తండ్రులు కొడుకులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తండ్రులు కొడుకులు
(1961 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.హేమాంబరధరరావు
తారాగణం కొంగర జగ్గయ్య,
బి.సరోజా దేవి,
జమున
సంగీతం టి.చలపతిరావు
నిర్మాణ సంస్థ రఘురామ్ ఫిల్మ్స్
భాష తెలుగు
తండ్రులు కొడుకులు సినిమా పోస్టర్
కె.హేమాంబరధరరావు

తండ్రులు కొడుకులు కె.హేమాంబరధరరావు దర్శకత్వంలో కొంగర జగ్గయ్య, బి.సరోజా దేవి, జమున ప్రధాన పాత్రల్లో నటించిన 1961డిసెంబర్ 1 న విడుదలైన నాటి తెలుగు చలన చిత్రం. ఈ చిత్రానికి సంగీతం తాతినేని చలపతి రావు అందించారు.

విడుదల

[మార్చు]

ప్రచారం

[మార్చు]

తండ్రి-కొడుకులు సినిమా ప్రచారం వినూత్నంగా చేశారు. "కప్పను చూడంగ పాము గడగడ వణికెన్.. హారము లేకాలనే ఆహా యనిపించెన్... ఎలుకలు తమ కలుగులోనికేనుగు నీడ్చెన్.. కన్నకొడుకు భర్తయయ్యెగాయని మురిసెన్.. రాలు దుటుంగరాలు బిగిరాలగ నా జవరాలు దాల్చొగిన్ - ఈ సమస్యలను పూరించిన తీరు రఘురామ్ ఫిలిమ్స్ వారి తండ్రులు కొడుకులు చిత్రంలో చూసి ఆనందించండి" అంటూ భాషాభిమానులు, సాహిత్యపరులను ఆకర్షించేలా ప్రచారం సాగించారు.[1]

పాటలు

[మార్చు]
  1. ఓహోహో సుందరీ నీ అందమేనా ఈ వసంతం[2] గానం:పి.బి.శ్రీనివాస్, ఎస్ జానకి,రచన:శ్రీశ్రీ
  2. ఉన్నమాట అన్నానని ఉలుకెందుకు, గానం.పి.బి.శ్రీనివాస్ , ఎస్.జానకి, రచన: శ్రీ శ్రీ
  3. నీ తలపే నీ వలపే నా హృదయాన నిండెను లే నా మనసే , గానం: ఎస్.జానకి, రచన: ఆంజనేయ శాస్త్రి
  4. మేరే ప్యారి వయ్యారి ఇటు చూడవే ఒకసారి , గానం:మాధవపెద్ది, రచన:కొసరాజు
  5. ఒకటి రెండు మూడు అది ఎంటో తెలుసా, గానం: ఎస్.జానకి, రచన:కొసరాజు
  6. కుప్పల కావలి కాయగ (సంవాద పద్యాలు) గానం: పి.బి.శ్రీనివాస్ , ఎస్ జానకి, రచన:కొసరాజు
  7. నవ్వులు రువ్వే చిన్నది నను కవ్విస్తున్నది , గానం:మాధవపెద్ది, రచన:కొసరాజు

మూలాలు

[మార్చు]
  1. మాదిరాజు, కనకదుర్గ (1 నవంబరు 2017). చెరుకూరి, రామోజీరావు (ed.). "నేడే చూడండి!". తెలుగు వెలుగు. 6 (3). హైదరాబాద్: రామోజీ ఫౌండేషన్: 50–53.
  2. శ్రీశ్రీ (2001). ఉక్కుపిడికిలి - అగ్ని జ్వాల శ్రీశ్రీ సినిమా పాటలు (1 ed.). విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. Retrieved 17 June 2020.

3. ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు .