డానీ మోరిసన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డేనియల్ మోరిసన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
డేనియల్ కైల్ మోరిసన్
పుట్టిన తేదీ (1966-02-03) 1966 ఫిబ్రవరి 3 (వయసు 58)
ఆక్లాండ్, న్యూజీలాండ్
మారుపేరుమ్యాడ్ మ్యాన్
ఎత్తు175 సెం.మీ.
బ్యాటింగుకుడిచేతి
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ మీడియం
పాత్రబౌలర్, వ్యాఖ్యాత
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 164)1987 4 December - Australia తో
చివరి టెస్టు1997 24 January - England తో
తొలి వన్‌డే (క్యాప్ 58)1987 31 October - India తో
చివరి వన్‌డే1996 13 November - Pakistan తో
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI FC LA
మ్యాచ్‌లు 48 96 142 165
చేసిన పరుగులు 379 171 1,127 283
బ్యాటింగు సగటు 8.42 9.00 10.94 8.08
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 42 20* 46* 30*
వేసిన బంతులు 10,064 4,586 13,298 7,862
వికెట్లు 160 126 440 212
బౌలింగు సగటు 34.68 27.53 30.22 26.47
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 10 2 19 2
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 7/89 5/34 7/82 5/34
క్యాచ్‌లు/స్టంపింగులు 14/– 19/– 43/– 31/–
మూలం: Cricinfo, 2017 4 May

డేనియల్ కైల్ మోరిసన్ (జననం 1966, ఫిబ్రవరి 3) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్, క్రికెట్ వ్యాఖ్యాత.[1][2] అవుట్‌స్వింగర్‌తో పేస్ బౌలర్‌గా రాణించాడు. 1987లో 21 ఏళ్ళ వయసులో ఆస్ట్రేలియాపై న్యూజీలాండ్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.[3]

అంతర్జాతీయ క్రికెట్

[మార్చు]

1994, మార్చి 25న భారత్‌పై వన్డే ఇంటర్నేషనల్ లో హ్యాట్రిక్ సాధించడం ద్వారా అత్యంత ముఖ్యమైన బౌలర్ గా గుర్తింపు పొందాడు.[4] ప్రపంచవ్యాప్తంగా వన్డే హ్యాట్రిక్ సాధించిన ముగ్గురు న్యూజీలాండ్ ఆటగాళ్ళలో, 22మంది ఆటగాళ్ళలో ఇతను ఒకడు.

1997, జనవరి 28న జాతీయ జట్టుకు చివరిసారిగా ఆడాడు. ఇంగ్లాండ్‌పై పదో వికెట్‌కు నాథన్ ఆస్టిల్‌తో కలిసి 106 పరుగుల భాగస్వామ్యంలో 14 పరుగులు చేసి మ్యాచ్‌ను కాపాడాడు. మ్యాచ్ అనంతరం అతడిని జట్టు నుంచి తప్పించారు.

తన అంతర్జాతీయ కెరీర్‌లో, న్యూజీలాండ్ తరపున 1987, 1992, 1996 మొదలైన మూడు క్రికెట్ ప్రపంచ కప్‌లలో ఆడాడు.[5][6]

క్రికెట్ తర్వాత

[మార్చు]

అంతర్జాతీయ క్రికెట్ నుండి వైదొలిగినప్పటి నుండి, అనేక క్రికెట్-సంబంధిత స్థానాల్లో నియమించబడ్డాడు. వీటితొ పాటు:

  • టివిఎన్జెడ్, స్కై స్పోర్ట్స్, ఫాక్స్ స్పోర్ట్స్‌లో వ్యాఖ్యాత
  • ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో వ్యాఖ్యాత
  • బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో వ్యాఖ్యాత
  • పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో వ్యాఖ్యాత
  • కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో వ్యాఖ్యాత
  • 7 సంవత్సరాలుగా స్కై స్పోర్ట్స్ "క్రికెట్ కంపెనీ" షో హోస్ట్
  • 6 సంవత్సరాల పాటు రేడియో స్పోర్ట్‌లో రేడియో షో హోస్ట్
  • 'ఫైట్ ఫర్ లైఫ్' - మెనింజైటిస్ అప్పీల్‌తో సహా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు
  • పాఠశాలలు, క్లబ్‌ల కోసం కోచింగ్‌
  • అతిధి ఉపన్యాసకుడు
  • 2008, 2009 లో అధికారిక న్యూజిలాండ్ బీచ్ క్రికెట్ జట్టు కోసం బ్యాటర్/బౌలర్

మూలాలు

[మార్చు]
  1. "Danny Morrison backs New Zealand in the World Cup; praises India's spin arsenal". crictracker.com. May 18, 2019.
  2. Subramanian, Suresh (November 12, 2019). "Danny Morrison celebrates historic season of Jakarta cricket". The Jakarta Post. Jakarta.
  3. Geenty, Mark (December 22, 2019). "Boxing Day test pain lingers, 32 years on: 'Absolutely plumb. Game, set and match'". Stuff - New Zealand.
  4. "First One-Day International, NEW ZEALAND v INDIA 1993–94". espncricinfo. 25 March 1994. Retrieved 12 October 2014.
  5. Ghosh, Sandipan. "ICC Cricket World Cup 2019: It's Quite A Wide-Open World Cup – Danny Morrison". sportzwiki.com.
  6. Mehta, Jigar (July 9, 2019). "World Cup Memories: 'Martin Crowe was very secretive about Dipak Patel, he kept him under wraps,' Danny Morrison recalls New Zealand's 1992 run". Firstpost.

బాహ్య లింకులు

[మార్చు]