తుమ్మలపాలెం (ప్రత్తిపాడు)
తుమ్మలపాలెం, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామంలో విద్యా సౌకర్యాలు
[మార్చు]మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల
[మార్చు]ఈ పాఠశాలలో అమలు పరచుచున్న మద్యాహ్న భోజన పథకానికి కావలసిన నాణ్యమైన సన్న బియ్యాన్ని, 2016,జూన్ నెల నుండి, ఈ గ్రామ సర్పంచ్ గుంటుపల్లి రమాదేవి , తన స్వంత నిధులనుండి సరఫరా చేస్తున్నారు. అంతేగాక ప్రతి వారం, పదిరోజులకొకసారి, ఆమె స్వయంగా భోజన సమయంలో పాఠశాలకు వెళ్ళి, మద్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించుచున్నారు. తాను సర్పంచిగా పదవీ విరమణ అనంతరం గూడా ఇదే విధంగా ఈ సేవలు కొనసాగించెదనని చెప్పుచున్నారు.
2016,జూన్‌లో ఈ పాఠశాల విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పుడు, 1వ తరగతి నుండి ఆరవ తరగతి వరకు 40 మంది విద్యార్థులు ఉండేవారు. అప్పుడే ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టి పుస్తకాలు వగైరాలను ఉచితంగా అందించి, అర్హతగల ఉపాధ్యాయిని, ఆయానీ ఏర్పాటుచేసి, వారి జీతాలను గూడా సర్పంచ్ తన స్వంత నిధులనుండి చెల్లించుచున్నారు. 2017,జూన్ నాటికి విద్యార్థుల సంఖ్య 90 కి చేరింది.
గ్రామ పంచాయతీ
[మార్చు]2013, జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో గుంటుపల్లి రమాదేవి ఎన్నికైంది
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం
[మార్చు]ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించెదరు.
గ్రామంలో ప్రధాన పంటలు
[మార్చు]వరి, అపరాలు, కాయగూరలు
గ్రామములోని ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు