Jump to content

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం

వికీపీడియా నుండి

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) అనేది తెలంగాణలోని సింగరేణికి చెందిన బొగ్గు గని కార్మికుల కార్మిక సంఘం.[1] తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాజకీయంగా పార్టీ భారత రాష్ట్ర సమితికి అనుబంధంగా ఉంది.

చరిత్ర

[మార్చు]

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గౌరవ అధ్యక్షురాలిగా సింగరేణిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏర్పాటు అయింది. గతంలో సింగరేణి పరిధిలోని కొత్తగూడెం, సత్తుపల్లి, భూపాలపల్లి, మంచిర్యాల, గోదావరిఖని ప్రాంతాల్లో ఈ సంఘం తన ప్రభావాన్ని చూపింది. 2022 మార్చిలో కెంగెర్ల మల్లయ్య యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. "Singareni coal mine workers to get 27 per cent share in profits: Telangana govt". The News Minute. 23 August 2018. Retrieved 5 May 2024.
  2. "Mancherial: TBGKS gets new working president". Telangana Today. Telangana Publications Pvt. Ltd. 11 March 2022. Retrieved 5 May 2024.