డి. రాజారాం యాదవ్
దోడోళ్ల రాజారాం యాదవ్ | |||
| |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | తాడ్ల రాంపూర్, ఎర్గట్ల మండలం, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం | 1976 ఫిబ్రవరి 6||
రాజకీయ పార్టీ | భారత రాష్ట్ర సమితి (డిసెంబర్ 2018 నుండి ) | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలుగుదేశం పార్టీ,[1] భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | దోడోళ్ల భూమన్న, సత్తమ్మ | ||
జీవిత భాగస్వామి | అరుణ ఆకుల | ||
సంతానం | స్వేచ్ఛ, చార్వాక | ||
నివాసం | హైదరాబాద్ ఆర్మూర్ |
దోడోళ్ల రాజారాం యాదవ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉద్యమకారుడు, ఓయూ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకుడు. ఆయన తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేతగా క్రియాశీలకంగా పని చేసి ప్రస్తుతం బీసీ జనసభ అధ్యక్షుడిగా ఉన్నాడు.[2][3]
జననం, విద్యాభాస్యం
[మార్చు]దోడొళ్ల రాజారాం యాదవ్ 1976 ఫిబ్రవరి 6లో తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, యర్గట్ల మండలం, తాడ్ల రాంపూర్ గ్రామంలో దోడొళ్ల భూమన్న, సత్తమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు తాడ్ల రాంపూర్ గ్రామంలో, మోర్తాడులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, నిజామాబాద్‌లోని గిరిరాజ్ కాలేజ్ నుండి బీఏ హానర్స్ (డిగ్రీ), ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని నిజాం కాలేజీలో ఎంఏ (హిస్టరీ), ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో బిఎడ్ (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్), ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ది మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్టిస్ ఆఫ్ తెలంగాణ అనే అంశంపై పరిశోధన చేస్తున్నాడు.
విద్యార్థి నాయకుడిగా
[మార్చు]రాజారాం యాదవ్ విద్యార్థి దశ నుండే విద్యార్థి నాయకుడిగా పనిచేశాడు. పాఠశాల స్థాయి నుండే ప్రగతి శీల భావాలతో క్యాపిటషన్ ఫీజు, బాబ్రీ మస్జీద్ కూల్చివేతకు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాడు. పీడిఎస్ యూలో కీలకంగా పనిచేసి బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి 2001లో బీసీ విద్యార్థి సమైక్య అనే ఒక స్వతంత్ర విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేసి దానికి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగారు.
2006 సెప్టెంబర్ 17న ఆర్ట్స్ కాలేజ్ వేదికగా భారీ బహిరంగ సభ ద్వారా వేలాది మంది విద్యార్థుల సమక్షంలో తెలంగాణ విద్యార్థి సంఘం (టీవీఎస్) ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహిరంగ సభకు మాజీ కేంద్ర రక్షణ శాఖ మంత్రి జార్జ్ ఫెర్నాన్డేజ్, అప్పటి కేంద్ర మంత్రి ప్రస్తుత హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ వంటి నాయకులను పిలవడం జరిగింది. 2006 సెప్టెంబర్ 18న తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన అప్పటి ఎంపీ లగడపాటి రాజగోపాల్ పై సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రాజారామ్ యాదవ్ దాడి చేసి అరెస్ట్ అయ్యారు. 2007 జనవరిలో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన పుట్టపర్తి సాయిబాబా వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్ డిడి కాలనీ లోని పుట్టపర్తి సాయిబాబా ఆలయం వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొని అరెస్ట్ కావడం జరిగింది.
2009 నవంబర్ 18న హైదరాబాద్ లోని హైదరగూడలో తెలంగాణ విద్యార్థి జేఏసీ (ఓయూ జేఏసీ) ఏర్పాటు కావడంలో రాజారామ్ యాదవ్ ముఖ్య భూమిక పోషించారు. అలాగే ఓయూ జేఏసీకి అధ్యక్షునిగా కుడా పనిచేసాడు. 2009 డిసెంబర్ 10న చలో అసెంబ్లీ (అసెంబ్లీ ముట్టడి) కార్యక్రమం, 2010 జనవరి 3న లక్షలాదిమంది విద్యార్థులతో నిర్వహించబడిన విద్యార్థి గర్జన, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ నుంచి కాకతీయ యూనివర్సిటీ వరకు విద్యార్థుల మహాపాదయాత్ర నిర్వహణలో రాజారామ్ యాదవ్ చురుకైన పాత్ర పోషించారు. రాజారామ్ యాదవ్ జైల్లో ఉండటం మూలంగా జనవరి 3న నిర్వహించిన విద్యార్థి గర్జన సభకు హాజరు కాలేకపోయారు.
మొత్తంగా తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో రాజారామ్ యాదవ్ పై 180 కేసులు, దాదాపు నాలుగు నెలలపాటు జైలు జీవితం గడపడం జరిగింది. నాటి ఉద్యమ నేత, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కెసిఆర్ నాయకత్వంలో ఢిల్లీలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రతిపక్ష నాయకులను కలిసిన బృందంలో విద్యార్థి ఉద్యమ నాయకుడు రాజారాం యాదవ్ ఉన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ కంకి హోటల్లో రాజారామ్ యాదవ్ అధ్యక్షతన జరిగిన విద్యార్థి జేఏసీ సమావేశంలో ఉద్యమ నేత కెసిఆర్, ప్రొఫెసర్ కోదండరాం పాల్గొనడం జరిగింది. ఆ సమావేశం నుంచే కెసిఆర్, ప్రొఫెసర్ కోదండరాంలు సకలజనుల సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది.
సైకిల్ యాత్ర సామూహిక ఆమరణ నిరాహార దీక్ష లాంటి ఎన్నో కార్యక్రమాలను రాజారామ్ యాదవ్ విజయవంతంగా నిర్వహించి తెలంగాణ ఉద్యమంలో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నాడు
రాజకీయ జీవితం
[మార్చు]రాజారాం యాదవ్ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసి తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం 2014లో తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ ఓడిపోయాడు. ఆయన 2017 అక్టోబరులో టీడీపీకి రాజీనామా చేసి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరి[4][5] ఆ పార్టీ అధికార ప్రతినిధిగా పని చేసి 2018 నవంబర్ 2న నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీలో చేరాడు.[6][7]
బిసిల హక్కుల కోసం స్వతంత్ర ఉద్యమ సంస్థ బిసి జనసభను స్థాపించి జూన్ 15న ఇందిరా పార్క్ దగ్గర బీసీ సంఘాలు, బీసీ జనసభ ఆధ్వర్యంలో బీసీల మహా ధర్నా నిర్వహించడం జరిగింది. జులై 15న బీసీ జనసభ ఆధ్వర్యంలో సెక్రటేరియట్ ముట్టడించి అరెస్ట్ కావడం జరిగింది. ఆ తర్వాత ఆగస్టు 10వ తారీఖు నాడు ఇందిరాపార్క్ దగ్గర రాజారామ్ అధ్యక్షతన బీసీల సత్యాగ్రహ దీక్ష విజయవంతం కావడం జరిగింది. బీసీ జనసభ, బీసీ సంఘాల సంయుక్త పోరాటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర కులగణన కోసం చర్యలు చేపట్టడం జరిగింది[8]
మూలాలు
[మార్చు]- ↑ "టిడిపిలోకి తెలంగాణలో వలసలు: రాజారాం, చాడ సురేష్". 21 May 2013. Archived from the original on 7 January 2025. Retrieved 7 January 2025.
- ↑ "42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యం". NT News. 19 May 2024. Archived from the original on 7 January 2025. Retrieved 7 January 2025.
- ↑ "స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయించాలి". Andhrajyothy. 11 August 2024. Archived from the original on 7 January 2025. Retrieved 7 January 2025.
- ↑ Sakshi (31 October 2017). "కాంగ్రెస్ కండువా కప్పుకున్న రేవంత్ రెడ్డి". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
- ↑ "It's official: Former TDP Telangana working president Revanth Reddy joins Congress" (in ఇంగ్లీష్). The News Minute. 31 October 2017. Archived from the original on 7 January 2025. Retrieved 7 January 2025.
- ↑ "OU student leader Rajaram Yadav joins TRS". 5 December 2018. Archived from the original on 7 January 2025. Retrieved 7 January 2025.
- ↑ "ఆర్మూర్‌లో కాంగ్రెస్‌కు షాక్". Sakshi. 4 December 2018. Archived from the original on 7 January 2025. Retrieved 7 January 2025.
- ↑ ABN (2024-10-12). "Caste Census: సమగ్ర కుల గణన." Andhrajyothy Telugu News. Retrieved 2025-01-08.