డి. రవీంద్ర నాయక్
డి. రవీంద్ర నాయక్ | |||
ఎంపీ
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2004 - 2008 | |||
ముందు | బోడకుంటి వెంకటేశ్వర్లు | ||
---|---|---|---|
తరువాత | ఎర్రబెల్లి దయాకర్ రావు | ||
నియోజకవర్గం | వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం | ||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1978 - 1985 | |||
ముందు | బి.రామశర్మ | ||
తరువాత | బద్దు చౌహాన్ | ||
నియోజకవర్గం | దేవరకొండ శాసనసభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 15 ఆగష్టు 1952 మొండ్రాయి గ్రామం, కొడకండ్ల మండలం, జనగామ జిల్లా, తెలంగాణ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | డి.టి.నాయక్, జానకి బాయి | ||
జీవిత భాగస్వామి | నందా నాయక్ | ||
సంతానం | ఇద్దరు కుమార్తెలు | ||
పూర్వ విద్యార్థి | ఉస్మానియా యూనివర్సిటీ |
ధరావత్ రవీంద్ర నాయక్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా, 2004లో వరంగల్ ఎంపీగా పనిచేశాడు.[1]
జననం, విద్యాభాస్యం
[మార్చు]రవీందర్ నాయక్ తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, కొడకండ్ల మండలం, మొండ్రాయి గ్రామంలో డి.టి.నాయక్, జానకి బాయి దంపతులకు 1952 ఆగస్టు 15లో జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి బిఏ పూర్తి చేశాడు. రవీందర్ నాయక్ 1978 జూలై 30న నందా నాయక్ ను వివాహమాడాడు, వారికీ ఇద్దరు కుమార్తెలున్నారు.
రాజకీయ జీవితం
[మార్చు]రవీందర్ నాయక్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1978లో దేవరకొండ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సి.పి.ఐ అభ్యర్థి కేతావత్ హరియా పై 15674 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2] ఆయన 1983లో తిరిగి రెండోసారి 3160 ఓట్ల మెజారిటీతో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశాడు.[3]
రవీందర్ నాయక్ కొంతకాలం క్రియాశీలక రాజకీయలకు దూరంగా ఉండి తెలంగాణ మలిదశ ఉద్యమంలో నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి 2004లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి బోడకుంటి వెంకటేశ్వర్లు పై గెలిచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు.[4] రవీంద్ర నాయక్ కొన్ని కారణాల వల్ల టిఆర్ఎస్ పార్టీని విడి కాంగ్రెస్ పార్టీలో చేరి టీపీసీసీ అధికార ప్రతినిధిగా పనిచేశాడు.[5] ఆయన 2019 సెప్టెంబరు 4న కాంగ్రెస్ పార్టీని విడి భారతీయ జనతా పార్టీలో చేరాడు.[6]
రవీంద్ర నాయక్ 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఇల్లందు నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[7][8] ఆయన 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఏప్రిల్ 19న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[9][10]
మూలాలు
[మార్చు]- ↑ Loksabha (2004). "DHARAVATH, SHRI RAVINDER NAIK". Archived from the original on 2006-06-19. Retrieved 13 December 2021.
- ↑ Sakshi (14 October 2023). "ఎమ్మెల్యేలయ్యారు.. ఎంపీలూ అయ్యారు!". Archived from the original on 24 October 2023. Retrieved 24 October 2023.
- ↑ Onefivenine (2014). "Devarakonda Assembly Constituency". Archived from the original on 13 December 2021. Retrieved 13 December 2021.
- ↑ Sakshi (5 November 2018). "ఎమ్మెల్యే అయ్యారు.. ఎంపీ అయ్యారు !". Archived from the original on 13 December 2021. Retrieved 13 December 2021.
- ↑ Sakshi (21 May 2017). "'సీఎం కేసీఆర్ మాటల మాంత్రికుడు'". Archived from the original on 13 December 2021. Retrieved 13 December 2021.
- ↑ Sakshi (4 September 2019). "బీజేపీలో చేరిన రేవూరి, రవీంద్ర నాయక్". Archived from the original on 13 December 2021. Retrieved 13 December 2021.
- ↑ India Today (4 December 2023). "Yellandu Assembly Election Results 2023 Highlights: INC's Koram Kanakaiah with 109171 defeats BRS's Banoth Hari Priya" (in ఇంగ్లీష్). Archived from the original on 25 December 2023. Retrieved 25 December 2023.
- ↑ Election Commission of India. "Election Commission of India - Yellandu 2023 Results". Retrieved 25 December 2023.
- ↑ NTV Telugu (19 April 2024). "కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ రవీంద్ర నాయక్". Archived from the original on 20 April 2024. Retrieved 20 April 2024.
- ↑ Prabha News (19 April 2024). "సీఎం సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ మాజీ ఎంపీ రవీంద్రనాయక్". Archived from the original on 20 April 2024. Retrieved 20 April 2024.