Jump to content

తిప్పన విజయ సింహారెడ్డి

వికీపీడియా నుండి
తిప్పన విజయ సింహారెడ్డి
తిప్పన విజయ సింహారెడ్డి


తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌
పదవీ కాలం
2022 నవంబరు 30 - డిసెంబర్ 2023
తరువాత కాసుల బాల్‌రాజ్
నియోజకవర్గం మిర్యాలగూడ

మాజీ ఎమ్మెల్యే
పదవీ కాలం
1989 - 1994
తరువాత జూలకంటి రంగారెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం 1948
మిర్యాలగూడ నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం , భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు తిప్పన చిన కృష్ణారెడ్డి[1]
సంతానం తిప్పన కీర్తి నందన్ రెడ్డి
నివాసం మిర్యాలగూడ

తిప్పన విజయ సింహారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మిర్యాలగూడ నియోజకవర్గం నుండి 1989లో ఎమ్మెల్యేగా గెలిచాడు.[2][3] తిప్పన విజయ సింహారెడ్డి  2022 నవంబరు 30న తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమితుడయ్యాడు.[4]

తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమితుడైన తరువాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిసిన తిప్పన విజయ సింహారెడ్డి

జననం, విద్యాభాస్యం

[మార్చు]

తిప్పన విజయ సింహారెడ్డి 1948లో తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, మిర్యాలగూడ లో జన్మించాడు. ఆయన తండ్రి తిప్పన చిన కృష్ణారెడ్డి మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే. విజయ సింహారెడ్డి ఇంటర్మీడియట్ వరకు నల్గొండలో చదివి, హైదరాబాద్ సిటీ కాలేజ్ లో 1972లో బీఎస్సీ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

తిప్పన విజయ సింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1989లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సీపీఎం అభ్యర్థి ఎ.లక్ష్మీనారాయణరెడ్డి పై 5453 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీ లోకి అడుగు పెట్టాడు. ఆయన 1994లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి సీపీఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి చేతిలో 20093 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు.

తిప్పన విజయ సింహారెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆయన 2012 - 2015 వరకు మిర్యాలగూడ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా పని చేశాడు. 2019లో టీఆర్‌ఎస్‌ తరపున మిర్యాలగూడ జెడ్పీటీసీగా గెలిచిన ఆయనను 2022 నవంబరు 30న తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమిస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశాడు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (10 November 2023). "తండ్రీ కొడుకులు ఎమ్మెల్యేలు." Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023.
  2. Sakshi (30 November 2018). "వారసులకు.. నో చాన్స్‌!". Archived from the original on 27 జూలై 2021. Retrieved 27 July 2021.
  3. Andhrabhoomi (5 November 2018). "రెండు పార్టీల గూడు మిర్యాలగూడ!". andhrabhoomi.net. Archived from the original on 27 జూలై 2021. Retrieved 27 July 2021.
  4. Namasthe Telangana (1 December 2022). "ఆగ్రో ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌గా తిప్పన విజయసింహారెడ్డి". Archived from the original on 1 December 2022. Retrieved 1 December 2022.
  5. Andhra Jyothy (1 December 2022). "తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్‌ అభివృద్ధి చైర్మన్‌గా తిప్పన". Archived from the original on 1 December 2022. Retrieved 1 December 2022.
  6. Eenadu (3 November 2023). "ఎమ్మెల్యే నుంచి జడ్పీటీసీ సభ్యుడిగా." Archived from the original on 3 November 2023. Retrieved 3 November 2023.