తెలంగాణ శకుంతల
తెలంగాణ శకుంతల | |
---|---|
దస్త్రం:Telangana Shakuntala.jpg | |
జననం | కడియాల శకుంతల జూన్ 9, 1951 మహారాష్ట్ర |
మరణం | జూన్ 14, 2014 కొంపల్లి, హైదరాబాద్, తెలంగాణ |
మరణ కారణం | గుండెపోటు |
నివాస ప్రాంతం | కొంపల్లి |
ఇతర పేర్లు | తెలంగాణ శకుంతల |
వృత్తి | సినిమా నటి |
ప్రసిద్ధి | సినిమా నటి, హాస్య నటి,ప్రతి నాయిక |
పదవీ కాలం | 1979 నుండి 2014 వరకు |
మతం | హిందువు |
పిల్లలు | ఇద్దరు |
తెలంగాణ శకుంతల (జూన్ 9, 1951 - జూన్ 14, 2014) రంగస్థల నటి, తెలుగు సినిమా రంగంలో క్యారెక్టర్ నటి, ప్రతినాయకురాలు, హాస్య నటి.
జీవిత విశేషాలు
[మార్చు]శకుంతల ముందుగా రంగస్థలం ద్వారా పరిచయమయ్యారు. ఒంటికాలి పరుగు నాటికతో రంగస్థల ప్రవేశం చేశారు. అభివృద్ధికి దోహదపడిన నటుడు, దర్శకుడు వల్లం నాగేశ్వరావు గారు. కూడా గుర్తొస్తున్నారు.. పద్య పఠనంలో మంచి ప్రావీణ్యాన్ని సంపాదించి, శ్రీ కృష్ణ తులాభారం నాటకంలో సత్యభామగా, మహాకవి కాళిదాసు నాటకంలో విద్యాధరిగా నటించారు. పరభాషా నటీమణి అయినా తెలుగును చాలా స్పష్టంగా ఉచ్చరించి, ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. చాలా చిత్రాల్లో తెలంగాణా యాస మాట్లాడటం వలన తెలంగాణ ఇంటి పేరుగా మారిపోయింది.
1979లో మా భూమి ద్వారా తెలుగు సినిమా రంగంలో అడుగుపెట్టారు.[1] 75కు పైగా సినిమాలలో నటించారు. ఈవిడ నటించిన చివరి సినిమా పాండవులు పాండవులు తుమ్మెద.[2] ఈమెకు కుక్క సినిమాలో నటనకు గాను నంది ఉత్తమ నటీమణి అవార్డు లభించింది.
- ఒసేయ్ రాములమ్మ
- సమ్మక్క సారక్క
- కొరియర్ బాయ్ కళ్యాణ్ (2015)
- పాండవులు పాండవులు తుమ్మెద (2014)
- మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో (2014)
- చండీ (2013)
- ఏమైంది ఈవేళ (2013)
- సౌండ్ పార్టీ (2013)
- రాయలసీమ ఎక్స్ప్రెస్ (సినిమా) (2013)
- అమ్మా ఎల్లమ్మా (2013)
- నా అనేవాడు (2013)
- పీపుల్స్ వార్ ( 2012)
- ఆడ పాండవులు (2012)
- గౌరవం (2012)
- ఈ వేసవిలో ఓ ప్రేమ కథ (2012)
- రాజన్న (2011)
- పిల్లదిరికితే పెళ్ళి (2011)
- పంచాక్షరి (2010)
- బురిడి (2010)
- మా నాన్న చిరంజీవి (2010)
- కళ్యాణ్ రామ్ కత్తి (2010)
- గ్లామర్ (2010)
- నీకు నాకు (2010)
- రంగ ది దొంగ (2010)
- బిందాస్ (2010)
- సివాంగి (2010)
- చాప్టర్ 6 (2010)
- కొమరం భీం (2010)
- హ్యాపీ హ్యాపీగా (2010)
- ఆంధ్రా కిరణ్ బేడీ (2010)
- ఒక్క క్షణం (2010)
- బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం (2010)
- మస్కా ( 2009)
- ఎవరైనా ఎప్పుడైనా (2009)
- అతను ఆమె ఇంట్లో ఈమె (2009)
- నిర్ణయం 2009 (2009)
- కవి (2009)
- కరెంట్ (2009)
- బెండు అప్పారావ్ ఆర్. ఎం. పి (2009)
- పిస్తా (2009)
- సిద్దు ఫ్రం శ్రీకాకుళం (2008)
- కుబేరులు (2008)
- అంకుషం (2008)
- జాబిలమ్మా (2008)
- మల్లెపువ్వు (2008)
- లక్ష్మీ కళ్యాణం (2007)
- వియ్యాలవారి కయ్యాలు (2007)
- దేశముదురు (2007)
- దుబాయ్ శీను (2007)
- జగడం (2007)
- ఒక విచిత్రం (2006)
- అన్నవరం (2006)
- శ్రీ కృష్ణ 2006 (2006)
- మా ఇద్దరి మధ్య (2006)
- లక్ష్మీ (2006)
- సైనికుడు (2006)
- సదా మీ సేవలో (2005)
- ఎవ్వడి గోల వాడిది (2005)
- వీరివీరి గుమ్మడి పండు (2005)
- ఒక్కడే (2005)
- ఒరేయ్ పండు (2005)
- పల్లకీలో పెళ్ళి కూతురు (2004)
- ఐతే ఏంటి (2004)
- శంఖారావం (2004)
- ఆంధ్రావాలా (2004)[4]
- ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి (2004)
- నేనుసైతం (2004)
- దొంగ - దొంగది (2004)
- అడవి రాముడు (2004)
- ఒక్కడు (2003)
- సింహాచలం (2003)
- పెళ్ళాంతో పనేంటి (2003)
- చార్మినార్ (2003)
- గంగోత్రి (2003)
- శంబు (2003)
- విష్ణు (2003)
- వీడే (2003)
- ధూల్ (2003)
- అభిమన్యు (2003)
- నాగప్రతిష్ఠ (2003)
- సందడే సందడి (2002)
- ఇంద్ర (2002)
- తప్పుచేసి పప్పుకూడు (2002)
- కొండవీటి సింహాసనం (2002)
- సీతారామయ్యగారి మనవరాలు (1991)
- తెలుగోడు (1998)
- గులాబి (1996)
- అహ నా పెళ్ళంటా (1987)
- కుక్క (1980)
- మా భూమి (1979)[5]
తమిళ సినిమాలు
[మార్చు]- మచక్ కాలయ్ (2009)- తమిళం
- ధూల్ (2003) - తమిళం
మరణం
[మార్చు]హైదరాబాద్ లోని కొంపల్లిలోని వీరి ఇంట్లో 2014, జూన్ 14 న తెల్లవారు ఝామున దాదాపు 3.00 గంటలకు గుండెపోటు రావడంతో నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి డాక్టర్లు శకుంతల గుండెపోటుతో మరణించినట్లు ప్రకటించారు.[6]
మూలాలు
[మార్చు]- ↑ సాక్షి దినపత్రికలో శకుంతలపై కథనం[permanent dead link]
- ↑ "తెలంగాణ శకుంతల కన్నుమూత, నమస్తే తెలంగాణ జూన్ 14, 2014". Archived from the original on 2014-06-16. Retrieved 2014-06-14.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ http://www.imdb.com/name/nm1328049/ IMDB జాల స్థలిలో తెలంగాణ శకుంతల గురించి
- ↑ FilmiBeat, Movies. "Andhrawala Cast & Crew". www.filmiBeat.com (in ఇంగ్లీష్). Archived from the original on 6 June 2020. Retrieved 6 June 2020.
- ↑ మా భూమి గురించి Rajadhyaksha, Ashish and Paul Willemen. Encyclopedia of Indian Cinema, (New Delhi) 1999; p.441
- ↑ Telangana Shakuntala passes away ది హన్స్ లో శకుంతల మరణంపై కథనం