Jump to content

డాక్టర్ బాబు

వికీపీడియా నుండి
డాక్టర్ బాబు
(1973 తెలుగు సినిమా)
దర్శకత్వం లెనిన్ బాబు
నిర్మాణం తమ్మారెడ్డి కృష్ణమూర్తి
తారాగణం శోభన్‌బాబు ,
జయలలిత
సంగీతం టి.చలపతిరావు
నేపథ్య గానం ఘంటసాల
నిర్మాణ సంస్థ రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

సాంకేతికవర్గం

[మార్చు]
  • కథ: వజ్రేంద్ర సిన్జా
  • మాటలు: మోదుకూరి జాన్సన్
  • పాటలు: సినారె, దాశరథి, మోదుకూరి జాన్సన్
  • సంగీతం: టి.చలపతిరావు
  • ఛాయాగ్రహణం: కన్నప్ప
  • కూర్పు: అక్కినేని సంజీవి
  • కళ: సూరన్న
  • దర్శకత్వం: తమ్మారెడ్డి లెనిన్ బాబు
  • చిత్రానువాదం, నిర్మాత: తమ్మారెడ్డి కృష్ణమూర్తి

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
  1. అల్లనేరేడు చెట్టుకాడ అమ్మలాల లేత సూరీడు పొడిచాడే అమ్మలాలా - పి.సుశీల - రచన:సినారె
  2. వయసు పిచ్చిది ప్రేమ గుడ్డిది
  3. విరిసే కన్నులలో వేయి బాసలున్నవిలే అవి నా గుండెలలో అల్లరి చేస్తున్నవిలే (ప్రేమగీతం) - ఘంటసాల - రచన:సినారె
  4. గాజులైతే తొడిగాడు నా రాజు నా మోజులైతే తీరేవి ఏరోజు - పి.సుశీల - రచన:సినారె
  5. నా రాతకొద్దీ దొరికాడు పాత బావయ్యా తన చేతికందిన జాంపండు చేదంటాడయ్యా - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన:సినారె
  6. నీ వనుకున్నది నే కలగన్నది చెలీ చెలీ నీ చిగురు పెదవిలో దాగున్నది - ఘంటసాల, పి.సుశీల - రచన:సినారె
  7. విరిసే కన్నులలో వేయి బాసలున్నవిలే అవి నా గుండెలలో అల్లరి చేస్తున్నవిలే (విరహగీతం) - పి.సుశీల - రచన:సినారె
  8. ఎవడురా దొంగ ఎవడురా దొరలకూ ద్రోహులకూ దొరకని నేనా తుచ్ఛులకూ లుచ్ఛాలకు లొంగని నేనా- మాధవపెద్ది - రచన: మోదుకూరి జాన్సన్

డి.ఐ.జి. నారాయణరావు కొడుకు శేఖర్‌బాబు తన మేనకోడలుతో విదేశాలలో చదువు ముగించుకుని స్వదేశానికి తిరిగివస్తున్న విమానాన్ని బలవంతంగా ఒక అడవిలో దించాల్సివస్తుంది. ఆ హడావుడిలో సుస్తీ చేసిన ఒక రోగికి వైద్యం చేసే నిమిత్తం వెళ్ళిన శేఖర్ గజదొంగల చేతికి చిక్కి స్పృహ తప్పి పడిపోతాడు. అతడిని అన్వేషిస్తూ వెళ్ళిన వాళ్లు కూడా గజదొంగ మల్లు ముఠాబారిన పడి సర్వం ఆ దొంగలకు అప్పగించి నిరాశతో ఇంటి ముఖం పడతారు. స్పృహ తప్పి పడివున్న శేఖర్‌ను ఆ ప్రాంతంలో నివశించే గౌరి అనే కోయజాతి పిల్ల తన ఇంటికి తీసుకువెళుతుంది. ఆ చుట్టుపక్కల ఉండే అమాయకపు పల్లీయులను మోసం చేస్తూ ఘనవైద్యుడిగా చెలామణి అవుతున్న భూతాలవైద్యుడు దేవయ్య విదేశాలలో వైద్యంలో శిక్షణ పూర్తి చేసుకుని వచ్చిన శేఖర్‌కు వైద్యం చేయబూనుతాడు. దేవయ్య భూతవైద్యం బూటకమని శేఖర్ నచ్చచెప్పి తనను కాపాడిన గౌరి, ధర్మన్నలకు కృతజ్ఞతలు చెప్పి తన ఇంటికి బయలుదేరుతాడు. ధర్మన్నకు జబ్బు చెస్తే గౌరి పోతురాజు దగ్గర కొంత డబ్బు అప్పు తీసుకుని ధర్మన్నను తీసుకుని పట్నానికి పోయి డాక్టర్ బాబును కలుస్తుంది. శేఖర్ చేతిచలవ వల్ల ధర్మన్నకు స్వస్థత చేకూరుతుంది. శేఖర్ లాంటి డాక్టర్ ఒకడు తమ ప్రాంతంలో ఉంటే ఎంతమంది దీన ప్రజలకు మేలు కలుగుతుందో అని ధర్మన్న వ్యక్తం చేయగా శేఖర్ ఆ ప్రాంతానికి వెళ్ళడానికి నిశ్చయిస్తాడు.

మూలాలు

[మార్చు]
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.

బయటి లింకులు

[మార్చు]