తత్పురుష సమాసము
స్వరూపం
ఉత్తర పదార్ధము ప్రధానముగా గలది తత్పురుష సమాసము. రామ బాణము - ఇందు పూర్వపదము రామ - ఉత్తరపదము బాణము. రామ బాణముతో చంపెను. అనగా ఇందు బాణము ప్రధానము. క్రియతో సంబంధము కలిగియుండును. మొదటి పదము లోపించిన విభక్తి పేరు సమాసమునకు వచ్చును. ఇది వ్యధి కరణ సమాసము. లోపించిన విభక్తిని చేర్చి చెప్పుట విగ్రహ వాక్యము.[1]
ఉదాహరణలు
[మార్చు]సమాసము | విగ్రహవాక్యము | సమాసనామము | తత్పురుష సమాస రకం |
1 | అర్ధ రాజ్యము | రాజ్యము యొక్క అర్ధభాగము | ప్రధమా తత్పురుష సమాసము |
కడతల | తల యొక్క కడ భాగము | ||
2 | కృష్ణ శ్రితుడు | కృష్ణుని ఆశ్రయించిన వాడు | ద్వితీయా తత్పురుష సమాసము |
నెలతాల్పు | నెలను ధరించిన వాడు | ||
3 | గుణహీనుడు | గుణము చేత హీనుడు | తృతీయ తత్పురుష సమాసము |
నెల తక్కువ వాడు | నెలచేత తక్కువ వాడు | ||
4 | పూజా | పూజ కొఱకు | చతుర్దీతత్పురుష సమాసము |
గృహము దేవర మేలు | గృహము దేవర కొఱకు మేలు. | ||
5 | ప్రాణాధికుడు | ప్రాణముకంటె అధికుడు | పంచమీతత్పురుష సమాసము |
దొంగ భయము | దొంగ వలన భయము | ||
6 | రాజభటుడు | రాజుయొక్క భటుడు | షష్ఠీ తత్పురుష సమాసము |
చెట్టు కొమ్మ | చెట్టు యొక్క కొమ్మ | ||
7 | గృహకృత్యములు | గృహమందలి కృత్యములు | సప్తమీ తత్పురుష సమాసము |
మాటనేర్పరి | మాటయందు నేర్పరి | ||
8 | అజ్ఞానము | జ్ఞానము లేనిది | నఙ్ఞ్ తత్పురుష సమాసము |
అసత్యము | సత్యము కానిది |
మూలాలు
[మార్చు]- ↑ ఆలీ, షేక్. "లిటిల్ మాస్టర్స్ సులభ వ్యాకరణము/సమాస విభాగము - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2021-05-11.