ముందు ఈ రాష్ట్రాల ప్రజలలో 84 శాతం మంది తెలుగు భాషను మొదటి భాషగా గుర్తించారు.[1][2] భాషకు ప్రోత్సాహకత, భాష పట్ల ప్రభుత్వ మద్దతుకు అడపాదడపా చర్యలు తీసుకున్నా అవి సమర్ధవంతంగా అమలు చేయలేదు. బోధనాపరంగా, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు బోధనామాధ్యమంగా తెలుగు స్థానంలో ఆంగ్లాన్ని ప్రవేశపెట్టటానికి చర్యలు ప్రారంభించాయి.

చరిత్ర

[మార్చు]

ప్రపంచంలోని ఏ దేశం దాని మాతృభాషలో విద్యను అందించకుండా అభివృద్ధి చెందలేదు. అనేక దేశాలు తమ మాతృభాషలో విద్యను అందించడం ద్వారా భారతదేశం కంటే వేగంగా వృద్ధి చెందుతున్నాయి. అంతర్జాతీయ భాషగా ఆంగ్ల భాష పరిణామం చెందడానికి ఆంగ్ల ప్రజల అంకితభావం, భాషపై ప్రేమ, వారి భాషను అభివృద్ధి చేయాలనే ప్రయత్నాలు ముఖ్యమైనవి. యునైటెడ్ కింగ్‌డం లో, వెల్ష్(మైనారిటీ భాష) కూడా ప్రోత్సహించబడుతుంది. యునైటెడ్ కింగ్‌డమ్‌ లో వెల్ష్ భాష (సుమారు 750,000 మంది ప్రజలు మాట్లాడతారు) చట్టపరమైన హోదా భారతదేశంలో ఉన్న తెలుగు భాష (85 మిలియన్ల మంది) తో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది.

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు తరువాత 1966 లో ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం ఏర్పడి తెలుగును అధికార భాషగా చేయటానికి కృషి చేసింది. దీనిలో భాగంగా తొలి ప్రపంచ తెలుగు మహాసభలు 1975 లో నిర్వహించారు.

2012లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12 సంవత్సరాల విరామం తర్వాత నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించింది. ప్రపంచ వ్యాప్తంగా 5000 మంది తెలుగు ప్రతినిధులు తిరుపతి లో జరిగిన సభలకు హాజరయ్యారు.[3] దీనిలో ఆమోదించిన తీర్మానాలను అమలు చేయటానికి ప్రయత్నాలు జరిగాయి.

అమలు

[మార్చు]
"Ana dili"
అజర్ బైజానీ స్థానిక భాషలో అన డిలీ అనబడే శిలాస్మారకం
  • 2013-14 విద్యా సంవత్సరం నుండి 10వ తరగతి వరకు తెలుగు భాషను తప్పనిసరిగా నేర్పించాలి.[4]
  • 2012 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని షాపులు, వాణిజ్య ప్రకటనలను తప్పనిసరిగా తెలుగులోనే రాయాలని ప్రకటించింది.[5]
  • పాఠశాలలలో తెలుగు మాట్లాడే విద్యార్థులకు శిక్షించే ఉపాధ్యాయులు గల పాఠశాలకు గుర్తింపు రద్దు చేయబడుతుంది.[6][7]
  • ప్రపంచ యునికోడ్ కన్సార్టియంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేరింది[8]
  • గ్రామం నుండి రాష్ట్ర కార్యదర్శి స్థాయి వరకు అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులో ఉంటుంది, అన్ని అధికారిక పత్రాలు తెలుగులో సంతకం చేయబడతాయి.[9]
  • వార్షిక రాష్ట్రస్థాయి కార్యక్రమాలైన తెలుగు భాషా దినోత్సవం (గిడుగు వెంకట రామమూర్తి జన్మదినం సందర్భంగా)[10], అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, అధికార భాషా దినోత్సవం,[11] ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ జన్మదినం[12] కార్యక్రమాలను తెలుగు భాషాభివృద్ధికి స్ఫూర్తిని అందించడానికి నిర్వహిస్తారు.
  • 2012-2013లో తెలుగు భాష, సంస్కృతిని ప్రోత్సహించడానికి ప్రతి జిల్లాకు 2 మిలియన్ల రూపాయలను వెచ్చించింది.[13]
  • తెలుగులో ఉత్తర ప్రత్యుత్తరాలను ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పురస్కారాలు అందజేస్తుంది.
  • హైకోర్టు మినహా అన్ని కోర్టు విచారణలు, తీర్పులు తెలుగులోనే ఉంటాయి.[14][15]
  • రాష్ట్ర ప్రభుత్వం 2013ను తెలుగు అభివృద్ధి సంవత్సరంగా ప్రకటించింది.[16][17]
  • తెలుగు భాషను అభివృద్ధి చేయడానికి ఒక మంత్రిత్వశాఖ[18] ప్రారంభించబడింది. పుస్తక అనువాదాలు చేయడం, పదజాలాభివృద్ధి చెయడం, తెలుగు ఫైన్ ఆర్ట్స్, సాహిత్య అకాడమీలు పునరుద్ధరించడం,[19] సాఫ్టువేర్ అభివృద్ధి [20] వంటి కార్యక్రమాలు జరుగుతున్నవి.
  • రాష్ట్ర ప్రభుత్వం నియామకాల్లో తెలుగు-మాధ్యమిక విద్యార్థులకు ప్రాధాన్యత.[21]


ఆంధ్రప్రదేశ్ విభజనతో పైన తెలిపిన చర్యలు అమలు చాలావరకు ఆగిపోయింది. [22]

స్వచ్ఛంద కార్యక్రమాలు

[మార్చు]

ప్రత్యామ్నాయ తెలుగు పదాలను ఉపయోగించి, తెలుగు కార్యక్రమాలలో ఆంగ్ల భాషను తగ్గించటానికి ప్రింట్, దృశ్య తెలుగు మీడియా చర్యలు తీసుకున్నాయి.[23] ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నేషనల్ క్రికెట్ అకాడమీ కోచింగ్ మాన్యువల్ ను తెలుగులోకి అనువదించింది.[24]

బోధనా భాష

[మార్చు]

తెలుగు, ఆంగ్ల భాషలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని పాఠశాలలో బోధిస్తున్న ప్రధాన భాషలు. కొన్ని పాఠశాలలలో ఇతర ప్రాంతీయ భాషలైన ఉర్దూను బోధనా భాషగా వాడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలలో ఆంగ్లమాధ్యమం పాఠశాలల సంఖ్యను పెంచుటకు కృషి చేస్తున్నది. కొన్ని రాష్ట్ర పాఠశాలలలో ఒక్క ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే బోధించుటకు ప్రతిపాదనలు వచ్చినందున ఈ విధానం తల్లిదండ్రులకు ఆంగ్లమాధ్యమంపై పెరుగుతున్న కోరికను ప్రతిబింబిస్తుంది. ఆంగ్ల మాధ్యమ పాఠశాలల కోసం పెరిగిన కోరిక తీర్చలేకపోతే ప్రభుత్వ రంగం పాఠశాలలు విద్యార్థులను కోల్పోతాయని భావించబడుతున్నది.[25][26] 2019-20 నుండి ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రభుత్వ పాఠశాలలలో ఆంగ్ల బోధనా మాధ్యమం ప్రవేశపెడుతున్నారు.[27]

తెలంగాణ ప్రభుత్వం, 2017 లో ప్రపంచ తెలుగు మహాసభలు జరిపిన తరువాత, తెలుగు భాష ప్రోత్సాహానికి, 1 నుండి 12 వ తరగతి వరకు తెలుగు చదవడం తప్పనిసరిచేసింది.[28] తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని ప్రైవేటు పాఠశాలల్లో ఇంగ్లీష్-మాధ్యమిక విద్యను తప్పనిసరి చేయాలన్న ప్రతిపాదనను తెలుగు భాషా కార్యకర్తలు వ్యతిరేకించారు.[29] ఇంగ్లీష్ భాషా మాధ్యమ పాఠశాలల్లో విద్యార్థులు తెలుగులో మాట్లాడినందువలన శిక్షలు మరింత పెరిగిపోయాయి.[30] 2022-23 నుండి తెలంగాణ లో ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల భాష ప్రధాన బోధనా భాషగా మారనుంది.


మూలాలు

[మార్చు]
  1. "Census of India - Distribution of the 22 Scheduled Languages". www.censusindia.gov.in. Retrieved 2018-02-27.
  2. "Census of India - Statement II". www.censusindia.gov.in. Retrieved 2018-02-27.
  3. "PM Manmohan Singh lauds Telugu people". 29 December 2012. Archived from the original on 5 ఫిబ్రవరి 2013. Retrieved 17 March 2013. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  4. "Telugu to be compulsory in State schools". 29 January 2013. Archived from the original on 30 జనవరి 2013. Retrieved 17 March 2013. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  5. "Shop signs must be in Telugu In Andhra Pradesh". 24 November 2012. Archived from the original on 11 ఏప్రిల్ 2013. Retrieved 17 March 2013. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  6. "Private schools warned against discouraging Telugu". 26 October 2012. Archived from the original on 28 అక్టోబరు 2012. Retrieved 17 March 2013. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  7. "It's going to be Telugu 'Velugu' vs English-Vinglish". Retrieved 17 March 2013.
  8. "Telugu set to become world language". 9 September 2011. Archived from the original on 11 ఏప్రిల్ 2013. Retrieved 17 March 2013. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  9. "Officials appending signatures in Telugu". 7 February 2013. Retrieved 17 March 2013.
  10. "Celebrate Telugu language – Remembering Gidugu Ramamurthy". 30 August 2012. Archived from the original on 11 ఏప్రిల్ 2013. Retrieved 17 March 2013.
  11. "May 14 is official language day in AP". 2013-02-05. Archived from the original on 2013-04-11. Retrieved 17 March 2013.
  12. "Brown, father of modern day Telugu language". 2 November 2008. Archived from the original on 11 ఏప్రిల్ 2013. Retrieved 17 March 2013. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  13. "Efforts to promote Telugu language to get a fillip". Retrieved 17 March 2013.
  14. "Chief Minister N Kiran Kumar Reddy endorses use of Telugu in judiciary". Archived from the original on 28 మే 2013. Retrieved 17 March 2013. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  15. "Stress on use of mother tongue in courts". 10 March 2013. Retrieved 17 March 2013.[permanent dead link]
  16. "2013 declared Telugu Development Year". Retrieved 27 March 2013.[permanent dead link]
  17. "Rs. 25 crore allocated for 'Telugu Baata'". Retrieved 27 March 2013.
  18. "Separate ministry to promote Telugu: CM". 28 December 2012. Archived from the original on 11 ఏప్రిల్ 2013. Retrieved 17 March 2013. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  19. "Plan to revive fine arts, literature academies: Buddha Prasad". 9 February 2013. Retrieved 17 March 2013.
  20. "CM gets award for success of Telugu conference held in USA". 18 February 2012. Archived from the original on 4 ఫిబ్రవరి 2013. Retrieved 17 March 2013. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  21. "Weightage for Telugu medium students in govt jobs likely". 2012-11-26. Retrieved 17 March 2013.
  22. కొండనీటి, శివనాగరాజు (2020-02-23). "తెలుగును కాపాడుకుందాం…అమ్మ భాష". tv9telugu. Retrieved 2022-03-22.
  23. "Telugu language slowly back on track in media". 2012-12-20. Retrieved 17 March 2013.
  24. "National Cricket Academy coaching manual in Telugu". 2012-07-30. Archived from the original on 2013-04-11. Retrieved 17 March 2013. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  25. "English medium must in state schools, says Andhra Pradesh government". deccanchronicle.com/ (in ఇంగ్లీష్). 2017-05-01. Retrieved 2018-02-27.
  26. "AP mulls over English medium in government schools". The Hans India (in ఇంగ్లీష్). Retrieved 2018-02-27.
  27. Wikisource link to ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2019-20. వికీసోర్స్. Wikisource page link 16. 
  28. "Telugu now a mandatory subject for Telangana Class 1 to 12 school students". India Today (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-09-14. Retrieved 2018-02-27.
  29. Dayashankar, K. M. (2016-01-17). "Telugu loses out to English as medium of education". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2018-02-27.
  30. "Girl caned for speaking Telugu in school". 9 March 2012. Archived from the original on 11 ఏప్రిల్ 2013. Retrieved 17 March 2013. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)