తరణ్ ఆదర్శ్
స్వరూపం
తరణ్ ఆదర్శ్ | |
---|---|
జననం | ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | 1965 జూన్ 13
వృత్తి |
|
క్రియాశీలక సంవత్సరాలు | 1980–ప్రస్తుతం |
తరణ్ ఆదర్శ్ (ఆంగ్లం: Taran Adarsh; జననం 1965 జూన్ 13) ఒక భారతీయ చలనచిత్ర విమర్శకుడు, వాణిజ్య విశ్లేషకుడు.[1][2] అతను సోషల్ మీడియాలో వాణిజ్య గణాంకాలు, బాక్సాఫీస్ నవీకరణలను అందించడంతో పాటు బాలీవుడ్ హంగామా కోసం తన సమీక్షలను అందించడానికి ప్రసిద్ధి చెందాడు.[3]
కెరీర్
[మార్చు]తరణ్ ఆదర్శ్ తన 15 సంవత్సరాల వయస్సులో వారపత్రిక అయిన ట్రేడ్ గైడ్ తో తన పాత్రికేయ వృత్తిని ప్రారంభించాడు. అతను స్వీయ దర్శకత్వంలో హలో బాలీవుడ్ (1994), బిన్నీ అండ్ ఫ్యామిలీ 2, ఫాక్స్ (2009) చిత్రాలు నిర్మించాడు. ఆయన ట్రేడ్ గైడ్‌పై తో పాటు బాలీవుడ్ వినోద వెబ్సైట్ అయిన బాలీవుడ్ హంగామాలో చురుకైన సినీ విమర్శకుడు, పాత్రికేయుడు, వాణిజ్య విశ్లేషకుడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ Sen, Meheli (1 March 2017). Haunting Bollywood: Gender, Genre, and the Supernatural in Hindi Commercial Cinema (in ఇంగ్లీష్). University of Texas Press. p. 216. ISBN 978-1-4773-1160-8.
- ↑ Devasundaram, Ashvin Immanuel (25 October 2018). Indian Cinema Beyond Bollywood: The New Independent Cinema Revolution (in ఇంగ్లీష్). Routledge. ISBN 978-1-351-25424-3.
- ↑ Rai, Amit S. (27 May 2009). Untimely Bollywood: Globalization and India's New Media Assemblage (in ఇంగ్లీష్). Duke University Press. p. 128. ISBN 978-0-8223-9233-0.
- ↑ Ghosh, Pratik (14 March 2008). "Films: interview with Taran Adarsh". Hindustan Times (in ఇంగ్లీష్). Retrieved 2008-03-14.