డి. రాజేశ్వర్ రావు
డి. రాజేశ్వర్ రావు | |||
| |||
ఎమ్మెల్సీ
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2017 మే 28 - 27 మే 2023 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | నిజామాబాదు, తెలంగాణ | 1961 మార్చి 2||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | మల్లయ్య, వెంకమ్మ | ||
జీవిత భాగస్వామి | అనసూయ | ||
సంతానం | ఒక కుమారుడు, ఒక కుమార్తె |
డి. రాజేశ్వర్ రావు తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త. 2017-2023 వరకు తెలంగాణ శాసనమండలి సభ్యుడిగా పనిచేసాడు.[1]
జీవిత విషయాలు
[మార్చు]రాజేశ్వర్ రావు 1961, మార్చి 2న మల్లయ్య, వెంకమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, నిజామాబాదులో జన్మించాడు. బిఏ వరకు చదువుకున్నాడు.[2]
వ్యక్తిగత వివరాలు
[మార్చు]రాజేశ్వర్ రావుకు అనసూయతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె.[3]
రాజకీయరంగం
[మార్చు]2005 నుండి 2007 హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ గా పనిచేశాడు. 2007 నుండి 2014, జూన్ 1 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014, జూన్ 2 నుండి 2017, మే 27 వరకు తెలంగాణ శాసనమండలి సభ్యుడిగా పనిచేశాడు. 2017, మే 28న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
ఆయనను 2023 ఆగస్టు 10న క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[4]
డి. రాజేశ్వర్ రావు బీఆర్ఎస్ పార్టీని వీడి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[5]
ఇతర వివరాలు
[మార్చు]ఆస్ట్రేలియా, ఈజిప్ట్, ఇజ్రాయెల్, జోర్డాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, థాయిలాండ్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొదలైన దేశాలలో పర్యటించాడు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Telangana Legislature, MLCs (3 August 2021). "Members Information - Telangana-Legislature". www.telanganalegislature.org.in. Archived from the original on 3 August 2021. Retrieved 3 August 2021.
- ↑ Telangana Data, MLCs (2 October 2020). "Telangana Nominated MLC D. Rajeshwar Rao". Archived from the original on 3 August 2021. Retrieved 3 August 2021.
- ↑ "D. Rajeshwar Rao". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-06-30. Retrieved 2021-08-03.
- ↑ "స్టేట్ క్రిస్టియన్ మైనార్టీ పైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా రాజేశ్వర్ రావు". 10 August 2023. Archived from the original on 11 August 2023. Retrieved 11 August 2023.
- ↑ NT News (17 April 2024). "కాంగ్రెస్‌లో చేరికలు". Archived from the original on 5 May 2024. Retrieved 5 May 2024.