డేనియల్ మనోహర్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | హైదరాబాదు, తెలంగాణ | 1974 మార్చి 13|||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
1997-2007 | హైదరాబాదు | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ఈ.ఎస్.పి.ఎన్. క్రాక్ ఇన్ఫో, 22 ఆగస్టు 2018 |
డేనియల్ మనోహర్, తెలంగాణకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1997-2007 మధ్యకాలంలో హైదరాబాద్ క్రికెట్ టీం తరపున[1] 73 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు.
జననం
[మార్చు]డేనియల్ మనోహర్, 1974 మార్చి 13న తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదులో జన్మించాడు.
క్రికెట్ రంగం
[మార్చు]ఫస్ట్-క్లాస్
[మార్చు]1997-98 మధ్య ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేశాడు. 2007 డిసెంబరు 25 నుండి 28 వరకు హైదరాబాదు నగరంలో ఉత్తర ప్రదేశ్ క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడాడు.[2] 73 మ్యాచ్‌ల్లో 33.68 బ్యాటింగ్ సగటుతో 4,009 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 20 అర్థసెంచరీలు ఉన్నాయి. 144 పరుగులతో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేశాడు. బౌలింగ్ లో 4,083 బంతులు వేసి 65 వికెట్లు తీశాడు.
లిస్టు-ఎ
[మార్చు]1997-98 మధ్య లిస్టు-ఎ క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేశాడు. 2007 ఫిబ్రవరి 13న హైదరాబాదు నగరంలో ఆంధ్ర క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడాడు.[3] 36 మ్యాచ్‌ల్లో 37.85 బ్యాటింగ్ సగటుతో 1,287 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 8 అర్థసెంచరీలు ఉన్నాయి. 131 పరుగులతో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేశాడు. బౌలింగ్ లో 390 బంతులు వేసి 13 వికెట్లు తీశాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Daniel Manohar". ESPN Cricinfo. Retrieved 2022-08-28.
- ↑ "Full Scorecard of U. Pradesh vs Hyderabad Group B 2007/08 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2022-08-28. Retrieved 2022-08-28.
- ↑ "Full Scorecard of Andhra vs Hyderabad South Zone 2006/07 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2022-08-28. Retrieved 2022-08-28.