తపోవనము
తపోవనము | |
తపోవనము | |
కృతికర్త: | బెళ్లూరి శ్రీనివాసమూర్తి |
---|---|
అంకితం: | వాల్మీకి |
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | ఖండకావ్య సంపుటి |
విభాగం (కళా ప్రక్రియ): | తెలుగు సాహిత్యం |
ప్రచురణ: | |
విడుదల: | 1954 |
పేజీలు: | 125 |
రాయలసీమ కవులలో అగ్రగణ్యుడు మధురకవి బెళ్లూరి శ్రీనివాసమూర్తి వ్రాసిన ఖండకావ్యాల సంపుటము ఈ తపోవనము[1]. దీని లోని కవితలు వివిధ సందర్భాలలో వ్రాసినవి. భారతి, ఆంధ్రపత్రిక,శ్రీసాధన పత్రిక, రేనాడు,ప్రకృతిమాత మొదలైన పత్రికలలో ప్రచురితమైనవి. ఈ గ్రంథానికి కళ్యాణదుర్గం బోర్డు ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ గుమ్మగట్ట శ్రీనివాసరావు ఆంగ్లంలో ముందుమాట వ్రాశాడు. ఈ కావ్యాన్ని రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, చిలుకూరి నారాయణరావు, దువ్వూరి రామిరెడ్డి, తుమ్మల సీతారామమూర్తి చౌదరి, బులుసు వెంకటేశ్వర్లు, జమ్మలమడక మాధవరామశర్మ, పుట్టపర్తి నారాయణాచార్యులు, సి.వి.సుబ్బన్న శతావధాని, దుర్భాక రాజశేఖర శతావధాని, తలమర్ల కళానిధి మొదలైన వారు ప్రశంసిస్తూ వ్రాసిన వాక్యాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.
అంకితం
[మార్చు]ఈ పుస్తకాన్ని వాల్మీకికి ఈ విధంగా అంకితమిస్తున్నాడు కవి.
రామకథ పాడి మోక్షసామ్రాజ్యమునకు
ఏకపథ మారసితివి వాల్మీకి సుకవి,
ప్రేమ నేకైక సుతునభి 'రామగాథ'
నల్లుకొని యల్లుకొని శాంతి యలవరింతు.
ఈ కావ్యములోని ఖండికలు
[మార్చు]కళాజీవి (పూర్వఖండము)
[మార్చు]- శిశిరవర్ణములు
- కుసుమదామము
- నేను
- స్వేచ్ఛావిహంగము
- సౌందర్యపూజ
- తొలుకారుశోభ
- ప్రభాత పల్లకి
- ఋతుపరిదేవనము
- ఎట్లు మరణింతు!
- పశ్చాత్తాపము
- అంగవైకల్యము
- ఊరడింపు
- పడవపదము
- సహవాసకాంక్ష
- ఉపదేశము
- ముక్తి
- అభాగ్యజీవి
- గాఢయత్నము
- ఇంద్ర గోపము
- విషాదగీతి
- ఉగాదివేకువ
- అజ్ఞానము
- అమరత్వము
- ముదల
- అమృతసిద్ధి
కళాజీవి (ఉత్తరఖండము)
[మార్చు]- వివిక్త వీధి
- కృషి
- శ్రీ అరవిందోపాసన
- సుమమాలిక
- అఖండస్వాగతము
- కాళిదాసు
- గురూపదేశము
- ధన్యజీవితము
- శ్రీరాజశేఖర కవిసార్వభౌములు-రాణాప్రతాప
- మునివృత్తి
- రాయలసీమ
- జోహారులు
- ఉగాది
- తృప్తి
- కమండలువు
సాన్నిధ్యము (పూర్వఖండము)
[మార్చు]- ఝంఝామారుతము
- నా జీవిత స్వర్గము
- కావ్యమల్లిక
- గీతికలు
- గురుపూజ
- స్వర్గద్వారము
- పయనం
- పూజ
- భిక్షువు
- గీతాయోగము
- శాంతి
- శకుంతల
- నుతి
- సంధ్య
- ప్రకృతిమహిమ
- తిక్కశర్మ
- స్వాగతము
- అర్చన
- కవీంద్ర
- స్నేహస్మరణము
- ఆశీర్మాలిక
- నేడు
- కష్టేఫలి
- అక్కమ్మగార్ల కొండ
- అంకితగీతి
సాన్నిధ్యము (ఉత్తర ఖండము)
[మార్చు]- అద్వైతం
- సానుభూతి
- జలదపుత్రుడు
- స్మరణవీధి
- ఆహ్వానము
- కుందమాల
- సాన్నిధ్యము
- చిఱుపాట
- భావకుసుమములు
- ఉపాయనము
- ముక్తాదామము
- సారస్వతేయులకు కృతజ్ఞత
- నిర్యాణానంతరము
- కవితపస్వి
- నందన
స్వర్గద్వారము (పూర్వఖండము)
[మార్చు]- ఆంధ్రమాత
- రాజర్షి
- సంయుక్త చేటిక
- విపణి వీధి
- నా ప్రభూ
- సృష్టి మర్మము
- వెఱ్ఱిపాట
- నవ్య సందేశం
- గురుస్మరణ
- స్వర్గీయ రాయలసీమ చిత్రకారుడు
- గంజికేంద్రము
- నమస్తే
- సంక్రాంతికన్యలు
- సందేహము
- తెలుగు శిల్పి
స్వర్గద్వారము (ఉత్తరఖండము)
[మార్చు]- ప్రకృతిసందేశము
- నాస్తి ఇహపరచింతా
- స్వామిరామదాసు
- శ్రీ అనంతాశ్రమ సందర్శనము
- సమాధి
- అంక సప్తకము
- ఉత్తరుని విజృంభణము
- శివభారతము
- కట్టమంచి
- నిద్రాదేవి
- ఊదరా
- భావ భాగీరథి
- వేగుజుక్క
- యాత్రావిరతి
- ఖండకావ్యము
మచ్చుతునక
[మార్చు]జోహారులు
చిగురులుమేసీ
గుబురులఁ గూసే
కోయిలపాటల
తీయఁదనాలకు-
వార్షుకాభ్రములు
వంగి కురిసితే
కొండలలోన, కోనలలోన
వరదలుగా వాగులుగా
వాహినిగా ప్రవహించే
సెలపాటలకు-
వేగుజుక్క వెలుఁగులకు
కోడికూఁతసొబగులకు
కళావికాసం కల్పించే
కాపుయువకుని
కపిలెపదాలకు-
చేతులు జోడించీ
జోహారులు గూర్చీ
ప్రకృతిదేవీహృదయములోన
పగలూ రాతిరి కలిగించే
బ్రహ్మానందం చిలికించే
భవ్యమైన నా కవితాగీతం,
పాడుకొందు నవకవితా గేయం.