తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణ మూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణ మూర్తి తెలుగు రచయిత. విశ్వపతి కలం పేరుతో ప్రసిద్ధులైన ఆయన 25 ఆధ్యాత్మిక పుస్తకాలు రచించారు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరులో బ్రహ్మశ్రీ తమ్మిరాజు లక్ష్మి నరసింహరావు, నాగ రత్నాంబ దంపతులకు 1956లో జన్మించారు. విద్యాబ్యాసం నాగార్జునసాగర్, హైదరాబాద్, వరంగల్లో జరిగింది. 1983 లో వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజి నుండి ఎం.టెక్ చదివి 1988 దాకా ఆల్విన్ కంపెనీలోను, తరువాత 1998 వరకు మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేసారు. విశ్వపతి 1984 నుంచి 1990 వరకు ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌లో కార్టూన్‌లు వేశారు. 1998 నుంచి లోగో డిజైన్‌ రంగంలో ఉన్నఆయన ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా ఆరువేలకు పైగా కంపెనీలకు లోగోలు డిజైన్‌ చేశారు. ఆయన రాసిన ఆధ్యాత్మిక పుస్తకాలనుప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది చదువుతున్నారు. 2005లో ఆయన రాసిన వేంకటేశ్వర వ్రతకల్పం ఫ్రెంచ్‌, ఇటాలియన్‌సహా పన్నెండు భాషల్లో అనువాదం అయ్యింది. [1] తరువాత వేద శాస్త్రాల ఆధారంగా కంపెనీల, పేర్లు సూచించటం, లోగోలు డిజైను చేయటం ఈయన ప్రత్యకత .తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణ మూర్తి శ్రీ వేంకటేశ్వరస్వామిపై రచించిన 10 పుస్తకాలను అమెరికాలోని ప్రతిష్ఠాత్మక హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం లైబ్రరీలో ఉంచారు. శ్రీవేంకటేశ్వర స్వామి వారిపై ఈ స్థాయిలో తెలుగు పుస్తకాలను ఈ లైబ్రరీలో ఉంచడం ఇదే ప్రథమం. విశ్వపతి కలం పేరుతో ప్రసిద్ధులైన టీవీఆర్‌కే మూర్తి 25 ఆధ్యాత్మిక పుస్తకాలు రచించారు. వీటిలో 15 పుస్తకాలు శ్రీనివాసునిపైనే కావడం విశేషం[2].

మూలాలు

[మార్చు]