Jump to content

తురగా (మోచర్ల) జయశ్యామల

వికీపీడియా నుండి
తురగా జయశ్యామల
జననంమోచర్ల జయశ్యామల
కోరుకొల్లు గ్రామం,కలిదిండి మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ India
నివాస ప్రాంతంముంబాయి
ప్రసిద్ధికథా, నవలా రచయిత్రి
మతంహిందూ
భార్య / భర్తతురగా రవీంద్ర
పిల్లలుఅర్చన
తండ్రిమోచర్ల సూర్యప్రకాశరావు
తల్లిరాజలక్ష్మి

తురగా (మోచర్ల) జయశ్యామల ప్రముఖ రచయిత్రి.

విశేషాలు

[మార్చు]

ఈమె కృష్ణా జిల్లా, కలిదిండి మండలం, కోరుకొల్లు గ్రామంలో సూర్యప్రకాశరావు, రాజలక్ష్మి దంపతులకు జన్మించింది. ప్రస్తుతం ముంబాయి నగరంలో నివాసం. ఈమె భర్త తురగా రవీంద్ర ఛార్టర్డ్ అకౌంటెంట్. వీరికి ఒక కుమార్తె ఉంది. జయశ్యామల తన 14వ యేటి నుండి అంటే 1972 నుండి రచనలు చేయడం ప్రారంభించింది. ఈమె దాదాపు 45 నవలలు, 350 కథలు రచించింది. ఈమె రచనలు వివిధ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఈమె రచనలు కొన్ని కన్నడ, మరాఠీ భాషలలోకి అనువదించబడ్డాయి. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం నుండి ఈమె రచనలు కొన్ని ప్రసారమయ్యాయి. కొన్ని రచనలకు బహుమతులు లభించాయి. ఈమెకు బాంబే ఆంధ్ర మహాసభలో శాశ్వత సభ్యత్వం ఉంది. బాంబే ఆంధ్రమహాసభ మహిళాశాఖ కమిటీ మెంబరు నుండి అధ్యక్ష పదవి వరకు వివిధ హోదాలలో సేవలను అంధించింది. ప్రస్తుతం ఈ మహాసభ ఎక్స్ అఫిషియో మెంబర్‌గా ఈమె పనిచేస్తున్నది. ఈమెకు ముంబాయిలో, హైదరాబాదులో పలుసార్లు సన్మానాలు జరిగాయి. ఈమె ఐరోపా, అమెరికా, తూర్పుమధ్య దేశాలను, భారతదేశంలోని అన్ని ప్రాంతాలను విరివిగా సందర్శించింది.

రచనల జాబితా

[మార్చు]
  • మగరాజ్యంలో ఆడే బొమ్మ
  • స్వయంకృతం
  • ముళ్ళతోటలో పూలబాటలు
  • కృష్ణ ప్రేమ
  • కాలమిచ్చిన తీర్పు
  • పూర్ణిమ
  • ఇంద్ర ధనస్సు
  • దేవుడు నవ్వాడు (కథాసంపుటి)
  • శంఖారావం (కథాసంపుటి)
  • కరిగిపోయిన నీలిమేఘం
  • నివేదన
  • ప్రేమాలయం
  • ప్రియబాంధవి
  • సాగర తరంగాలు
  • వెలుగుతీరం
  • ఆశాసౌధాలు

కథలు

[మార్చు]

ఈమె వ్రాసిన కథలలో కొన్ని:

  • అనుబంధం
  • అభిమాని
  • ఇదొక భారతం
  • గుణపాఠం
  • చుక్కలు చూసేవేళ
  • చెదరని స్వప్నం
  • జననీ జన్మభూమి
  • జాతకం
  • డొక్కుపెట్టి
  • తేనెపూలు
  • దరిచేరిన తీరం
  • దేవుడు నవ్వాడు
  • దేవుడూ!నీకు దిక్కెవరు?
  • నడిఏటిలో నావ
  • నా స్మృతి పధంలో
  • నీవునేర్పిన విద్య
  • నేను ఆశావాదినికాలేను
  • నేను చేసింది న్యాయమేనా?
  • పట్టుచీర
  • పావలా కావాలి
  • పొరపాటు
  • బహుమతి
  • భవతీ బిక్షాందేహీ
  • మనస్సాక్షి
  • రక్షా-బంధనం
  • రమ్యస్మృతి
  • శంఖారావం
  • శీనయ్యగారి సైకిలు
  • శుభాహ్వనం
  • స్త్రీ

మూలాలు

[మార్చు]