తెలంగాణా బీసీ కులాల జాబితా
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
తెలంగాణ లో 112 బీసీ కులాలకు రిజర్వేషన్లను వర్తింపజేస్తూ 2014 ఆగస్టు ఉత్తర్వులు జారీ చేసినది దీని ప్రకారం 112 వెనుకబడిన కులాలకు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం బీసీ ధృవీకరణ పత్రాలను జారీ చేయనుంది. ఉమ్మడి రాష్ట్రంలో 138 బీసీ కులాలకు రిజర్వేషన్లను అమలు చేయగా, వీటిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవి 112 కులాలు ఉన్నాయని గుర్తించినట్లు ప్రకటించింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని నిబంధనల మేరకు ఈ కులాలకు రిజర్వేషన్లను కల్పిస్తూ ఉమ్మడి రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఇక్కడ కూడా అమలు చేస్తామని ఉత్తర్వుల్లో తెలిపింది. గ్రూపు ‘ఏ’లోని కులాలకు 7 శాతం, గ్రూపు ‘బీ’లోని కులాలకు 10 శాతం, గ్రూపు ‘సీ’లోని కులాలకు 1 శాతం, గ్రూపు ‘డీ’లోని కులాలకు 7 శాతం, గ్రూపు ‘ఈ’లోని కులాలకు 4 శాతం కలుపుకొని మొత్తం 29 శాతం రిజర్వేషన్లను ఖరారు చేసింది.
గ్రూపు ‘ఏ’
[మార్చు]- 1అగ్నికుల క్షత్రియ, పల్లి, వాడబలిజ, బేస్త, జాలరి, గంగవర్, గంగపుత్ర, గూండ్ల, వన్యకుల క్షత్రీయ (వన్నెకాపు, వన్నెరెడ్డి, పల్లికాపు, పల్లిరెడ్డి),
- 2నెయ్యాల
- 3పట్టపు
- 4బాల సంతు
- 5బుడబుక్కల
- 6రజక (చాకలి, వన్నార్),
- 7దాసరి,
- 8దొమ్మర,
- 9గంగిరెడ్లవారు,
- 10జంగం,
- 11జోగి,
- 12కాటిపాపల,
- 13మేదరి లేదా మహేంద్ర,
- 14మొండిరేవు,
- 15మొండిబండ,
- 16 బండ,
- 17నాయి బ్రాహ్మణ (మంగలి), మంగల, భజంత్రీ,
'18వంశరాజ్/పిచ్చగుంట్ల,
- 19పాముల,
- 20పార్థి (మిర్మికారి)
- 21పంబల,
- 22దమ్మలి/దమ్మల/దమ్ముల/దమల,
- 23పెద్దమ్మవాండ్లు,
- 24దేవరవాండ్లు,
- 25ఎల్లమ్మవాండ్లు,
- 26ముల్యాలమ్మవాండ్లు,
- 27వీరముష్టి (నెట్టికోటల),
- 28వీరభద్రేయ,
- 29వాల్మీకిబోయ (బోయ, బేదర్, కిరాటక, నిషాది, ఎల్లపి, ఎల్లపు, పెద్దబోయ,సదరు బోయ) *39తల యారి,
- 31చుండవల్లిగుడాల,
- 32కంజర-భట్ట,
- 33కెప్మారే లేదా రెడ్డిక,
- 34మొండిపట్ట,
- 35నొక్కర్,
- 36పారికి మొగ్గుల,
- 37యాట,
- 38చోపేమరి,
- 39కైకడి,
- 40జోషినందివాలాస్,
- 41వడ్డె (వడ్డీలు, వడ్డి, వడ్డెలు),
- 42 కునపు లి,
- 43 పాత్ర,
- 44పాల-ఈకరి,
- 45ఈకిల,
- 46వ్యాకుల,
- 47ఈకిరి,
- 48నాయనివారు,
- 49పాలేగారు,
- 50తోలగరి,
- 51కావలి,
- 52రాజన్నల, రాజన్నలు,
- 53బుక్కఅయ్యవారు,
- 54గోత్రాల, కా సికాపడి/ కాశీకాపుడి,
- 55సిద్ధుల,
- 56సిక్లిగర్/సైకల్‌గర్,
- 57పూసల (గ్రూపు ‘డీ’నుంచి తొలగించి చేర్చారు).
గ్రూపు ‘బీ’
[మార్చు]శెట్టిబలిజ,ఆర్య క్షత్రియ, చిత్తారి, జీనిగర్, చిత్రకార, నఖాస్, దేవాంగ, గౌడ (గమండ్ల), కలాలి, గుండ్ల, శ్రీశయన (సెగిడి, దూదేకుల, లద్దాఫ్, పింజరి లేదా నూర్‌బాషా, సజ్జన గాండ్ల, దేవ గాండ్ల, తెలికుల, దేవతిలకుల, జాండ్ర, కుమ్మర లేదా కులాల, శాలివాహన,ఈడిగ,కిరకలభక్తుల, కైకోలన్ లేదా కైకల (సేన్‌గుండం లేదా సేన్‌గుంతర్), కర్ణభక్తుల, కురుబ లేదా కురుమ, నీలకంఠి, పల్కార్ (ఖత్రి, పెరిక (పెరిక బలిజ, పురగిరి క్షత్రియ), నెస్సి లేదా కుర్ణి, పద్మశాలి (శాలి, శాలివాహన, పట్టుశాలి, సేనాపతులు. తొగట శాలి), స్వాకులశాలి, తొగటి / తొగట వీరక్షత్రియ, విశ్వబ్రాహ్మణ, ఔసుల, కంసాలి, కమ్మరి, కంచరి, వడ్ల (వడ్ర, వడ్రంగి, శిల్పి, విశ్వకర్మ, లోధ్, లోధి, లోధా, బోంధిలి, ఆరె మరాఠీ, మరాఠా (బ్రాహ్మణేతరులు), ఆరాకలీస్, సురభి నాటకాలవాళ్లు, నీలి, బుడుభుంజల/భుంజ్వా/భద్‌భుంజా.
గ్రూపు ‘సీ’
[మార్చు]క్రైస్తవమతాన్ని స్వీకరించిన షెడ్యూల్‌కులాల వారు
గ్రూపు ‘డీ’
[మార్చు]ఆరెకటిక, కటిక, ఆరె సూర్యవంశి, భట్రాజులు, చిప్పొళ్లు (మెర), హట్కర్, జింగర్, కచి, సూర్యబలిజ (కళావంతుల) గానిక, కృష్ణబలిజ (దాసరి, బుక్క), మాతుర, మాలిబారె, బారియ, మారార్, తాంబోలి,ముదిరాజు(ముత్రాసి, తెనుగొల్లు),మున్నురు కాపు, లక్కమారికాపు, పస్సి, రంగ్రేజ్/భవసారక్షత్రియ, సాధుచెట్టి, సాతాని (చాత్తాదశ్రీవైష్ణవ),
(తమ్మలి-- ఆది శైవ బ్రాహ్మణులు. వీరు శివాలయాల్లో అర్చకత్వం చేసేటటువంటి బ్రాహ్మణులు.)
"""యాదవ"""(యాదవ రాజులు,గొల్ల వారు)
ఉప్పర లేదా సగర, వ ంజర (వంజరి), ఆరెవాళ్లు, ఆరోళ్లు, అయ్యరక, నగరలు, అఘముడియన్, అఘముడియర్, అఘముడి వెల్లాలర్, అఘముడి ముడాలియర్, సొండి/సుండి, వరాల, శిష్టకరణం, వీరశైవలింగాయత్/ లింగబలిజ, కురిమి.
గ్రూపు ‘ఈ’
[మార్చు]అచ్చుకట్టలవాండ్లు, సింగలి, సింగంవాళ్లు, అచ్చుపానీవాళ్లు, అచ్చుకట్టువారు, అచ్చుకట్లవాండ్లు, అత్తర్‌సాయెబులు, అత్తరోల్లు, ధోబీ ముస్లిం/ముస్లిం ధోబీ/ ధోబీ ముసల్మాన్, తురకచాకల లేదా తురకసాకల, తురకచాకలి, తుళుక్కవన్నన్, సాకల, సాకల లేదా చాకలస్, ముస్లిం రజక, ఫఖీర్, ఫఖీర్ బుడబుక్కి, ఘంటి ఫకీర్, ఘంటా ఫకీర్లు, తురక బుడబుక్కి, దర్వేష్, ఫకీర్, గారడీ ముస్లిం, గారడీ సాయెబులు, పాములవాళ్లు, కాణి/కట్టువాళ్లు, గారడోళ్లు, గారడిగా, గోసంగి ముస్లిం, ఫకీర్ సాయెబులు, గుడ్డిఎలుగువాళ్లు, ఎలుగుబంటువాళ్లు, ముసల్మాన్ కీలు గుర్రాలవాళ్లు, హజ్జాం, నాయి, నాయి ముస్లిం, నవీద్, లబ్బి, లబ్బై, లబ్బన్, లబ్బా, ఫకీర్ల, బోర్‌వాలే, డీరఫకీర్లు, బొంతల, ఖురేషి, కురేషి/ఖురేషి, ఖసాబ్, మరాఠీ ఖసాబ్, ముస్లిం కటిక, ఖటిక్ ముస్లిం, షేక్/ షైక్, సిద్ది, యాబా, హబ్షి, జాసి, తురకకాశ, కక్కుకొట్టే జింకసాయెబులు, చక్కిటాక్‌నె వాలే, తెరుగాడుగొంతలవారు, తిరుగటిగంట్ల, పత్థర్‌పోడ్లు, చక్కెటకారే, తురకకాశ.