Jump to content

తాటికొండ వెంకటరాజయ్య

వికీపీడియా నుండి
తాటికొండ వెంకటరాజయ్య
తాటికొండ వెంకటరాజయ్య

ప్రొఫెసర్‌ తాటికొండ వెంకటరాజయ్య


వ్యక్తిగత వివరాలు

జననం (1957-02-20) 1957 ఫిబ్రవరి 20 (వయసు 67)
అంకుశాపురం గ్రామం
తరిగొప్పుల మండలం
జనగామ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పార్టీ సమాజ్‌వాదీ పార్టీ
నివాసం డీడీ కాలనీ, బాగ్ అంబర్‌పేట్
హైదరాబాద్
మతం హిందూ

తాటికొండ వెంకటరాజయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్‌, యోగ శిక్షకుడు,[1] సాహితీవేత్త‌, రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర ముఖ్య అథికార ప్రతినిధిగా ఉన్నాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

తాటికొండ వెంకటరాజయ్య తెలంగాణ, జనగామ జిల్లా, తరిగొప్పుల మండలం, అంకుశాపురం గ్రామంలో 1957, ఫిబ్రవరి 20న తాటికొండ మల్లయ్య, యశోద దంపతులకు జన్మించాడు. ఆయన ఒకటి నుండి ఐదవ తరగతి వరకు అంకుశాపురంలో, ఆరు నుండి పదవ తరగతి వరకు జిల్లా పరిషత్ పాఠశాలో చదివాడు. వెంకటరాజయ్య హైదరాబాదు సిటీ కాలేజీలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసి, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ లో ఎం.ఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్ లో పీజీ పూర్తి చేశాడు. ఆయన 2017లో ఉస్మానియా యూనివర్సిటీ నుండి పి.హెచ్.డి పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

వెంకటరాజయ్యలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ శాసనసభ నియోజకవర్గం నుండి సమాజ్‌వాదీ పార్టీ తరపున పోటీ చేశాడు.[2] ఆయన 2020లో ఉమ్మడి నల్గొండ, వరంగల్‌, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేశాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (1 August 2019). "యోగా ఆసనాలు నేర్పిస్తున్న ఆచార్య వెంకటరాజయ్య". betagallery.eenadu.net. Archived from the original on 24 May 2021. Retrieved 24 May 2021.
  2. Sakshi (21 November 2018). "'సైకిల్‌' కోసం న్యాయ పోరాటం!". Sakshi. Archived from the original on 24 May 2021. Retrieved 24 May 2021.
  3. Nava Telangana (20 March 2020). "ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా చిట్యాల రాములు, తాటికొండ వెంకటరాజయ్య". Retrieved 24 May 2021.
  4. Andhrajyothy (24 May 2021). "కరీంనగర్‌ బరిలో 18 మంది". m.andhrajyothy.com. Archived from the original on 24 May 2021. Retrieved 24 May 2021.