తిప్పరా మీసం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిప్పరా మీసం
తిప్పరా మీసం సినిమా పోస్టర్
దర్శకత్వంకృష్ణ విజయ్
రచనకృష్ణ విజయ్
నిర్మాతరిజ్వాన్
తారాగణంశ్రీ విష్ణు, నిక్కి తాంబోలి, రోహిణి
ఛాయాగ్రహణంసిద్
కూర్పుధర్మేంద్ర కాకరాల
సంగీతంసురేష్ బొబ్బిలి
నిర్మాణ
సంస్థలు
రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్
కృష్ణ విజయ ఎల్ ప్రొడక్షన్స్
పంపిణీదార్లుశ్రీ ఓం సినిమా
విడుదల తేదీ
8 నవంబరు 2019 (2019-11-08)
సినిమా నిడివి
152 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

తిప్పరా మీసం 2019, నవంబరు 8న విడుదలైన తెలుగు చలనచిత్రం. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కృష్ణ విజయ ఎల్ ప్రొడక్షన్స్ పతాకాలపై రిజ్వాన్ నిర్మాణ సారథ్యంలో కృష్ణ విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు, నిక్కి తాంబోలి, రోహిణి తదితరులు నటించగా, సురేష్ బొబ్బిలి సంగీతం అందించాడు.[1][2]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • రచన, దర్శకత్వం: కృష్ణ విజయ్
  • నిర్మాత: రిజ్వాన్
  • సంగీతం: సురేష్ బొబ్బిలి
  • ఛాయాగ్రహణం: సిద్
  • కూర్పు: ధర్మేంద్ర కాకరాల
  • నిర్మాణ సంస్థ: రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కృష్ణ విజయ ఎల్ ప్రొడక్షన్స్
  • పంపిణీదారు: శ్రీ ఓం సినిమా

నిర్మాణం

[మార్చు]

ఈ చిత్రంలో శ్రీవిష్ణు మీసాలు, గడ్డం పెంచుకుని డీజే పాత్రను పోషించాడు. అతని పాత్ర నెగిటీవ్ షేడ్ లో ఉంటుంది.[3] ఈ చిత్రానికి కృష్ణ విజయ్ దర్శకత్వం వహించగా నిక్కి తంబోలి, రోహిణి తదితరులు నటించారు. సహాయ పాత్రలో నటించడానికి నేహా దేశ్‌పాండే సంతకం చేసింది.[4] సెప్టెంబరులో ఈ చిత్ర టీజర్ విడుదలైంది.[5] కృష్ణ విజయ్ గతంలో శ్రీవిష్ణుతో కలిసి అసుర (2015) సినిమాకు పనిచేశాడు.[6] ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఫిబ్రవరిలో విడుదలై, వేసవిలో విడుదల కావాల్సి ఉంది.[4][7]

శ్రీవిష్ణు నటించిన బ్రోచెవరేవరురా (2019) సినిమా విడుదలై విజయవంతమైనప్పటి నుండి ఈ చిత్రం ప్రజాదరణ పొందింది.[2] తిప్పారా మీసం సినిమాను రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కృష్ణ విజయ్ ఎల్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి.[2] ఈ చిత్ర ట్రైలర్ నవంబరు 6న విడుదలైంది. ఈ చిత్రానికి థియేట్రికల్ హక్కులను ఆసియా సినిమాస్ కొనుగోలు చేసింది.[8]

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించాడు. మొదటి పాట "ధేత్తడి పోచమ్మగుడి" సెప్టెంబరులో, రెండవ పాట "మౌన హృదయ రాగం" అక్టోబరులో విడుదలయ్యాయి.[9][10][11][12]

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."దేత్తడి పోచమ్మ గుడి (రచన: పూర్ణాచారి)"పూర్ణాచారిసురేష్ బొబ్బిలి, నరేష్ మామిండ్ల3:27
2."మౌన హృదయ రాగమే (రచన: పూర్ణాచారి)"పూర్ణాచారిరంజని4:05
3."రాధ రమణం (రచన: పూర్ణాచారి)"పూర్ణాచారిఅనురాగ్ కులకర్ణి, నూతన మోహన్3:53
4."తిప్పరా మీసం (రచన: పూర్ణాచారి)"పూర్ణాచారిహేమచంద్ర, క్రాంతి సంజయ్3:23
5."ట్రాన్స్ పాట (రచన: అల రాజు)"అల రాజునరేష్ మామిండ్ల, రోహిత్, నందన్ రాజ్3:08
మొత్తం నిడివి:17:46

విడుదల

[మార్చు]

టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఈ చిత్రానికి 2/5 రేటింగ్ ఇచ్చింది.[13] "శ్రీ విష్ణు, రోహిణి తల్లి కొడుకులుగా బంధాల విలువను చూపించారు" అని ది హిందూ పత్రికలో రాశారు.[14]

మూలాలు

[మార్చు]
  1. "Sree Vishnu's 'Thipparaa Meesam' has a release date - Times of India". The Times of India.
  2. 2.0 2.1 2.2 "Sree Vishnu's 'Thipparaa Meesam' to release on November 8". Telangana Today.
  3. "I play the role of a DJ who is careless and bad: Sree Vishnu - Times of India". The Times of India.
  4. 4.0 4.1 Kavirayani, Suresh (February 7, 2019). "Sree Vishnu's Thipparaa Meesam's first look". Deccan Chronicle.
  5. "'Thipparaa Meesam' teaser gets attention from film buffs - Times of India". The Times of India.
  6. Pecheti, Prakash. "Thippara Meesam to change Sree Vishnu's career graph". Telangana Today.
  7. "Vibrant first look of Sree Vishnu from 'Thipparaa Meesam' is here! - Times of India". The Times of India.
  8. "Thipparaa Meesam Trailer: Badass Sree Vishnu steals the show in this unconventional action drama - Times of India". The Times of India.
  9. "Mouna Hrudaya Ragam is a comforting resonance from Thipparaa Meesam - Times of India". The Times of India.
  10. "Dhethadi Pochammagudi: A mass number from Sree Vishnu's Thipparaa Meesam - Times of India". The Times of India.
  11. "Thipparaa Meesam - Suresh Bobbili - Download or Listen Free - JioSaavn". JioSaavn.
  12. "Thipparaa Meesam Jukebox - Sree Vishnu - Suresh bobbili - Krishna Vijay L". Lahari Music. 7 November 2019.
  13. "Thipparaa Meesam Movie Review {2/5}: Goes off the rails hard and fast!". The Times of India.
  14. Dundoo, Sangeetha Devi (November 8, 2019). "'Thippara Meesam' review: An interesting story let down by a meandering narrative". The Hindu.

బాహ్య లింకులు

[మార్చు]