Jump to content

తరుణ్ తేజ్‌పాల్

వికీపీడియా నుండి
తరుణ్ తేజ్‌పాల్
2007 లో జెనీవాలో లా ఫ్యూరూర్ డి లైర్‌లో తేజ్‌పాల్
జననం
తరుణ్ తేజ్‌పాల్

(1963-03-15) 1963 మార్చి 15 (వయసు 61)
జలంధర్
జాతీయతభారతీయుడు
వృత్తిపాత్రికేయుడు
నేరారోపణ(లు)లైంగిక దుశ్చర్య[1]
Criminal statusబెయిలుపై ఉన్నాడు

తరుణ్ తేజ్‌పాల్ భారతీయ పాత్రికేయుడు, ప్రచురణకర్త, నవలా రచయిత. తెహెల్కా పత్రికకు మాజీ ఎడిటర్ ఇన్ ఛీఫ్ కూడా. ఒక మహిళా ఉద్యోగిపై లైంగిక దాడి చేసాడన్న ఆరోపణల కారణంగా 2013 నవంబరు 30న అరెస్టై 2014 జూలై 1 నుండి బెయిలుపై ఉన్నాడు.[1][2]

వ్యక్తిగతం

[మార్చు]

తేజ్‌పాల్ తండ్రి భారత సైన్యంలో పనిచేసాడు. అందువల్ల అతను దేశంలోని అనేక ప్రాంతాల్లో పెరిగాడు. అతను చండీగఢ్ లోని పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి అర్థశాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. [3] [4] 1985 లో గీతన్ బాత్రాను వివాహం చేసుకున్నాడు. [5] వారికి ఇద్దరు కుమార్తెలు - టియా, కారా - ఉన్నారు.

వృత్తి జీవితం

[మార్చు]

1980 వ దశకంలో అతను ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో తన పాత్రికేయ వృత్తిని ప్రారంభించాడు. తరువాత న్యూ ఢిల్లీకి వెళ్లి, "ఇండియా 2000" అనే పత్రికలో (తరువాతి కాలంలో అది మూతపడింది) చేరాడు. 1984 లో అతను ఇండియా టుడే మ్యాగజైన్‌లో, తరువాత 1994 లో ది ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌లో చేరాడు. తరువాత భారతదేశపు రెండవ అతిపెద్ద న్యూస్‌ మాగజైన్ ప్రచురణ అవుట్‌లుక్‌కు వ్యవస్థాపక సంపాదకుడు అయ్యాడు. ఇంతలో, అతను "ఇండియా ఇంక్" అనే ప్రచురణ సంస్థను స్థాపించాడు. ఇది, బుకర్ ప్రైజ్ గెలుచుకున్న అరుంధతి రాయ్ నవల ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ను 1998 లో ప్రచురించింది. [6] [7]

తెహెల్కా

[మార్చు]

2000 ఫిబ్రవరి లో, తరుణ్ తేజ్‌పాల్ భారతదేశపు మొదటి జర్నలిస్టిక్ వెబ్‌సైట్ తెహెల్కాను స్థాపించారు. తెహెల్కా యొక్క ప్రాథమికంగా సంపాదకీయ ప్రేరితమైనదే గాని, వాణిజ్య ప్రేరితం కాదని తేజ్‌పాల్ అనేక మీడియా ఇంటర్వ్యూలలో ప్రకటించాడు. 1980 లలో దూకుడుగా ఉన్న ప్రజా ప్రయోజన పాత్రికేయం 1990 లలో ఫ్యాషన్, ఆహారం, సినిమా వంటి ఉత్సాహభరిత విషయాలలోకి దారి మళ్ళిపోయిందని దాన్ని తిరిగి 1980 ల నాటి దారిలోకి తీసుకురావాలనేది తమ లక్ష్యమని ప్రకటించాడు. "తెహెల్కా.కామ్" 2000 లో భారత-దక్షిణాఫ్రికా క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్‌పై మొదటి స్టింగ్ ఆపరేషన్ చేసింది. [8] బట్టబయలు చెయ్యడంపై ఫాలెన్ హీరోస్ [9] అనే పుస్తకాన్ని ప్రచురించాడు.

తెహెల్కా పోర్టల్ రక్షణ శాఖ కొనుగోళ్ళకు సంబంధించి చేసిన ఆపరేషన్ వెస్ట్ ఎండ్ అనే స్టింగ్ పరిశోధనలకు ప్రసిద్ధి గాంచింది. [10] [11] 2004 లో, "తెహెల్కా.కామ్" ఆన్‌లైన్ పోర్టల్ నుండి ప్రింట్ మీడియాకు మారిపోయింది. ముందు, తెహెల్కా జాతీయ వారపత్రికగా టాబ్లాయిడ్ ఆకృతిలో మొదలై, 2007 జనవరిలో వారపత్రికగా మారింది. [8] తెహెల్కా ప్రచురించిన మైలురాయి కథనాల్లో గుజరాత్ హత్యలు, డాక్టర్ బినాయక్ సేన్, ఈశాన్యంలో పోలీసులు ఎన్‌కౌంటర్లు, బొగ్గు, 2 జి మోసాలు, ఇష్రత్ జహాన్, తులసి ప్రజాపతి హత్యలు, మితవాద సమూహాల ద్వారా అల్లర్లను నిర్వహించడం, జహీరా షేక్ (బెస్ట్ బేకరీ దురంతానికి సాక్షి) ; భారతదేశంలోని అణగారిన, వెనుకబడిన వర్గాలపై - దళితులు, గిరిజనులు, ముస్లింలు, ఇతర మైనారిటీలు, అభివృద్ధి కార్యక్రమాల బాధితులపై - మొదలైనవి ముఖ్యమైనవి. తెహెల్కా విలేకరులు, రచయితలు ప్రతి జర్నలిస్టిక్ అవార్డును గెలుచుకున్నారు - మూడేళ్ళపాటు గెలుచుకున్న చమేలి దేవి జైన్ [12] ఉత్తమ జాతీయ మహిళా పాత్రికేయ పురస్కారం కూడా వీటిలో ఉంది. ఉత్తమ జర్నలిజానికి రెండు ఐపిఐ (ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్స్టిట్యూట్) అవార్డులతో పాటు సంస్కృతి జర్నలిజం అవార్డు [13], లింగ సమానత్వం కోసం దక్షిణ ఆసియా లాడ్లీ మీడియా & అడ్వర్టైజింగ్ అవార్డులు కూడా ఇందులో ఉన్నాయి.

వివాదాలు

[మార్చు]

"తెహెల్కా" యాజమాన్య సంస్థ యాజమాన్యానికి రాజకీయ, వ్యాపార సంస్థలలో వాటాలను కలిగి ఉన్నందున పరస్పర వ్యతిరేక ఆసక్తుల ఆరోపణలు వచ్చాయి. తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెడి సింగ్‌కు హోల్డింగ్ కంపెనీలో కొంత వాటా ఉంది. అలాగే "అనంత్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్"కు ఖూడా ఉంది. ఈ అనంత్ మీడియాలో మెజారిటీ వాటా ఉన్న "ఆల్కెమిస్ట్ గ్రూప్" పై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ వారి దర్యాప్తు జరుగుతోంది. [14] [15]

2013 నవంబరు లో, థింక్ ఇన్ గోవా సమావేశంలో తేజ్‌పాల్ తనపై లైంగిక వేధింపులు చేసాడని ఒక విలేకరి ఆరోపణలు చేసింది. అతని రాజకీయ విరోధులు ఆరోపణలు చేసి అతన్ని అరెస్టు చేయడానికి ఉధృతంగా ప్రచారం చేసారు. అతను తన "దుష్ప్రవర్తన"ను ఒప్పుకున్నాడు. తెహెల్కా నుండి ఆరు నెలల సెలవు తీసుకున్నాడు. [16] కేసు ఇంకా జరుగుతూనే ఉంది. [17] భారతదేశంలో లైంగిక హింస సమస్యను హైలైట్ చేయడంలో తేజ్‌పాల్, అతని పత్రికా గతంలో పనిచేసినందున ఇది ప్రజల దృష్టిని ఆకర్షించింది, మీడియా పర్యవేక్షణలోనూ ఉంది. [18] ఆ సంవత్సరం ఫిబ్రవరిలో తెహెల్కా పత్రిక ఈ అంశంపై ప్రత్యేక సంచిక కూడా వెలువరించింది. [19] ఈ సంఘటన జరిగిన గోవా రాష్ట్రంలో పోలీసులు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) ను దాఖలు చేశారు. అతనిపై గోవా పోలీసులు నాన్-బెయిలబుల్ వారెంటు జారీ చేశారు. పర్యవసానంగా, అతన్ని 2013 నవంబరు 30 న గోవా పోలీసులు అరెస్టు చేశారు. 2014 జూలై 1 న, సుప్రీంకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. అతని పాస్‌పోర్టును కోర్టుకు సమర్పించాలని చెప్పింది. [20]

ఈ కేసు విచారణ 2017 సెప్టెంబరులో ప్రారంభమైంది. ఆరోపణలను రద్దు చేయాలని తేజ్‌పాల్ సుప్రీంకోర్టుకు చేసిన విజ్ఞప్తి వలన ఇది కాస్త ఆలస్యమైంది. 2019 ఆగస్టులో ఆయన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. కేసును తిరిగి దిగువ కోర్టుకు పంపి, విచారణ ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. [21]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Tarun Tejpal's judicial remand extended by 14 days". Dnaindia. 10 February 2014. Retrieved 19 May 2014.
  2. "Tarun Tejpal accused of rape, gets bail from SC". Patrika Group (in Hindi). Archived from the original on 14 జూలై 2014. Retrieved 1 July 2014.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  3. [dead link]
  4. Mehul Srivastava; Nandini Lakshman. "India's 50 Most Powerful People 2009". Businessweek. Archived from the original on 21 నవంబరు 2013. Retrieved 24 November 2013.
  5. Tehelka Scandal: All you wanted to know about Tarun Tejpal and his businesses, DNA, 24 Jun 2014.
  6. [dead link]
  7. Ravi Shankar. "For once Tejpal's words failed him". Live Mint. Archived from the original on 27 నవంబరు 2013. Retrieved 24 November 2013.
  8. 8.0 8.1 Here's all you need to know about Tehelka's former founder-editor Tarun Tejpal, DNA, 5 July 2014.
  9. https://www.indiatoday.in/magazine/society-the-arts/books/story/20001016-book-review-fallen-heroes-the-story-that-shook-the-nation-by-tehelka.com-778251-2000-10-16
  10. "Who's Who @ Tehelka". Tehelka website. Archived from the original on 2012-09-02. Retrieved 2020-07-03.
  11. "Tarun Tejpal". Businessweek. 1 July 2001. Retrieved 24 November 2013.
  12. https://www.business-standard.com/article/economy-policy/tushita-mittal-of-tehelka-gets-chameli-devi-jain-award-112031000027_1.html
  13. https://www.hindustantimes.com/delhi/sanskriti-awards-for-2011-conferred/story-aWcb2HGuUNWqpCKSTIdLWL.html
  14. Here's all you need to know about Tehelka's former founder-editor Tarun Tejpal, DNA, 5 July 2014.
  15. Tehelka Scandal: All you wanted to know about Tarun Tejpal and his businesses, DNA, 24 Jun 2014.
  16. https://www.news.com.au/world/tehelka-editors-six-months-time-off-penance-offer-for-assaulting-woman/news-story/4cdbc637f324a8a128a6df800a0622b7
  17. "Tarun Tejpal, Tehelka Editor, Faces Sexual Assault Allegations". New Delhi: Huffingtonpost. 22 November 2013. Retrieved 24 November 2013.
  18. Ellen Barry (22 November 2013). "Editor in India, Known for Investigations into Corruption, Is Accused of Rape". The New York Times. Retrieved 24 November 2013.
  19. Tunku Varadarajan (25 November 2013). "The Fall of India's Conscience". The Daily Beast. Retrieved 26 November 2013.
  20. "Tarun Tejpal accused of rape, gets bail from SC". Patrika Group (in Hindi). Archived from the original on 14 జూలై 2014. Retrieved 1 July 2014.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  21. "Tarun Tejpal trial: HC defers cross-examination of victim till February". New Indian Express. IANS. January 8, 2020. Retrieved April 18, 2020.