తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలు-2023
తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలు-2023 | ||
పురస్కారం గురించి | ||
---|---|---|
విభాగం | వివిధ రంగాలలో కృషి | |
వ్యవస్థాపిత | 2015 | |
మొదటి బహూకరణ | 2015 | |
క్రితం బహూకరణ | 2022 | |
మొత్తం బహూకరణలు | 27 | |
బహూకరించేవారు | తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర మహిళా-శిశు సంక్షేమ శాఖ | |
నగదు బహుమతి | ₹ 1,00,000 | |
Award Rank | ||
2022 ← తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలు-2023 → 2024 |
తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం తెలంగాణ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతీ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఆయా రంగాల్లో రాణించిన మహిళలకు అందజేసే పురస్కారం.[1] గౌరమ్మను గంగలో పూజించే బతుకమ్మ సాక్షిగా.. దుర్గమ్మను నైవేద్యంతో పూజించే బోనం సాక్షిగా.. స్త్రీలను గౌరవించుకోవడం, సత్కరించుకోవడం తెలంగాణ రాష్ట్ర సంప్రాదాయం. స్వతంత్ర భారతంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతీ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఆయా రంగాల్లో రాణించిన మహిళలకు ప్రత్యేక పురస్కారాలు అందజేస్తుంది.[2]
2023 పురస్కారాల్లో భాగంగా వివిధ రంగాల్లో సత్తా చాటుతున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రతిభామూర్తుల్లో 20 కేటగిరీలకుగాను 27 మందిని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ మహిళలుగా ఎంపిక చేసింది.[3] ఎంపికైన మహిళలకు 2023 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లక్ష రూపాయల నగదుతోపాటు ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందించి సత్కరించారు.[4]
పురస్కారాల ప్రదానం
[మార్చు]హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో వరంగల్లులోని కాకతీయ విశ్వవిద్యాయలం ఆడిటోరియంలో 2023 పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ‘వనిత వనం’ అనే కార్యక్రమాన్ని చేపట్టి, పురస్కారాలకు ఎంపికైన మహిళలందిరితో మొక్కలు నాటించారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి, శాసన మండలి డిపూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునితా లక్ష్మారెడ్డి, తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్ దీపికా రెడ్డి, వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ గుండు సుధారాణి, అధికారులు తదితరులు హాజరయి పురస్కారాలు అందజేశారు.[5]
పురస్కార గ్రహీతలు
[మార్చు]2023 పురస్కారానికి ఎంపికైన మహిళలు[6]
క్రమసంఖ్య | పేరు | స్వస్థలం | రంగం | విభాగం | చిత్రమాలిక |
---|---|---|---|---|---|
1 | బానోతు జ్యోతి | లక్ష్మీదేవిపల్లి | మహిళా, శిశు సంక్షేమసేవ | అంగన్‌వాడీ టీచర్ | |
2 | గుండా రాజకుమారి | ఖమ్మం | సెంటర్ కోఆర్డినేటర్, భరోసా సెంటర్ | ||
3 | ఆల్ఫి కిండన్‌జెన్ | బోనకల్లు | సామాజిక సేవ | సామాజిక కార్యకర్త | |
4 | మీనాక్షి గాడ్గె | ముఖ్రా కే సర్పంచ్ | |||
5 | సుజాత దీక్షిత్ | హైదరాబాదు | నాటకరంగం | నటన, పరిశోధన | |
6 | స్వరూప పొట్లపల్లి | వరంగల్ | జర్నలిజం | పాత్రికేయురాలు | |
7 | డాక్టర్ బండారు సుజాత శేఖర్ | సాహిత్యం | జానపద సాహిత్యం | ||
8 | అరుణ నారదభట్ల | హైదరాబాదు | సాహిత్యం | కవయిత్రి | |
9 | డాక్టర్ అమూల్య మల్లన్నగారి | హైదరాబాదు | వైద్యరంగం | వైద్యసేవ | |
10 | నారా విజయలక్ష్మి | తుర్కపల్లి, మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా | చిత్రకళ | చిత్రకారిణి | |
11 | ఓఎన్ఐ సిస్టర్స్ (వినోద, విజయ, విజయలక్ష్మి) | సంగీతం | గానం | ||
12 | పి. రుక్మిణి | అమీర్ పేట | ఇన్‌స్పెక్టర్ | షీ టీమ్స్ భరోసా సెంటర్ | |
13 | సి. అనసూయ | హైదరాబాదు | ఐపీఎస్, డీసీపీ | పోలీసు డిపార్ట్‌మెంట్ | |
14 | పడమటి అన్వితారెడ్డి | యర్రంబల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా | పర్వతారోహకురాలు | ||
15 | త్రిష గొంగడి | భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా | క్రీడారంగం | అండర్ -19 క్రికెటర్ | |
16 | డాక్టర్ అనురాధ తడకమళ్ల | హైదరాబాదు | శాస్త్రీయ నృత్యం | నృత్యకారిణి | |
17 | దంటు కనకదుర్గ | సామాజిక సేవ | సామాజిక కార్యకర్త | ||
18 | డాక్టర్ పొన్నూరు మాలతి | పేట్లబుర్జ్, హైదరాబాదు | ఆరోగ్య సేవ | సూపరింటెండెంట్, ఎంజీఎంహెచ్ | |
19 | సమంత రెడ్డి | పారిశ్రామికవేత్త | ఎఫ్ఎల్ఓ వైస్ చైర్మన్ | ||
20 | కర్నె శంకరమ్మ | మహబూబ్ నగర్ | జానపదం | కిన్నెర | |
21 | డాక్టర్ గుడూరు మనోజ | మహబూబ్ నగర్ | జానపదం | ఆద్య కళ | |
22 | సామళ్ల శ్వేత | సామాజిక సేవ | కమ్యూనిటీ మొబిలైజేషన్ | ||
23 | జి. నందిని | నిజామాబాద్ (అ) ప్రాజెక్ట్ | సూపర్‌వైజర్ | ||
24 | రజియా సుల్తానా | నర్సాపూర్ | ఆరోగ్య సేవ | ఏడబ్ల్యూహెచ్, కౌడిపల్లి, ఐసీడీఎస్ | |
25 | ఎం. కృష్ణవేణి | మొండికుంట, ఖమ్మం | ఆరోగ్య సేవ | ఆశా వర్కర్ | |
26 | ఇందిర | బోగారం, మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా | ఆరోగ్య సేవ | ఏఎన్ఎం | |
27 | డాక్టర్ కందేపి రాణి ప్రసాద్ | సాహిత్యం | రచయిత్రి |
ఇవికూడా చూడండి
[మార్చు]- తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలు-2017
- తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలు-2018
- తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలు-2019
మూలాలు
[మార్చు]- ↑ నమస్తే తెలంగాణ, జిందగీ (7 March 2017). "ప్రతిభకు పురస్కారం!". Archived from the original on 8 March 2019. Retrieved 8 March 2020.
- ↑ నమస్తే తెలంగాణ, జందగీ (7 March 2018). "యత్ర నార్యస్తు పూజ్యంతే." Archived from the original on 8 March 2019. Retrieved 8 March 2020.
- ↑ telugu, NT News (2023-03-06). "Womens Day | 27 మంది మహిళలకు పురస్కారాలు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం". www.ntnews.com. Archived from the original on 2023-03-06. Retrieved 2023-03-06.
- ↑ "సేవలు గుర్తించి.. పురస్కారాలు అందించి". EENADU. 2023-03-09. Archived from the original on 2023-03-13. Retrieved 2023-03-13.
- ↑ "సేవలు గుర్తించి.. పురస్కారాలు అందించి". EENADU. 2023-03-09. Archived from the original on 2023-03-13. Retrieved 2023-03-13.
- ↑ telugu, NT News (2023-03-09). "Women awards 2023 | మహిళకు నమస్కారం.. ప్రతిభకు పురస్కారం". www.ntnews.com. Archived from the original on 2023-03-09. Retrieved 2023-03-13.