తులసీ దళములచే సంతోషముగా పూజింతు
స్వరూపం
తులసీ దళములచే సంతోషముగా పూజింతు కర్ణాటక సంగీత వాగ్గేయకారుడైన త్యాగరాజ స్వామి వారు రచించిన కీర్తన. ఇది సాధారణంగా మాయామాళవగౌళ రాగము లో పాడబడుతుంది.
సాహిత్యం
[మార్చు]తులసి దలములచే సంతోషముగా పూజింతు
తులసి దలములచే సంతోషముగా పూజింతు
లుమారు చిరకాలము... అ.
పలుమారు చిరకాలము పరమాత్ముని పాదములను
పలుమారు చిరకాలము పరమాత్ముని పాదములను
తులసి దలములచే సంతోషముగా పూజింతు
తులసి దలములచే సంతోషముగా పూజింతు
నరసీరుహ పున్నాగ చంపక పాగాటల కురవక
నరసీరుహ పున్నాగ చంపక పాగాటల కురవక
కరవీర మల్లిక సుగంధరాజ సుమముల్
కరవీర మల్లిక సుగంధరాజ సుమముల్
ధరణివియొక పర్యాయము ధర్మాత్ముని...
ధరణివియొక పర్యాయము ధర్మాత్ముని
సాకేతపుర వాసుని శ్రీరాముని.
సాకేతపుర వాసుని శ్రీరాముని వర త్యాగరాజనుతుని
తులసి దలములచే సంతోషముగా పూజింతు
తులసి దలములచే సంతోషముగా పూజింతు
సంతోషముగా పూజింతు
సంతోషముగా పూజింతు.
ప్రాచుర్యం
[మార్చు]- తులసీ దళములచే కీర్తనను దిగ్గజ కర్ణాటక సంగీత విద్వాంసుల నుంచి ఔత్సాహికుల వరకూ ఎందరో ఎన్నో వేదికల మీద ఆలపిస్తూంటారు.
- ఈ కృతిని గీతగుచ్ఛం(ఆల్బం)లో భాగంగా ఆలపించినవారిలో ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, కె.జె.ఏసుదాసు, హైదరాబాద్ సోదరులు మొదలైనవారు ఉన్నారు.
- ఈ కీర్తనను జేసుదాసు 1988లో విడుదలైన తెలుగు సినిమా రుద్రవీణ కోసం పాడాడు. ఇళయరాజా సంగీతాన్ని అందించాడు.[1]