Jump to content

తుహిన్ కాంత పాండే

వికీపీడియా నుండి

తుహిన్ కాంత పాండే (ఆంగ్లం: Tuhin Kanta Pandey) ఒడిశా రాష్ట్రానికి చెందిన 1987 బ్యాచ్‌ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి. భారతదేశ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) చైర్మన్‌గా ఆయన నియమించబడ్డాడు. 2025 మార్చి 1న ఆయన బాధ్యతలు స్వీకరించి మూడేళ్లపాటు ఆ పదవిలో కొనసాగుతాడు.[1] దీనికి ముందు, ఆయన భారత ఆర్థిక కార్యదర్శిగా ఉన్నాడు.[2][3]

కెరీర్

[మార్చు]

తుహిన్ కాంత పాండే చండీగఢ్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థికశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని, యునైటెడ్ కింగ్‌డమ్ నుండి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిష్ట్రేషన్ (ఎంబిఎ) డిగ్రీని పూర్తి చేసాడు. ఆయన ఒడిశా ప్రభుత్వం, భారత ప్రభుత్వం లలో అనేక కీలకమైన విభాగాలలో పనిచేసాడు. ప్రారంభంలో, ఆయన ఒడిషా స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, ఒడిషా స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్‌ లకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్‌ లుగా వ్యవహరించాడు.

మూలాలు

[మార్చు]
  1. "After private sector experiment, finance secretary Tuhin Kanta Pandey named Sebi chief". The Times of India. ISSN 0971-8257. Retrieved 2025-02-28.
  2. "rajiv-kumar-appointed-as-new-finance-secretary". ndtv. Retrieved July 31, 2017.
  3. "in-big-revamp-finance-secy-moved-out-new-home-secy-likely". timesofindia. Retrieved 25 July 2019.