తిప్పడంపల్లి కోట
తిప్పడంపల్లి కోట, ఆత్మకూరు సంస్థానానికి తిప్పడంపల్లి రాజధానిగా ఉండేది. ఆత్మకూరు సంస్థానానికి ‘అమరచింత’ సంస్థానం అనే పేరు కూడా ఉంది. ఈ సంస్థానానికి తూర్పున వనపర్తి సంస్థానం, పడమరన రాయచూరు, ఉత్తరాన నిజాం సరిహద్దులు, దక్షిణాన గద్వాల సంస్థానాలు ఉండేవి. 190 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో 70 గ్రామాలు ఉండేవి.రెడ్డిరాజులు ఈ సంస్థానాన్ని పరిపాలించారు. చంద్రగిరికి చెందిన గోపాల్‌రెడ్డికి కాకతీయ సామంత రాజులతో ఏర్పడిన పరిచయం కారణంగా సా.శ.1268లో వడ్డేమాన్‌కు మగతల నాగగౌడ పదవితో ఇచ్చి సంస్థాన బాధ్యతలను అప్పగించారు.అమరచింత ఈ సంస్థాన మూల పురుషుడు గోపాల్‌రెడ్డే అని చరిత్రకారులు పేర్కొంటున్నారు.సా.శ.1268లో గోపాల్‌రెడ్డితో ప్రారంభమైన ఆత్మకూరు ప్రస్థానం 1948లో సంస్థానం విలీనం అయ్యేవరకూ కొనసాగింది.ఈ సంస్థానానికి చివరిగా రాజా శ్రీరామభూపాల్ బాధ్యతలు వహించారు.[1] తిప్పడంపల్లి రాజధానిగా చేసుకుని రాజా పెదవెంకటరెడ్డి, బాలకృష్ణారెడ్డి, సీతారామభూపాలుడు,శ్రీరాంభూపాలుడు,రాణి భాగ్యలక్ష్మమ్మ వరకు ఈ ఐదుగురు పరిపాలన సాగించారు.అయితే తిప్పుడంపల్లి నుండి ఆత్మకూరుకు రాజధాని మారింది.ఇక్కడ కోట నిర్మించిన తరువాత ఆత్మకూరుకు ఎందుకు మార్చవలసివచ్చిందో కారణాలు ఇతమిద్దంగా తెలియవు. సంస్థానానికి చివరి పాలకురాలు రాణి భాగ్యలక్ష్మమ్మ.[2]
శిధిలస్థితి
[మార్చు]ఆత్మకూరు సంస్థానం నేడు శిథిలావస్థకు చేరుకుంది. కోట లోపలి భాగంలో ఎలాంటి రాజ భవనాలూ లేవు. ప్రస్తుతం ప్రాథమిక, ఉన్నత పాఠశాల భవనాలు కోట లోపల ఉన్న ఖాళీ స్థలంలో నిర్మించారు.
ఇంకా చదవండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Blog, My (2012-08-30). "జై తెలంగాణ... : తిపుడంపల్లి కోట". జై తెలంగాణ... Retrieved 2020-01-30.
- ↑ molakanews.page/article/అమరచింతాత్మకూరు_సంస్థానం---రాజధానులు-------సేకరణ-::-తంగెళ్ళశ్రీదేవిరెడ్డి-తెలంగాణ-ప్రాంతంలో-నిజాం-కా/siXUUO.html