డెకాబోరాన్
పేర్లు | |
---|---|
ఇతర పేర్లు
decaborane
decaboron tetradecahydride | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [17702-41-9] |
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 241-711-8 |
SMILES | [H]1[BH]234[BH]156[BH]278[BH]39([H]4)[BH]712[BH]853[BH]645[BH]311[BH]922[BH]14([H]5)[H]2 |
| |
ధర్మములు | |
మోలార్ ద్రవ్యరాశి | 122.22 g/mol |
స్వరూపం | White crystals |
వాసన | bitter, chocolate-like[1] |
సాంద్రత | 0.94 g/cm3[1] |
ద్రవీభవన స్థానం | 97–98 °C (207–208 °F; 370–371 K) |
బాష్పీభవన స్థానం | 213 °C (415 °F; 486 K) |
ద్రావణీయత in other solvents | Slightly, in cold water. [1] |
బాష్ప పీడనం | 0.2 mmHg[1] |
ప్రమాదాలు | |
ప్రధానమైన ప్రమాదాలు | may ignite spontaneously on exposure to air[1] |
జ్వలన స్థానం | {{{value}}} |
స్వయం జ్వలన
ఉష్ణోగ్రత |
149 °C (300 °F; 422 K) |
Lethal dose or concentration (LD, LC): | |
LC50 (median concentration)
|
276 mg/m3 (rat, 4 hr) 72 mg/m3 (mouse, 4 hr) 144 mg/m3 (mouse, 4 hr)[2] |
US health exposure limits (NIOSH): | |
PEL (Permissible)
|
TWA 0.3 mg/m3 (0.05 ppm) [skin][1] |
REL (Recommended)
|
TWA 0.3 mg/m3 (0.05 ppm) ST 0.9 mg/m3 (0.15 ppm) [skin][1] |
IDLH (Immediate danger)
|
15 mg/m3[1] |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
డెకాబోరాన్లేదా డెకాబోరాన్ (14) అనునది ఒక రసాయన అకర్బన రసాయన సంయోగ పదార్థం. బోరాన్, హైడ్రోజన్ పరమాణువుల సంయోగం వలన ఏర్పడిన సమ్మేళనపదార్థం.ఒక డెకాబోరాన్ అణువులో 10 బోరాన్ మరొయు 14 హైడ్రోజన్ పరమాణువులు బంధం కల్గిఉండును. డెకాబోరాన్ యొక్క రసాయనిక సంకేత పదంB10H14.బోరాన్ హైడ్రైడ్ క్లస్టరుకు చెందిన ముఖ్యమైన సంయోగ పదార్థాలలో డెకాబోరాన్ ఒకటి. డెకాబోరాన్ తెల్లని స్పటిక అణునిర్మాణాన్నిపొంది ఉంది. ఇది అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద త్వరగా ఆవిరిఅగు లక్షణాన్ని కల్గిఉన్నది. తక్కువ ఉష్ణోగ్రత వద్ద త్వరగా ఆవిరి అగురసాయన పదార్థాలను వోలటైల్ (volatile) పదార్థాలు అంటారు. డెకాబోరాన్ హానికరమైన రసాయనపదార్థం
భౌతిక లక్షణాలు
[మార్చు]డెకాబోరాన్ బలమైన గుణాత్మకమైన వాసన కల్గిఉన్నది. కొన్నిసార్లు చాకొలేట్ వంటి వాసన కల్గి ఉంది. ఇలాంటి వాసన కల్గి ఉండటం బోరాన్ సంయోగ పదార్థాల ప్రత్యేక గుణం. డెకాబోరాన్ యొక్క భౌతికగుణాలు నాప్తాలిన్, అంత్రాసేన్ వంటి సేంద్రియ సంయోగ పదార్థాలను పోలిక కల్గిఉన్నవి.పీడన రహిత స్థితి (వాక్యుం) లో ఒక మోస్తారు ఉష్ణోగ్రతలో దీనిని ఉత్పతనము చెందించ వచ్చును.డెకాబోరాన్ ను ఉత్పతనం (Sublimation) కావించడం అనేది, దీనిని శుద్ధికరించుటకు ఉపయోగించు సాధారణ ప్రక్రియ.సేంద్రియ సంయోగ పదార్థాల వలె డెకాబోరాన్ వేగంగా, త్వరితంగా మండుస్వభావం కలది. అయితే మిగతా బోరాన్ హైడ్రేడ్ ల వలె ప్రకాశమైనఆకుపచ్చని జ్వాలతో మండును.
డెకాబోరాన్ మరుగుచున్న నీటితో జలవిశ్లేషణ చర్యకు లోనయి హైడ్రోజన్ వాయువును, బోరిక్ ఆమ్లాన్ని ఏర్పరచినప్పటికి, తేమ కల్గిన గాలితో అంతగా చర్యా శీలతను చూపించదు.
భౌతిక స్థితి
[మార్చు]డెకాబోరాన్ స్థిరమైన తెల్లని స్పటికరూపంలో ఉండును.[3] ఘాటైన (చాకొలేట్ వంటి) వాసన కల్గి ఉంది. డెకాబోరాన్ అణుభారం 122.22 గ్రాములు/మోల్[4].
సాంద్రత
[మార్చు]సాధారణ ఉష్ణోగ్రత (25౦Cవద్ద) డెకాబోరాన్ సాంద్రత 0.94 గ్రాములు/సెం.మీ3[5]
ద్రవీభవన ఉష్ణోగ్రత
[మార్చు]డెకాబోరాన్ రసాయన పదార్థం యొక్క ద్రవీభవన స్థానం 97–98 °C (207–208 °F; 370–371K) [3]
బాష్పీభవన ఉష్ణోగ్రత
[మార్చు]డెకాబోరాన్ రసాయన పదార్థం యొక్క బాష్పీభవన స్థానం 213 °C (415 °F; 486 K)
ద్రావణీయత
[మార్చు]డెకాబోరాన్ చల్లని నీటిలో కొంతమేర కరుగును. అలాగే పలు అధ్రువీయ ద్రావణులలో, ఒకమోస్తరుగా ధ్రువీయద్రావణులలో కరుగును.
స్వయంప్రేరిత దహనఉష్ణోగ్రత(Autoignition temperature)
[మార్చు]డెకాబోరాన్ సంయోగ పదార్థం 149 °C (300 °F; 422 K) వద్ద ఆక్సిజన్/గాలి అందుబాటులో ఉన్న తనకు తానుగా దహనం చెందును/మండును.
అణునిర్మాణం
[మార్చు]డెకాబోరాన్ అణువులోని బోరాన్ 10 (B10) చట్రనిర్మాణం అసంపూర్ణ ఆక్టాడెకాహెడ్రాన్ పోలికలో ఉండును.
సంశ్లేషణ
[మార్చు]చిన్న బోరాన్ హైడ్రైడ్ క్లస్టరులను ఉష్ణవిచ్ఛేదన/పైరోలిసిస్ (pyrolysis ) చెయ్యడం ద్వారా డెకాబోరాన్‌ను తయారు చేయుదురు. డైబోరాన్ ( లేదాB2H6) లేదా పెంటా బోరాన్ (B5H9) ల నుఉష్ణవిచ్ఛేదన/తాపవిచ్ఛేదన చేసిన హైడ్రోజన్ ను (H2) ను కోల్పోయి డెకాబోరాన్ ఏర్పడును.ప్రయోగశాల స్థాయిలో సోడియం బోరోహైడ్రైడ్ ను బోరాన్ ట్రైఫ్లోరైడ్తో చర్యకు ఒను కావించిన NaB11H14ఏర్పడును. దీనిని అమ్లికరించిన డెకాబోరాన్, హైడ్రోజన్ వాయువు ఏర్పడును.
ఇది CH3CN, Me2S వంటి లేవిస్ క్షారాలతో (Lewis bases (L) చర్య వలన బోరాన్ వ్యుత్పన్నములను (derivatives) B10H12•2Lఫార్ములాతో ఏర్పరచును.
- B10H14 + 2 L → B10H12L2 + H2
ఈ రకపు/జాతి/వర్గం ఉత్పన్న సమూహాన్ని arachno clustersగా వర్గీకరించారు.ఇవి ఎసిటిలిన్ తో "closo" అర్థోకార్బోరాన్ ను ఇచ్చును.
- B10H12•2L + C2H2 → C2B10H12 + 2 L + H2
ఇది బలహీనమైన బ్రాన్స్టేడ్ ఆమ్లం (Brønsted acid).ఇది మొనోడిప్రోటోనేసన్ చెంది అనయాన్[B10H13]−ను ఏర్పరచును
అనువర్తనము
[మార్చు]డెకాబోరాన్ గురించి తరచుగా పరిశోధన జరుగు చున్నను దీనియొక్క ప్రత్యేకమైన ఉపయోగం గురించి ఇదమిద్దంగా తెలియదు. డెకాబోరాన్ యొక్క అణువు ప్లాస్మాస్థితిలో వియోగం చెంది మోనోఆటమిక్ బోరాన్ అయాన్ ను విడుదల చేయుట వలన, ఇది పొటెన్సియల్లి (potentially) గా ఎ న్యుట్రానిక్ ఫ్యూసన్ (aneutronic fusion) లో ఇంధనంగా వాడుటకు ఉపయోగ పడును. డెకాబోరాన్ ను రాకెట్ ఇంధనాల దహన సామర్ధ్యాన్నిపెంచు అదురువు/అదనపు చేర్పుడుపదార్థం (additive) గా అభివృద్ధిపరచడం జరిగింది. ఇథైల్ డెకాబోరాన్ వంటి డెకాబోరాన్ యొక్క ఉత్పన్నాలను కూడా ఇంధనపు అదనపు చేర్పుపదార్థంగా కుడా ప్రయత్నించారు. డెకాబోరాన్ ను అసిటిలిన్/ఎసిటిలిన్ తో చర్య జరిపించడం ద్వారా వినైల్ డెకాబోరాన్ (డెకేన్, dekene) ను తయారు చేయుదురు.
రక్షణ-భద్రత
[మార్చు]పెంటాబోరాన్ వలె డెకాబోరాన్ కూడా ఎక్కువ హనికరమైన విషరసాయనం. పెంటాబోరాన్ కన్న తక్కువ విషకారి అయినప్పటికీ కేంద్ర నాడీవ్యవస్థపై ప్రభావం చూపించును. చర్మము ద్వారా శరీరం లోకి శోషింపబడుతుంది. ఇది కార్బన్ టెట్రాక్లోరైడ్ తో విస్పోటక మిశ్రమాన్ని ఏర్పరచును. 1948లో న్యూయార్క్ లోని మాల్టాలో పెంటాబోరాన్ ఉత్పత్తి చేయు పరికరాలను కార్బన్ టెట్రాక్లోరైడ్ తో శుద్ధి చేయుటకు ప్రయత్నించినపుడు విస్పోటం జరిగింది.
మూలాలు/ఆధారాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 NIOSH Pocket Guide to Chemical Hazards. "#0175". National Institute for Occupational Safety and Health (NIOSH).
- ↑ "Decaborane". Immediately Dangerous to Life and Health Concentrations (IDLH). National Institute for Occupational Safety and Health (NIOSH).
- ↑ 3.0 3.1 "Decaborane". organic-chemistry.org. Retrieved 2016-05-08.
- ↑ "Decaborane(14)". sigmaaldrich.com. Retrieved 2016-05-08.
- ↑ "DECABORANE". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2016-05-08.