తంబళ్ళవారిపల్లె
స్వరూపం
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
తంబిళ్ళవారిపల్లె కడప జిల్లా కోడూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
తంబిళ్ళవారిపల్లె గ్రామం, అనంతరాజుపేట పంచాయతీ పరిధిలోని గ్రామం.
గ్రామంలోని దేవాలయాలు
[మార్చు]- శ్రీరామాలయం:- ఈ గ్రామ శ్రీరామాలయంలో, శ్రీరామనవమి, జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించెదరు. మహిళలు అధికసంఖ్యలో వచ్చి పూజలు నిర్వహించెదరు.
- శ్రీ సత్తెమ్మ తల్లి ఆలయం:- శ్రీ సత్తెమ్మ తల్లికి 2014, మే-29 గురువారం నాడు, ఘనంగా పూజలు నిర్వహించారు. తల్లికి 101 బిందెలు నీళ్ళుపోసి, 101 టెంకాయలు కొట్టి, 101 ప్రసాదాలు పెట్టినారు. అలాగే నాగదేవతకు పూజలు నిర్వహించారు. ప్రతిసారీ గ్రామంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సత్యమ్మ తల్లికి పూజలు నిర్వహించి, తమ మొక్కులు తీర్చుకోవటం అనాదిగా వస్తున్న ఆచారమని గ్రామస్థుల కథనం. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో 2014, జూలై-23, బుధవారం నాడు, స్వామివారి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో వేకువఝామునుండియే స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేకపూజలు నిర్వహించారు. గ్రామస్థులు మొక్కులు తీర్చుకున్నారు. నైవేద్యాలు, అర్చనలు చేసారు. మహిళలు కాయా, కర్పూరం సమర్పించి పూజలు చేసారు.