Jump to content

తరుణి సచ్‌దేవ్

వికీపీడియా నుండి
తరుణి సచ్ దేవ్
జననం(1998-05-14)1998 మే 14
ముంబై, మహారాష్ట్ర
మరణం2012 మే 14(2012-05-14) (వయసు 14)
జామ్ సామ్ నేపాల్
మరణ కారణంవిమాన ప్రమాదం
వృత్తిబాలనటి
క్రియాశీలక సంవత్సరాలు2004–2012

తరుణి సచ్‌దేవ్ ( 1998 మే 14 - 2012 మే 14) ఒక భారతీయ బాలనటి. తరుణి సచ్ దేవ్ 2004లో వచ్చిన వెల్లినక్షత్రం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది, ఆ సినిమా మలయాళ ప్రేక్షకులకు బాగా నచ్చింది. అదే సంవత్సరంలో, తరుణి సచ్ దేవ్ సత్యం సినిమాలో కనిపించింది ఆమె సత్యం సినిమాలో ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌తో కలిసి నటించింది. తరుణి సచ్ దేవ్ 2009లో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన పా అనే హిందీ సినిమాలో కూడా నటించింది. ఆమె వివిధ కంపెనీల కోసం 50+ ప్రకటనలలో కూడా నటించింది. తరుణి సచ్ దేవ్ మరణించిన రెండు సంవత్సరాల తర్వాత ఆమె చివరి చిత్రం వెట్రి సెల్వన్ (2014) విడుదలైంది . 2012లో నేపాల్‌లోని జోమ్సోమ్ విమానాశ్రయం సమీపంలో అగ్ని ఎయిర్ డోర్నియర్ విమాన ప్రమాదంలో ఆమె మరణించింది. ఈ ప్రమాదంలో ఆమె తల్లి కూడా మరణించింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

తరుణి సచ్‌దేవ్ 1998 మే 14న భారతదేశంలోని ముంబైలో పారిశ్రామికవేత్త హరేష్ సచ్‌దేవ్ గీతా సచ్‌దేవ్ దంపతులకు జన్మించింది. [1] [2] [3] తరుణి సచ్ దేవ్ తొమ్మిదో తరగతి వరకు అవాబాయి ఫ్రాంజీ పెటిట్ బాలికల ఉన్నత పాఠశాలలో చదివింది. [3]

మరణం

[మార్చు]

తరుణి సచ్‌దేవ్ తన 2012మే14 న నేపాల్‌లోని జోమ్సోమ్ విమానాశ్రయానికి సమీపంలో అగ్ని ఎయిర్ డోర్నియర్ 228 విమాన ప్రమాదంలో మరణించింది. విమాన ప్రమాదంలో తరుణి సచ్ దేవ్ తల్లి గీతా సచ్‌దేవ్‌ కూడా మరణించింది. [1]

తరుణి ఆమె తల్లి మృతదేహాలను ముంబైకి తీసుకువచ్చి 16 మే 2012న దహనం చేశారు [4]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాష పేరు గమనికలు మూలం
2004 వెల్లినక్షత్రం. అమ్ముకుట్టి మలయాళ భాష [5]
సత్యం చిన్నుకుట్టి.
2008 క్యా ఆప్ పాంచ్వీ పాస్ సే తేజ్ హై హిందీ. టెలివిజన్ ప్రసారం [6].
2009 పా. సౌమిని సోమి [7]
2014 వెట్రి సెల్వన్. అభి తమిళం మరణానంతరం విడుదల.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Taruni Sachdev died on her 14th birthday". India Today. New Delhi. 16 May 2012. ISSN 0254-8399. Archived from the original on 17 May 2012. Retrieved 17 May 2012.
  2. "Child Artist Among Victims". The New Indian Express. 15 May 2012. Archived from the original on 1 May 2020. Retrieved 1 May 2020.
  3. 3.0 3.1 Dubey, Bharati (16 May 2012). "Nepal plane crash: Rasna girl Taruni Sachdeva dreamt to become heroine". The Times of India. Archived from the original on 1 May 2020.
  4. Valthaty, Nathaniel; Fleury, Johan; Rakshit, Pratik (17 May 2012). "Tears and chants mark Nepal crash victims' last rites". The Times of India. Archived from the original on 1 May 2020. Retrieved 1 May 2020.
  5. "Child actor Taruni Sachdev among victims of Dornier crash". The Hindu. 15 May 2012. ISSN 0971-751X. Archived from the original on 1 May 2020. Retrieved 1 May 2020.
  6. "Child artiste Taruni Sachdev dies in Nepal plane crash - Indian Express". The Indian Express. 15 May 2012. Archived from the original on 1 May 2020. Retrieved 1 May 2020.
  7. "Bachchan co-star dies in crash". BBC News. 15 May 2012. ISSN 2421-3667. Archived from the original on 1 May 2020. Retrieved 1 May 2020.