తక్కల మధుసూధనరెడ్డి
తక్కల మధుసూధనరెడ్డి | |||
తక్కల మధుసూధనరెడ్డి | |||
పదవీ కాలం 2004-2008 | |||
ముందు | సముద్రాల వేణుగోపాలాచారి | ||
---|---|---|---|
తరువాత | అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి | ||
నియోజకవర్గం | ఆదిలాబాదు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బోథ్, ఆదిలాబాదు జిల్లా, తెలంగాణ | 1946 జనవరి 14||
మరణం | 2015 | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | చరణదాసురెడ్డి - గోదావరి | ||
జీవిత భాగస్వామి | లక్ష్మిదేవి | ||
సంతానం | ఒక కూతురు, ఒక కుమారుడు | ||
మతం | హిందూ |
తక్కల మధుసూధనరెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు. తెలంగాణ రాష్ట్ర సమితి తరపున ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి 14వ లోక్ సభకు పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[1][2][3]
జననం, విద్య
[మార్చు]మధుసూదనరెడ్డి 1946 జనవరి 16న చరణదాసురెడ్డి - గోదావరి దంపతులకు తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాదు జిల్లా, బోథ్ గ్రామంలో జన్మించాడు.[4] మధుసూదనరెడ్డి బి.ఎస్సీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం న్యాయ కళాశాలలో ఎల్.ఎల్.బి. చదివాడు.
వివాహం
[మార్చు]మధుసూదనరెడ్డికి 1970 ఫిబ్రవరి 23న లక్ష్మిదేవితో వివాహం జరిగింది. వారికి ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నాడు.
వృత్తి
[మార్చు]కొంతకాలం న్యాయవాదిగా పనిచేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]మధుసూదనరెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. 2004లో 14వ లోక్‌సభ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ తరపున ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీచేసి తెలుగుదేశం అభ్యర్థి సముద్రాల వేణుగోపాలాచారిపై 40,974 ఓట్ల మెజారిగీతో గెలుపొందాడు.[5][6] 2008లో జరిగిన ఉపఎన్నికలో 1,44,455 ఓట్లతో మూడోస్థానంలో నిలిచాడు.
పదవులు
[మార్చు]- 1983-1986 మధ్య జిల్లా పరిషత్ చైర్మన్.
- 2004లో 14వ లోక్‌సభ ఉపఎన్నికలలో ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గం లోక్‌సభ సభ్యులు.[7]
- సభ్యులు, సామాజిక న్యాయం కమిటీ సాధికారత
- సభ్యులు, రసాయనాలు, ఎరువులు కమిటీ
ఇతరములు
[మార్చు]- సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నాడు.
వనరులు
[మార్చు]- ↑ ఈనాడు, తాజావార్తలు (18 March 2019). "ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గం". www.eenadu.net. Archived from the original on 18 April 2020. Retrieved 18 April 2020.
- ↑ "MADHUSUDHAN REDDY THAKKALA(TRS):Constituency- Adilabad(ANDHRA PRADESH) - Affidavit Information of Candidate:". myneta.info. Archived from the original on 2020-12-05. Retrieved 2021-11-25.
- ↑ "'ఆయన'గెలిచారు..ఆమెకు తెలియదు | Sakshi". 2 May 2024. Archived from the original on 2 May 2024. Retrieved 2 May 2024.
- ↑ లోక్‌సభ జాలగూడు[permanent dead link]
- ↑ "Members : Lok Sabha". loksabhaph.nic.in. Archived from the original on 2020-08-12. Retrieved 2021-11-25.
- ↑ Rana, Mahendra Singh (2006). India Votes: Lok Sabha & Vidhan Sabha Elections 2001-2005 (in ఇంగ్లీష్). Sarup & Sons. ISBN 978-81-7625-647-6. Archived from the original on 2021-11-25. Retrieved 2021-11-25.
- ↑ "Andhra Pradesh: జగన్ ఆయనను చూసి నేర్చుకోవాలన్న జనసేన ముఖ్యనేత.. ఇలాగైతే కష్టమేనంటూ." News18 Telugu. 2019-03-29. Archived from the original on 2021-11-24. Retrieved 2021-11-25.