డిఫ్తీరియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డిఫ్తీరియా
డిఫ్తీరియా వాపు మెడకు కారణమవుతుంది, కొన్నిసార్లు దీనిని "బుల్ నెక్" అని పిలుస్తారు.
ప్రత్యేకతసంక్రమణ వ్యాధులు
లక్షణాలుగొంతు నొప్పి, జ్వరం, గొంతులో బూడిద రంగు లేదా తెల్లటి మచ్చ, దగ్గు మొరిగే విధంగా ఉంటుంది
ఉపద్రవాలుమయోకార్డిటిస్, నరాల వాపు, మూత్రపిండాల సమస్యలు, తక్కువ స్థాయి ప్లేట్లెట్ల కారణంగా రక్తస్రావం, అసాధారణ హృదయ స్పందన
సాధారణ ఆరంభం2–5 రోజులు సంక్రమణ
కారణాలుకొరినేబాక్టీరియం డిఫ్తీరియే అనే బ్యాక్టీరియా వల్ల కలిగే సంక్రమణం
నివారణడిఫ్తీరియా టీకా
చికిత్సయాంటీబయాటిక్స్ మందులు
ఔషధ ప్రయోగంఎరిత్రోమైసిన్ లేదా బెంజైల్పెనిసిలిన్
తరచుదనం4,500 (2015)
మరణాలు2,100 (2015)

డిఫ్తీరియా అను వ్యాధి కొరినేబాక్టీరియం డిఫ్తీరియే అనే బ్యాక్టీరియా వల్ల కలిగే సంక్రమణం. ఈ వ్యాధి సంకేతాలు, లక్షణాలు తేలికపాటి నుండి తీవ్రంగా మారవచ్చు. సాధారణంగా వ్యాధి సంక్రమించిన రెండు నుండి ఐదు రోజుల తర్వాత లక్షణాలు బహిర్గతం అవుతాయి. డిప్థీరియా సాధారణంగా వ్యక్తుల మధ్య ప్రత్యక్ష సంపర్కం ద్వారా లేదా గాలి ద్వారా వ్యాపిస్తుంది.[1] ఇది కలుషితమైన వస్తువుల ద్వారా కూడా వ్యాప్తి చెందవచ్చు . కొందరు వ్యక్తులుకు లక్షణాలు లేకుండా కూడా బాక్టీరియా ఉంటుంది, కానీ వ్యాధిని ఇతరులకు సంక్రమింప చేయగలుగుతారు.

లక్షణాలు

[మార్చు]

సాధారణంగా లక్షణాలు చాలా క్రమంగా ఏర్పడతాయి, గొంతు నొప్పి, జ్వరంతో ప్రారంభమవుతాయి. తీవ్రమైన సందర్భాల్లో, గొంతులో బూడిద రంగు లేదా తెల్లటి మచ్చ ఏర్పడుతుంది [2] [3]ఇది శ్వాసమార్గాన్ని అడ్డుకుంటుంది క్రూప్ వ్యాధిలో లాగ దగ్గు మొరిగే విధంగా ఉంటుంది.[2] శోషరస కణుపులు విస్తరించి మెడ కొంతవరకు ఉబ్బవచ్చు.[2] అందువలన దీనిని (బుల్ నెక్) అంటారు. ఒక రకం డిఫ్తీరియా లో చర్మం, కళ్ళు లేదా జననేంద్రియాలు కూడా ప్రభావితమవుతాయి.[3] ఈ వ్యాధి వలన మయోకార్డిటిస్, నరాల వాపు, మూత్రపిండాల సమస్యలు, తక్కువ స్థాయి ప్లేట్లెట్ల కారణంగా రక్తస్రావం సమస్యలతో ఆరోగ్యం సంక్లిష్టంగా ఉండవచ్చు. మయోకార్డిటిస్ వలన అసాధారణ హృదయ స్పందన ఎక్కువ అవవచ్చు. నరాల వాపు పక్షవాతానికి దారితీయవచ్చు.[2]

సి. డిప్థీరియా మూడు ప్రధాన రకాలు - వ్యాధి వివిధ తీవ్రతలను సూచి స్తాయి.[2] బాక్టీరియం ఉత్పత్తి చేసే విషపదార్ధాల (టాక్సిన్) కారణంగా ఈ లక్షణాలు ఏర్పడతాయి. సూక్ష్మజీవుల సంవర్ధనం (కల్చర్ పరీక్ష) ద్వారా గొంతు రూపాన్ని బట్టి రోగ నిర్ధారణ తరచుగా చేస్తారు. అయితే ఇంతకూ ముందు ఏర్పడిన సంక్రమణ వలన ఇకముందు సంక్రమణ ఏర్పడదు అనే అభిప్రాయం కూడదు. ఈ పరిస్థితి రోగిని సంక్రమణం నుంచి రక్షించకపోవచ్చు.[3]

నివారణ, చికిత్స

[మార్చు]

డిఫ్తీరియా టీకా వ్యాధి నివారణకు ప్రభావవంతంగా ఉంటుంది. అనేక మందుల మిశ్రమాలు (ఫార్ములేషన్స్ - ఒక నిర్దిష్ట సూత్రం ప్రకారం, నిర్దిష్ట ప్రయోజనం కోసం తయారుచేసిన పదార్థాల మిశ్రమాలు) అందుబాటులో ఉంటాయి. వీటిని బాల్యంలో మూడు లేదా నాలుగు మోతాదులను, టెటానస్ టీకా, పెర్టుసిస్ టీకా తో పాటు సిఫార్సు చేస్తారు. ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి డిఫ్తీరియా-టెటానస్ టీకా మరిన్ని మోతాదులను సిఫారసు చేస్తారు. రక్తంలో విషపదార్ధాలు విరుగుడు (యాంటీటాక్సిన్) స్థాయిని కొలవడం ద్వారా వ్యాధి నుండి రక్షణను ధృవీకరించవచ్చు. బహిర్గతం అయిన వారిలో డిప్థీరియాను నివారించవచ్చు. అలాగే యాంటీబయాటిక్స్ మందులు, ఎరిత్రోమైసిన్ లేదా బెంజైల్పెనిసిలిన్ తో చికిత్స చేయవచ్చు.[2] తీవ్రమైన సందర్భాల్లో శ్వాస మార్గాన్ని తెరవడానికి కొన్నిసార్లు 'ట్రాఖియోక్టటోమీ' అవసరం అవుతుంది.[3]

వ్యాధి ప్రాబల్యం

[మార్చు]

2015 లో, ప్రపంచవ్యాప్తంగా 4,500 కేసులు అధికారికంగా నివేదించబడ్డాయి, 1980 లో దాదాపు 100,000 నుండి తగ్గాయి.[4] 1980లకు ముందు, సంవత్సరానికి సుమారు ఒక మిలియన్ కేసులు సంభవించాయని చెపుతారు.[3] డిప్థీరియా ప్రస్తుతం సబ్-సహారా ఆఫ్రికా, భారతదేశం, ఇండోనేషియాలో ఎక్కువగా సంభవిస్తోంది.[5] 1990లో 8,000 మరణాలు, 2015లో 2,100 మరణాలు సంభవించాయి.[6][7] సర్వసాధారణంగా ఈ వ్యాధి ప్రాబల్యంలో ఉన్న ప్రాంతాల్లో, పిల్లలు ఎక్కువగా ప్రభావితమవుతారు. విస్తృతంగా టీకా వినియాగం వల్ల అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాలలో ఇది చాలా అరుదుగా ఉంది, అయితే టీకా వేయడం తగ్గితే తిరిగి ఉద్భవించవచ్చు.[8]

అమెరికా లో 1980, 2004ల మధ్య 57 కేసులు నమోదయ్యాయి. వ్యాధి నిర్ధారణ అయిన వారిలో 5% నుండి 10% వరకు మరణాలు సంభవిస్తున్నాయి. ఈ వ్యాధిని క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో హిప్పోక్రేట్స్ గుర్తించారు. ఈ బాక్టీరియాను 1882లో ఎడ్విన్ క్లెబ్స్ గుర్తించారు.[2]

సూచనలు

[మార్చు]
  1. Kowalski, Wladyslaw (2012). Hospital airborne infection control. Boca Raton, Florida: CRC Press. p. 54. ISBN 9781439821961. Archived from the original on 21 December 2016.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 Atkinson, William (May 2012). Diphtheria Epidemiology and Prevention of Vaccine-Preventable Diseases (12 ed.). Public Health Foundation. pp. 215–230. ISBN 9780983263135. Archived from the original on 15 September 2016.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 "Diphtheria vaccine" (PDF). Wkly Epidemiol Rec. 81 (3): 24–32. 20 January 2006. PMID 16671240. Archived (PDF) from the original on 6 June 2015.
  4. "Diphtheria". who.int. 3 September 2014. Archived from the original on 2 April 2015. Retrieved 27 March 2015.
  5. Mandell, Douglas, and Bennett's Principles and Practice of Infectious Diseases (8 ed.). Elsevier Health Sciences. 2014. p. 2372. ISBN 9780323263733. Archived from the original on 21 December 2016.
  6. GBD 2015 Mortality and Causes of Death, Collaborators. (8 October 2016). "Global, regional, and national life expectancy, all-cause mortality, and cause-specific mortality for 249 causes of death, 1980–2015: a systematic analysis for the Global Burden of Disease Study 2015". Lancet. 388 (10053): 1459–1544. doi:10.1016/s0140-6736(16)31012-1. PMC 5388903. PMID 27733281. {{cite journal}}: |first1= has generic name (help)CS1 maint: numeric names: authors list (link)
  7. GBD 2013 Mortality and Causes of Death, Collaborators (17 December 2014). "Global, regional, and national age-sex specific all-cause and cause-specific mortality for 240 causes of death, 1990–2013: a systematic analysis for the Global Burden of Disease Study 2013". Lancet. 385 (9963): 117–71. doi:10.1016/S0140-6736(14)61682-2. PMC 4340604. PMID 25530442. {{cite journal}}: |first1= has generic name (help)CS1 maint: numeric names: authors list (link)
  8. Al, A. E. Paniz-Mondolfi et (2019). "Resurgence of Vaccine-Preventable Diseases in Venezuela as a Regional Public Health Threat in the Americas – Volume 25, Number 4 – April 2019 – Emerging Infectious Diseases journal – CDC". Emerging Infectious Diseases (in అమెరికన్ ఇంగ్లీష్). 25 (4): 625–632. doi:10.3201/eid2504.181305. PMC 6433037. PMID 30698523.