తాపేశ్వరం కాజా
తెలుగు రాష్ట్రాల్లోనే కాక భారతదేశం అన్ని ప్రాంతాల్లో లభ్యమయ్యే మిఠాయిలు కాజాలు. అలాంటి ఈ కాజాలకు పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరం గ్రామం.
ఈ మిఠాయి తయారీ విశిష్టత కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల మన్ననలు పొంది, తాపేశ్వరం కాజాగా ప్రసిద్ధి చెందింది.

తాపేశ్వరం కాజా ప్రారంభ చరిత్ర
[మార్చు]తాపేశ్వరం గ్రామానికి చెందిన పోలిశెట్టి సత్తిరాజు ఎంతో కృషితో మడత కాజాను రూపొందించారు. పొరలు పొరలుగా వుండే మడత కాజాలో పోరా పొరలో పాకంతో , దాని కమ్మదనం, రుచి కారణంగా కొద్దికాలంలోనే కాజా ప్రజాభిమానం పొందింది. క్రమేణా తాపేశ్వరంకాజాగా ప్రశస్తమైంది.
శుభకార్యాలలో తాపేశ్వరం కాజా చోటు చేసుకుంది. 50 గ్రాముల నుంచి 500 గ్రాములు వరకు బరువుండే విధంగా రకరకాల సైజులలో వీటిని తయారు చేస్తారు. 1990లో సత్తిరాజు మరణించాక ఆయన వారసులు ఈ వ్యాపారాన్ని ఆధునిక పద్ధతుల్లో నిర్వహించడం మొదలుపెట్టారు. కాజా తయారిలో యంత్రాలను ప్రవేశపెట్టి, కాజాల తయారీని సులభతరం, రుచికరం, వేగవంతం చేశారు.

తాపేశ్వరం నుంచి కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు మొదలైన రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి.
కాజా అంటే నోరూరని వారుండరు. అందరికీ అందుబాటు ధరలలో ఏ చిన్న షాపులోనైనా దొరికే మంచి మిఠాయిలు ఈ కాజాలు.
కాజా తయారీ
[మార్చు]మడత కాజా తయారీ విధానంలో ప్రధానంగా వాడేది మైదాపిండి, నెయ్యిలోనూ, రిఫైండ్ ఆయిల్ లోనూ రెండు రకాలు చేస్తారు. కొంచెం నూనె పోసి నానబెట్టిన పిండి పలుచగా సాగదీసి, పొడవుగా కోసి దాన్ని కాజా ఆకారంలో చుట్టుకువెళతారు. 10 నుండి 12 నిముషాల్లో ఒక కాజా తయారవుతుంది. పాకంలో 3 నిముషాలు ఉంచుతారు. పొరల లోపలి పాకం బయటికి జారిపోకుండా చివర్లో గట్టి పాకంలో ముంచి తీస్తారు.
భక్తాంజనేయ స్వీట్స్, సురుచి పుడ్స్ ప్రస్థానం
[మార్చు]1931 లో చిన్న హొటల్ గా మొదలైంది. పోలిశెట్టి సత్తిరాజు అనే ఆయన భక్తాంజనేయ హొటల్ అని పేరుతో ఒక చిన్నపాటి నడుపుతూ ఉండేవారట. పల్లెల హొటళ్లలో అల్పాహరాలతోపాటు ఆవడ పాయసం, గులాబ్ జాం వంటివి కౌంటర్ టెబుళ్ళ మీద పెడుతుంటారు. అలాగే అల్పాహారాలతో పాటు కాజా చేసి దాంతో పాటు కొన్ని స్వీట్స్ పెట్టి అమ్ముతుంటే జనాలకు బాగా నచ్చి అమ్మకం పెరిగిందట...
హోటల్ బిజినెస్ కంటే స్వీట్స్ అమ్మకం పెరిగాక హొటల్ కాస్తా భక్తాంజనేయ స్వీట్స్ గా మారిపోయింది. సత్తిరాజు గారు కాజా తయారీలో మెలకువలు చూపుతూ రుచికరంగా తయారుచేస్తుంటే అమ్మకాలూ పెరిగాయి, షాపూ పెరిగింది.
పోలిసెట్టి సత్తిరాజు గారి కుమారుడు పోలిశెట్టి మల్లిబాబు వచ్చాక మరిన్ని హంగులతో షాపు పెద్దదైంది. వర్కర్స్ పెరిగారు. కాజా తయారీలో యంత్రాలు రంగప్రవెశం చేసాయి. కాకినాడ, రాజమహేంద్రవరంలలో బ్రాంచీలు వెలిశాయి.
1991లో భక్తాంజనేయ స్వీట్స్ పేరు ను 'భక్తాంజనేయ వారి సురుచి పుడ్స్' అని మార్పుచేశారు. అక్కడి నుండి ఆయన చేసిన కృషి వలన తాపేశ్వరం కాజాకు విశేషమైన ఖ్యాతి వచ్చింది. ' సురుచి' క్వాలిటీకి సంబంధించి అనేక అవార్డులు, రివార్డులు పొందింది. అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాల సంస్థ నుండి ISO 9001 - 2008, ISO 2000 సర్టిఫికేషన్స్ దక్కాయి.
రికార్డులు, పురస్కారాలు
[మార్చు]30 టన్నుల మహా లడ్డూతో ప్రపంచంలోనే అతి పెద్ద లడ్డూ తయరీదారులుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సంపాదించారు. అంతర్జాతీయ స్థాయిలో నాణ్యతా ప్రమాణాలు పాటించే సంస్థలకు ISO సర్టిఫికేషన్ ను అందించే HYM International certifications సంస్థ దక్షిణ భారతదేశ స్థాయిలో ఫుడ్ ప్రొడక్ట్స్ రంగానికి సంబంధించి సురుచి కి మూడుసార్లు HYM క్వాలిటీ అవార్డునిచ్చింది.
ఇతర విశేషాలు
[మార్చు]- సత్తిరాజు గారి జీవిత ప్రస్థానం 'కాజా కథ' అనే పేరుతో అని పుస్తకంగా ప్రచురించబడింది.
- ఇక్కడ కాజాలు పలు రకాల సైజులలో లభ్యమౌతాయి. చిట్టి కాజాల దగ్గర నుండి సుమారు ఐదు కేజీల వరకూ బరువుండే బాహుబలి కాజాల వరకూ లభ్యమౌతాయి.
- కాజాతోపాటు, ఇతర పిండి వంటకాలైన అరిసెలు, సున్నుండలు, పూతరేకులు, బొబ్బట్లు, బూందీలడ్డూలు, కజ్జికాయలు, మైసూర్ పాక్, పొంగడాలు, గోరుమిఠాయిలు, పంచదారచిలకలను కూడా తాపేశ్వరంలో తయారుచేస్తారు.
చిత్రాలు
[మార్చు]-
madata kaja, Tapeswaram kaja
-
madata kaja, Tapeswaram kaja making
-
madata kaja, Tapeswaram kaja
-
madata kaja, Tapeswaram kaja
-
madata kaja, Tapeswaram kaja
-
madata kaja, Tapeswaram kaja
-
Andhra Sweets]]
-
madata kaja, Tapeswaram kaja sweet shap
-
madata kaja, Tapeswaram kaja sweet shap