టోలెడో హిందూ దేవాలయం
స్వరూపం
టోలెడో హిందూ దేవాలయం | |
---|---|
ప్రదేశం | |
దేశం: | యునైటెడ్ స్టేట్స్ |
రాష్ట్రం: | ఓహియో |
ప్రదేశం: | సిల్వేనియా |
అక్షాంశ రేఖాంశాలు: | 41°41′37″N 83°43′18″W / 41.693509°N 83.721705°W |
టోలెడో హిందూ దేవాలయం, అమెరికాలోని ఓహియో రాష్ట్రంలోని, టోలెడో నగరానికి సమీపంలోని సిల్వేనియాలో ఉన్న హిందూ దేవాలయం. యూనివర్సటీ ఆఫ్ టోలెడో, బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్శిటీలోని 300 మంది భారతీయ విద్యార్థులతోపాటు టోలెడో మెట్రోపాలిటన్ ప్రాంతంలోని 400పైగా హిందూ భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది.[1][2]
చరిత్ర
[మార్చు]టోలెడోలో పెరుగుతున్న ప్రవాస భారతీయులకు ఒక ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేదికకోసం 1964లో ది ఇండియా అసోసియేషన్ ఆఫ్ టోలెడో అనే సంస్థస్థాపించబడింది. ఈ తరువాత 1982లో హిందూ టెంపుల్ ఆఫ్ టోలెడో సంస్థ ఏర్పడింది. 1989లో దేవాలయంకోసం మొదటి శాశ్వత భవనం నిర్మించబడింది.
2019లో టోలెడో హిందూ దేవాలయం 30వ వార్షికోత్సవం నిర్వహించబడింది. ఈ వార్షికోత్సవంలో లక్ష్మిపూజ జరిగింది.[3] 2019 అక్టోబరు 27న జరిగిన దేవాలయ 30వ దీపావళి వేడుకలకు 500 కుటుంబాలు హాజరయ్యారు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "About Us". Hindu Temple of Toledo. Retrieved 2022-03-09.[permanent dead link]
- ↑ "Toledo Hindu Temple Hours, History, Events and Services". TemplesinIndiaInfo. Retrieved 2022-03-09.
- ↑ "Hindu Temple of Toledo Celebrates 30 Years of Faith and Culture". toledo blade. 17 August 2019. Retrieved 2022-03-09.
- ↑ Henderson, Emma (27 October 2019). "Northwest Ohio Celebrates Hindu New Year, Diwali". wtol. Retrieved 2022-03-09.