టోక్యో స్టోరి
టోక్యో స్టోరి (టోక్యో కథా, 東京物語 Tōkyō Monogatari) 1953, నవంబర్ 3న విడుదలైన జపాన్ చలనచిత్రం. యసుజిరో ఓజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిషో రై, చికో హిగాషియామా నటించారు.
కథానేపథ్యం
[మార్చు]ఒక వృద్ధాప్య జంట తమ పిల్లలను చూడటానికి టోక్యోకు వెలుతుంది. అక్కడ వారి పిల్లలు తమ పనుల్లో మునిగిపోయి వీరిని పట్టించుకోరు. అప్పుడు ఆ వృద్ధ జంట ఏంచేశారన్నది కథాంశం.
నటవర్గం
[మార్చు]- చిషో రై
- చికో హిగాషియామా
- సెట్సుకో హరా
- హరుకో సుగిమురా
- కాబట్టి యమమురా
- కునికో మియాకే
- కైకో కగావా
- ఎజిరో టోనో
- నోబు నకమురా
- షిరో ఒసాకా
- హిసావో టోక్
- తెరుకో నాగోకా
- ముట్సుకో సాకురా
- తోయో తకాహషి
- టారు అబే
- సచికో మితాని
- జెన్ మురాస్
- మిత్సుహిరో మోరి
- జుంకో అనామి
- రికో మిజుకి
- యోషికో తోగావా
- కజుహిరో ఇటోకావా
- కీజిరో మొరోజుమి
- సుటోము నిజిమా
- షాజా సుజుకి
- యోషికో తాషిరో
- హరుకో చిచిబు
- తకాషి మికీ
- బిన్నోసుకే నాగావో
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: యసుజిరో ఓజు
- నిర్మాత: తకేషి యమమోటో
- రచన: కోగో నోడా, యసుజిరో ఓజు
- సంగీతం: కొజున్ సైతా
- ఛాయాగ్రహణం: యహారు అట్సుత
- కూర్పు: యోషియాసు హమమురా
- నిర్మాణ సంస్థ: షోచికు
విడుదల - స్పందన
[మార్చు]టోక్యో స్టోరీ 1953, నవంబరు 3నజపాన్‌లో విడుదలైంది. షిగే పెద్ద కుమార్తె పాత్రలో నటించినందుకు హరుకో సుగిమురా 1954లో ఉత్తమ సహాయ నటిగా మెయినిచి ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది.[1] 1957లో లండన్‌లోని నేషనల్ ఫిల్మ్ థియేటర్‌లో ప్రదర్శించబడింది.[2] అకిరా కురొసావా తీసిన రషోమాన్ 1951 వెనిస్ చలన చిత్రోత్సవంలో విజయవంతంగా ప్రదర్శించిన తరువాత జపనీస్ చిత్రాలు అంతర్జాతీయంగా పంపిణీ చేయడం ప్రారంభించబడ్డాయి.[3] 1958లో సృజనాత్మక చిత్రంగా మొదటి సదర్లాండ్ ట్రోఫీని అందుకుంది.[4]
ఇతర వివరాలు
[మార్చు]- దర్శకుల పోల్‌లో 1992లో 17వ స్థానంలో, 2002లో సైకో, ది మిర్రర్‌తో 16వ స్థానంలో, 2012లో అగ్రస్థానంలో నిలిచింది. 358 మంది డైరెక్టర్లలో 48 ఓట్లను పొందింది.[5][6][7][8]
- ఓజు తీసిన అన్ని సినిమా మాదిరిగానే టోక్యో స్టోరీ సినిమా కూడా నెమ్మదిగా ఉంటుంది.[9]
- ముఖ్యమైన సంఘటనలు తరచుగా తెరపై చూపకుండా సంభాషణల ద్వారా చెప్పించాడు. ఉదాహరణకు టోక్యోకు, వెళ్ళే రైలు ప్రయాణాలు చిత్రీకరించబడలేదు.[10]
మూలాలు
[మార్చు]- ↑ "第9回". THE MAINICHI NEWSPAPERS. Retrieved 13 August 2019.
- ↑ Desser. 1997. p. 145
- ↑ Dresser. 1997. p. 2.
- ↑ "Sutherland Trophy". 2013. Retrieved 13 August 2019.
- ↑ "The 2012 Sight & Sound Directors' Top Ten". Sight & Sound. British Film Institute. 2 August 2012. Retrieved 13 August 2019.
- ↑ "Top Ten Poll 1992 - Directors' and Critics' Poll". Sight & Sound. Published by British Film Institute. Archived from the original on 2012-01-11. Retrieved 13 August 2019.
- ↑ "Sight & Sound Top Ten Poll 2002 - The rest of the directors' list". Sight & Sound. Published by British Film Institute. Archived from the original on 2012-03-09. Retrieved 13 August 2019.
- ↑ "The Top 50 Greatest Films of All Time". Published by British Film Institute. 1 August 2012. Retrieved 13 August 2019.
- ↑ David Bordwell; Kristin Thompson (2003). Film History: An Introduction (2nd ed.). McGraw-Hill. p. 396.
- ↑ David Desser (2005). "The Space of Ambivalence". In Jeffrey Geiger (ed.). Film Analysis. Norton. pp. 462–3.
ఇతర లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో టోక్యో స్టోరి
- టోక్యో స్టోరి at Rotten Tomatoes
- Tokyo Story: Compassionate Detachment an essay by David Bordwell at the Criterion Collection