డైక్లోరిన్ హెప్టాక్సైడ్
పేర్లు | |
---|---|
IUPAC నామము
Dichlorine heptoxide
| |
ఇతర పేర్లు
Chlorine(VII) oxide; Perchloric anhydride; (Perchloryloxy)chlorane trioxide
| |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [10294-48-1] |
పబ్ కెమ్ | 123272 |
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:52356 |
SMILES | O=Cl(=O)(=O)OCl(=O)(=O)=O |
| |
ధర్మములు | |
Cl2O7 | |
మోలార్ ద్రవ్యరాశి | 182.901 g/mol |
స్వరూపం | colorless oil |
సాంద్రత | 1900 kg m−3 |
ద్రవీభవన స్థానం | −91.57 °C (−132.83 °F; 181.58 K) |
బాష్పీభవన స్థానం | 82 °C (180 °F; 355 K) |
ప్రమాదాలు | |
ప్రధానమైన ప్రమాదాలు | oxidizer, contact explosive[1] |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
డైక్లోరిన్ హెప్టాక్సైడ్ ఒక రసాయన సంయోగ పదార్థం.ఇది ఒక అకర్బన సమ్మేళనం.ఈ రసాయనపదార్థం యొక్క రసాయన సంకేత పదం Cl2O7.ఈ క్లోరిన్ ఆక్సైడ్, పెర్క్లోరిక్ ఆమ్లం యొక్క నిర్జలస్థితి(anhydride).
ఉత్పత్తి
[మార్చు]నిర్జలీకరణ కారకమైన ఫాస్పరస్పెంటాక్సైడ్ సమక్షములో పెర్క్లోరిక్ఆమ్లాన్ని జాగ్రత్తగా డిస్టిలేసన్ చెయ్యడంద్వారా డైక్లోరిన్ హెప్టాక్సైడ్ను ఉత్పత్తి చెయ్యవచ్చును.
- 2HClO4 + P4O10 → Cl2O7 + H2P4O11
ఈ మిశ్రమం నుండి క్లోరిన్(VII)ఆక్సైడును డిస్టిలేసను ద్వారా వేరుపరచవచ్చును.క్లోరిన్, ఓజోన్ మిశ్రమం పై కాంతిని ప్రకాశింప చెయ్యడం వలన డైక్లోరిన్ హెప్టాక్సైడ్ను ఉత్పత్తి చెయ్యవచ్చును. డైక్లోరిన్ హెప్టాక్సైడ్ నెమ్మదిగా జలవిశ్లేషణ చెందటం వలన తిరిగి పెర్క్లోరిక్ ఆమ్లంగా పరివర్తన చెందును.
అణునిర్మాణం
[మార్చు]డైక్లోరిన్ హెప్టాక్సైడ్ ఒక ఉష్ణ గ్రాహకము. అనగా ఈ పదార్థం అంతర్గతంగా అస్థిరమైనది.
- 2Cl2O7 → 2Cl2 + 7O2 (ΔH = −135 kJ/mol)
డైక్లోరిన్ హెప్టాక్సైడ్ సంయోగపదార్ధ అణునిర్మాణం Cl-O-Cl బంధం 118.6°కోణంతో కొద్దిగా వంపు కలిగి, C2అణువు సౌష్టవంకలిగి ఉండును.అంతిమ/చివరి Cl-O పరమాణువుల మధ్యదూరం 1.709 Å, Cl=O ల బంధదూరం1.405 Å.సమ్మేళనం అణువులో పరమాణువులు సమయోజనీయబంధం కలిగి ఉన్నను,సమ్మేళనంలో క్లోరిస్ అత్యధికంగా +7 ఆక్సీకరణ స్థాయి కలిగి ఉన్నది.
రసాయన చర్యలు
[మార్చు]క్లోరిన్ టెట్రాక్లోరైడు ద్రావణంలో ప్రాథమిక, ద్వితీయశ్రేణి అమీను(amines)లతో డైక్లోరిన్ హెప్టాక్సైడ్ రసాయన చర్య వలన N-పెర్క్లోరిల్స్(N-perchloryls)ఏర్పడును.
- 2 RNH2 + Cl2O7 → 2 RNHClO3 + H2O2 R2NH + Cl2O7 → 2 R2NClO3 + H2O
డైక్లోరిన్ హెప్టాక్సైడ్తో అల్కీనులు(alkenes )చర్య జరపడంచే అల్కైల్ పెర్క్లోరేటులు ఏర్పడును.ఉదాహరణకు టెట్రాక్లోరైడు ద్రావణంలో ప్రొపేన్ తో చర్య వలన ఐసో ప్రొపైల్ పెర్క్లోరేట్ , 1-క్లోరో-2 ప్రొపైల్ పెర్క్లోరేట్ లను ఏర్పరచును.డైక్లోరిన్ హెప్టాక్సైడ్ ఒకబలమైన ఆమ్ల ఆక్సైడ్,
భద్రత
[మార్చు]డైక్లోరిన్ హెప్టాక్సైడ్ ఒక బలమైన క్లోరిన్ ఆక్సైడ్ అవడంవలన, ఇది బలమైన ఆక్సీకరణి, ప్రేలుడు స్వభావం ఉన్న పదార్థం.ఈ రసాయనపదార్థం మంటను తాకటం వలన, లేదా యాంత్రికఘాతం వలన లేదా అయోడిన్‌తో సంపర్కం వలన విస్పొటన చెందును.చల్లగాఉన్నప్పుడు సల్ఫర్/గంధకం ,ఫాస్పరస్/భాస్వరం, కాగితం పై ఎటువంటి ప్రభావం చూపించాడు.మూలక క్లోరిన్ మనుషుల మిద ఎటువంటి ప్రభావం చూపునో డైక్లోరిన్ హెప్టాక్సైడ్ వలన కూడా అటువంటి ప్రభావమే ఉంటుంది.
మూలాలు
[మార్చు]- ↑ Holleman, Arnold F.; Wiberg, Egon (2001). Inorganic chemistry. Translated by Mary Eagleson, William Brewer. San Diego: Academic Press. p. 464. ISBN 0-12-352651-5.